Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐఈఎక్స్ వాల్యూమ్ పరంగా మే., 2022లో 7,596 ఎంయు చేరుకుందిబీ అన్ని మార్కెట్ విభాగాలలో ఇయర్ ఆన్ ఇయర్ 16% వృద్ధిని చేరుకుంది.
రియల్ టైమ్ విద్యుత్ మార్కెట్ 2319 ఎంయుగా ఉండటంతో పాటుగా అత్యద్భుతంగా 61% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి సాధించింది
ఇయర్ ఆన్ ఇయర్ 80% వృద్ధితో గ్రీన్మార్కెట్లో 642 ఎంయు వాల్యూమ్ సాధించింది.ఈ నెలలో 2.75 లక్షల ఆర్‌ఈసీలను ఎక్సేంజ్ వాణిజ్యం చేసింది.
జీటీఏఎం హైడ్రో కాంట్రాక్ట్స్ అప్రోపస్ సెర్క్ అప్రూవల్‌లో ఐఈఎక్స్ వాణిజ్యం చేయడం ప్రారంభించింది. మే 2022లో 3.6 ఎంయు వాల్యూమ్ చేరుకుంది.
న్యూఢిల్లీ : మే 2022లో ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (ఐఈఎక్స్) వద్ద 7596 ఎంయు విద్యుత్ వాణిజ్యం జరిగింది. దీనిలో సంప్రదాయ విద్యుత్ మార్కెట్ 6680 ఎంయును గ్రీన్ పవర్ మార్కెట్ 642ఎంయు మరియు 275 ఎంయు (2.75 లక్షల సర్టిఫికెట్స్)ను ఆర్ఈసీ మార్కెట్లో నమోదు చేసింది. మొత్తంమ్మీద అన్ని మార్కెట్ విభాగాలలోనూ 16% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని ఎక్సేంజ్ నమోదుచేసింది.
నేషనల్ లోడ్ డిశ్పాచ్ సెంటర్ ప్రచురించిన పవర్ డిమాండ్ డాటా ప్రకారం, జాతీయ స్థాయిలో గరిష్ట వినియోగం మే 2022లో 136 బీయు గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ 23% వృద్ధిని ఈ నెలలో నమోదు చేయడంతో పాటుగా విద్యుత్ డిమాండ్ పరంగా 204.45 గిగావాట్ వద్ద 21% వృద్ధిని ఇయర్ ఆన్ ఇయర్ పద్దతిలో నమోదు చేసింది.
సరఫరా పరంగా ఎదురవుతున్న అవరోధాలను అధిగమించేందుకు సమయానుకూలంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటుగా పునరుత్పాదక (ఇయర్ ఆన్ ఇయర్ 44% వృద్ధి) మరియు హైడ్రోపవర్ జనరేషన్ (ఇయర్ ఆన్ ఇయర్ 8% వృద్ధి)లో వృద్ధి కారణంగా ఐఈఎక్స్ వద్ద డే –ఎహెడ్ పవర్ మార్కెట్లో గణనీయంగా ధరల సర్దుబాటు జరిగింది. ఇది ఏప్రిల్ 2022లో యూనిట్‌కు 10.06 రూపాయలుగా ఉండగా మే 2022లో అది యూనిట్‌కు 6.76 రూపాయలుగా నిలిచింది.
ఎలక్ట్రిసిటీ మార్కెట్ : డే–ఎహెడ్, టర్మ్–ఎహెడ్ మరియు రియల్ టైమ్ మార్కెట్స్
ఈ నెలలో డేఉఏహెడ్ మార్కెట్ పరిమాణం 3173 ఎంయు వాల్యూమ్‌ను నమోదు చేసింది. తద్వారా ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి ఈ నెలలో 27% క్షీణత నమోదు చేసింది. సరాసరి ధర ఒక్కో యూనిట్‌కు 6.76 రూపాయలు. మార్కెట్ క్లియరింగ్ ధరలో క్షీణత మంత్ ఆన్ మంత్ 33% నమోదు చేసింది. ఏప్రిల్ 2022లో సరాసరి నెలవారీ యూనిట్ ధర 10.06 రూపాయలుగా ఉంది.
రియల్ టైమ్ మార్కెట్ వాల్యూమ్ 2319 ఎంయుగా ఉంది. ఇది ఏప్రిల్ 2022లో 1704 ఎంయు నుంచి వృద్ధి చెందింది. తద్వారా 61% వృద్ధి నమోదుచేసింది. అత్యధిక సింగిల్ డే వాల్యూమ్ ఈ నెలలో 19 మే 2022 104.39 ఎంయు నమోదు చేయడం ద్వారా చేరుకుంది. మంత్ ఆన్ మంత్ పద్ధతిలో సరాసరి నెలవారీ మార్కెట్ క్లియరింగ్ ధరలు యూనిట్‌కు 5.88 రూపాయలుగా నిలిచింది. తద్వారా మంత్ ఆన్ మంత్ పద్ధతిలో 38% క్షీణత నమోదు చేసింది. మొత్తంమ్మీద మే నెలలో ఆర్టీఎం మార్కెట్లో 592 పార్టిస్పెంట్స్ లావాదేవీలను నిర్వహించారు.
ఇంట్రా డే, కంటింజెన్సీ, డెయిలీ మరియు వీక్లీ కాంట్రాక్ట్స్‌తో కూడిన టర్మ్ ఎహెడ్ మార్కెట్ 1189 ఎంయు వాణిజ్యంను ఈ నెలలో చేసింది. తద్వారా 211% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని నమోదుచేసింది.
గ్రీన్ మార్కెట్ : డే ఏహెడ్ మరియు టర్మ్ ఎహెడ్ మార్కెట్స్
డే ఎహెడ్ మరియు టర్మ్ ఎహెడ్ మార్కెట్ విభాగాలతో కూడిన ఐఈఎక్స్ వద్ద గ్రీన్ మార్కెట్ , ఈ నెలలో మొత్తంమ్మీద 642 ఎంయు వాల్యూమ్‌ను చేరుకుంది. తద్వారా 80% వృద్ధిని నమోదు చేసింది.
గ్రీన్ డే ఎహెడ్ మార్కెట్ 493 ఎంయు వాల్యూమ్‌ను ఈ నెలలో వెయిటెడ్ యావరేజ్ ధర యూనిట్‌కు 5.91 రూపాయల ను నమోదు చేసింది. మొత్తంమ్మీద 172 మంది పార్టిస్పెంట్స్ ఈ వాణిజ్యంలో పాల్గొన్నారు.
గ్రీన్ టర్మ్ ఎహెడ్ మార్కెట్ 148 ఎంయు వాల్యూమ్‌ను చేరుకుంది. ఈ మార్కెట్లో అత్యధికంగా 23 మార్కెట్ పార్టిస్పెంట్స్ మే04వ తేదీన పాల్గొన్నారు. సౌర విద్యుత్‌కు ఈ నెలలో సరాసరి ధర యూనిట్‌కు 6.41 రూపాయలుగా ఉంది. అదే సమయంలో సౌర విద్యుతేతర సరాసరి నెలవారీ ధర యూనిట్‌కు 8.21 రూపాయలుగా ఉంది.
ఢిల్లీ, హర్యానా, తెలంగాణా, కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్, డామన్ అండ్ డయ్యూ, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలలోని పలు కీలక పంపిణీ సంస్థలతో పాటుగా పలు పారిశ్రామిక వినియోగదారులు సైతం ఈ నెలలో ఎక్సేంజ్‌ల గ్రీన్ మార్కెట్లో పాల్గొన్నారు.
పునరుత్పాదక విద్యుత్ ధృవీకరణ మార్కెట్
ఈ ఎక్సేంజ్ మొత్తంమ్మీద 2.75 లక్షల పునరుత్పాదక విద్యుత్ సర్టిఫికెట్స్ ను బుధవారం, 25 మే 2022 నాడు ఐఈఎక్స్ వద్ద ట్రేడింగ్ సెషన్లో క్లియర్ చేశారు. దీనిలో 1.71 లక్షల నాన్ సోలార్ ఆర్ఈసీలు , క్లియరింగ్ ధర ఒక్క ఆర్ఈసీకి 1000 రూపాయలు తో మరియు 1.03 లక్షల సోలార్ ఆర్ఈసీలు క్లియరింగ్ ధర ఒక్క ఆర్ఈసీకి 2201 రూపాయలతో వాణిజ్యం చేసింది.
ఈ ఎక్సేంజ్ వద్ద తరువాత ఆర్ఈసీ ట్రేడింగ్ సెషన్‌ను 29 జూన్ 2022 బుధవారం చేయనున్నారు.