Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ రూ.50 కోట్ల నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. సంస్ధాగత కొనుగోలు దారులు (క్యుఐబి)లకు 12.50 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించినట్లు తెలిపింది. మూడు అంతర్జాతీయ సంస్ధలు ఈ వాటాలు కొనుగోలు చేశాయని వెల్లడించింది. ఫోర్బెస్ ఇఎంఎఫ్కు 5.4 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 43.2 శాతం ఈక్విటీషేర్లను, నోమురా సింగపూర్ లిమిటెడ్‌కు 4.4 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 35.2 శాతం వాటాను కేటాయించారు. మిగిలిన 2.7 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 21.6 ను ఎజి డైనమిక్ ఫండ్స్‌కు అందించింది.