Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లు పెంచనుందన్న అంచనాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. సోమవారం సెషన్లో ఐటీ, లోహ, ఎఫ్ఎంసీజీ సూచీల అమ్మకాలతో బీఎస్ఈ సెన్సెక్స్ 94 పాయింట్లు కోల్పోయి 55,675కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 379 పాయింట్లు కోల్పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 15 పాయింట్లు తగ్గి 16,570 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.15 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.54 శాతం చొప్పున నష్టపోయాయి. ఆర్బీఐ ఎంపీసీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్ణయాలను ప్రకటించనుంది. కాగా ఈ భేటీలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుందన్న నిపుణుల అంచనాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.