Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 'ఇంజిన్ఆఫ్' ప్రచారాన్ని చేపట్టింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పిస్తోంది. ఈ ఇంజిన్ఆఫ్ కార్యక్రమంలో భాగంగా రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడళ్లలో వాహనదారులు సిగల్ కోసం వేచి ఉన్న సమయంలో వాహనదారులు తమ వాహనాలను నిలిపివుంచిన సమయంలో వారి ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేయమని ఒక చిన్న వీధి నాటకం ద్వారా వారిని ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 40 నగరాలలోని 126 రద్దీ ఎక్కువగా ఉండే సిగల్ కూడళ్లలో ఈ చైతన్యాన్ని చేపడుతుంది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో దీన్ని నిర్వహిస్తుంది.