Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులుగా రవీంద్రనాథ్ ఠాగూర్, ఎపిజె అబ్దుల్ కలాం ఫొటోలను ముద్రించనున్నట్టు వస్తోన్న వార్తలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖండించింది. కరెన్సీపై కొత్త ముఖాలా ముద్రణకు సంబంధించి ఎలాంటి కొత్త ప్రతిపాదన లేదని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాళ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ, బ్యాంకు నోట్లలో మార్పు ఉండదన్నారు.
మళ్లీ వడ్డీ రేట్ల పెంపు..!
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సోమవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) బుధవారంతో ముగియనుంది. ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచనున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపోరేటు 25-50 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవలే 40 బేసిస్ పాయింట్లు పెంచి రెపోరేటును 4.40 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే.