Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ నేడు అత్యున్నత శ్రేణి ప్రచారాన్ని # ఇంజిన్స్ ఆఫ్ శీర్షికన ప్రారంభించింది. గాలి కాలుష్యం తగ్గించాల్సిన ఆవశ్యకత పట్ల అవగహన మెరుగుపరచడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. లఘు స్ట్రీట్ ప్లే ద్వారా రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్స్ పడి తమ వాహనాలను నిలిపిన వాహనదారులను గ్రీన్ సిగ్నల్స్ పడేంత వరకూ తమ వాహనాల ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ప్రోత్సహిస్తోంది. బ్యాంకు ఈ షార్ట్ ప్లేను భారతదేశ వ్యాప్తంగా 40 నగరాలలోని 126 రద్దీ సిగ్నల్స్ వద్ద నిర్వహించనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రచారం జూన్ 05వ తేదీ ప్రారంభం కానుంది. ముంబై, గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, పూనెలాంటి మెట్రోలతో పాటుగా చిన్న నగరాలైన లుథయానా, వారణాసి, నాసిక్, రాజ్‌కోట్, గౌహతి లలో ఈ ప్రచారం చేయనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం 7 మిలియన్ల మంది ప్రజలు గాలి కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. ఇంజిన్లను ఆఫ్ చేయడం లాంటి చిన్న పనులు కూడా వ్యక్తులు వెదజల్లే ఉద్గారాలు సగానికి పైగా తగ్గేందుకు తోడ్పడతాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యొక్క దేశవ్యాప్త ఈఎస్జీ ప్రచారంలో ఈ స్ట్రీట్ ప్లే అంతర్భాగం. సస్టెయినబల్ వృద్ధి దిశగా మనం వేసే చిన్న అడుగులను ఇది హైలైట్ చేస్తుంది. నేడు మనం మార్చుకునే అంశాల కారణంగా భవిష్యత్ ఏ విధంగా ఉత్తమంగా ఉంటుందనేది ఇది చూపుతుంది.ఈ బ్యాంక్ ఇప్పుడు నాలుగు వినూత్నమైన చిత్రాలను సైతం విడుదల చేసింది. ఇవి బ్యాంకు యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘పరివర్తన్’ కింద చేపట్టిన సామాజిక, పర్యావరణ కార్యక్రమాలను సైతం ఈ ప్రచారంలో భాగంగా చూపుతుంది. ‘‘బాధ్యతాయుతంగా ప్రవర్తించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎప్పుడూ కట్టబడి ఉంటుంది. భారతదేశపు అతిపెద్ద బ్యాంకుగా, మేము తప్పనిసరిగా మా బ్రాండ్‌ను సానుకూల సామాజిక ప్రభావం సృష్టించడంతో పాటుగా కమ్యూనిటీల జీవితాలలో మార్పును తీసుకువచ్చేందుకు వినియోగించడాన్ని నమ్ముతుంటాం’’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎంఓ శ్రీ రవి సంతానం అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఈ ప్రచారంతో, భవిష్యత్‌కు కలిగే నష్టం నివారించడానికి మనం తీసుకోగల చిన్న చర్యలే అయినా వాటి పట్ల అవగాహన మెరుగుపరచాలనుకుంటున్నాము. మనమంతా ఏకతాటిపైకి రావడంతో పాటుగా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా అత్యుత్తమమైన రేపటిని మనం సృష్టించగలము’’ అని అన్నారు. దేశంలో అత్యధికంగా కార్పోరేట్ సీఎస్ఆర్ కోసం ఖర్చు చేస్తోన్న సంస్ధలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటి. పరివర్తన్ కింద బ్యాంకు దృష్టి కేంద్రీకరించిన అత్యంత కీలకమైన విభాగాలలో వాతావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పరిశుభరత మరియు ఆర్ధిక అక్షరాస్యత ఉన్నాయి.