Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1 మిలియన్ కొత్త కస్టమర్లు మొదటిసారిగా EORS అనుభూతి పొందుతారని అంచనా
- ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ట్రాఫిక్ 40% ఉంటుందని అంచనా
- ~2500+ ఇన్ఫ్లుయన్సర్లచే 1000 లైవ్ సెషన్లు, వీటిలో 750 ఎమ్-లైవ్‌లో EORS ఆఫర్లలో ప్రదర్శించేందుకు ఉంచిన బ్రాండ్లు
- 85% డెలివరీలు 21,000 కిరాణా(మెన్సా) భాగస్వాములు పూర్తి చేస్తారని అంచనా. తద్వారా వారికి అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి
- EORS-16 సమయంలో వస్తుందని ఊహించిన డిమాండ్ ద్వారా 27.5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సీజనల్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు
- ఓమ్నిచానెల్ ఇంటిగ్రేషన్‌లో భాగంగా ఈవెంట్‌ను నిర్వహణకు సాయపడేందుకు ~3800 స్టోర్లలో 300+ బ్రాండ్లు
- 5000+ బ్రాండ్లలో 14 లక్షలకు పైగా స్టైల్స్‌తో అతిపెద్ద సేకరణ
బెంగుళూరు : దేశంలోని లక్షలాది మంది ఫ్యాషన్ అభిమానులకు ఆనందం, ఉత్సాహాన్ని అందించేందుకు భారతదేశపు అతి గొప్ప ఫ్యాషన్ ఈవెంట్ మింత్రా ద్వైవార్షిక ఈఓఆర్ఎస్ 16వ ఎడిషన్ వస్తోంది. జూన్ 11 నుండి 16 వరకు జరిగే ఈ ఈవెంట్ గతంలో నిర్వహించిన వాటి కంటే భారీగా ఉండనుంది. ఇందులో 5000+ బ్రాండ్లకు చెందిన 14 లక్షల స్టైల్స్ చూడవచ్చు. ఈ 6-రోజుల ఈవెంట్ - దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 లక్షల ప్రత్యేకమైన కస్టమర్లకు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, బ్యూటీ పర్సనల్ కేర్, హోమ్ కేటగిరీల్లో అద్భుతమైన ఆఫర్లు అందించడానికి సిద్ధంగా ఉంది. గత జూలై ఎడిషన్ పోల్చితే 26% అధిక ట్రాఫిక్‌తో పాటు BAUలో 3% అధిక డిమాండ్‌ను ఇందులో ఉంటుందని అంచనా. ఈ ఎడిషన్‌లో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది కస్టమర్లు వస్తారని, ఆ ట్రాఫిక్‌లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి వచ్చే వారి సంఖ్య 40% ఉంటుందని మింత్రా అంచనా వేస్తోంది.
దుకాణదారులు దేని గురించి ఉత్సాహంగా ఉండాలి?
ప్రత్యేకంగా వేసవి అవసరాలు, జెన్-Z ట్రెండ్స్, బ్యూటీ, పర్సనల్ కేర్‌తో పాటు సెలబ్రిటీల నేతృత్వంలోని EORS ప్రత్యేక కలెక్షన్స్ ఎంపిక చేయడంపై బ్రాండ్స్ అన్ని ప్రాధాన్యత ఇచ్చాయి.
మొదటిసారి కొనుగోలు చేసే వారికి తొలి ట్రాన్సక్షన్‌పై రూ. 500 క్యాష్‌బ్యాక్ పొందుతారు. అలాగే భవిష్యత్ ఉపయోగం కోసం అద్భుతమైన కూపన్లతో పాటు మొదటి 4 ఆర్డర్లకు ఉచిత డెలివరీ అందుకుంటారు. చెల్లింపుల విషయంలో ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకుల నుంచి 10% తక్షణ తగ్గింపును అందుకోవచ్చు. పేటీఎం వినియోగదారులు వాలెట్ & పోస్ట్‌పెయిడ్ లావాదేవీలపై హామీ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
మారుతున్న కస్టమర్ల అవసరాలు తీర్చడానికి 100 కొత్త బ్రాండ్స్‌ను మింత్రా EORS చేర్చడంతో పాటు గత జూలై ఎడిషన్‌తో పోల్చితే స్టైల్ సెలక్షన్లో 40% పెంచింది. అంటే కొనుగోలుదారులు ఎంచుకునేందుకు D2C బ్రాండ్లతో పాటు దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన విస్తృత శ్రేణి కేటలాగ్ అందుబాటులో ఉంటుంది.