Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచానికి ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోని ఎన్నో ఒత్తిడితో కూడిన సవాళ్లను ఎదుర్కొని వాటికి అత్యంత ప్రభావవంతమైన మరియు శాశ్వత పరిష్కారాలను అందించిన సంస్థ. అంతేకాకుండా ఎంతోమంది స్వచ్చంద సేవలకుల నేతృత్వంలో నడపబడుతున్న ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ రోటరీ ఇంటర్నేషనల్. ఈ సంస్థ యొక్క 113వ అంతర్జాతీయ వార్షిక సమావేశం జూన్ 4, 2022లో హ్యూస్టన్ లో అత్యంత వైభవంగా జరిగింది.
గతంలో రోటరీ ఎన్నో వార్షికోత్సవాలు నిర్వహించింది. అయితే ఈసారి మాత్రం కాస్త విభిన్నంగా ఏర్పాట్లు చేసింది. ఇది రోటరీ క్లబ్ యొక్క మొట్టమొదటి హైబ్రిడ్ కన్వెన్షన్. దీనికోసం 100 దేశాలు మరియు ఐదు ఖండాల నుండి దాదాపు 10,000 మందికి పైగా రోటరీ ప్రతినిధులు వ్యక్తిగతంగా మరియు ఆన్లైన్లో పాల్గొన్నారు. సభ్యులు ఒకరినొకరు కనెక్ట్ చేసుకోవడమే కాకుండా... చాలా విషయాలు ఈ సందర్భంగా నేర్చుకున్నారు. దీంతోపాటు... కమ్యూనిటీలలో శాశ్వతమైన మార్పును సృష్టించడానికి ప్రపంచ ప్రఖ్యాత స్పీకర్లచే ప్రేరణ పొందారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ... "రోటరీ ఇంటర్నేషనల్ స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రతను అందించడంలో చురుకుగా పని చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. రోటరీలు తమ సొంత రంగంలో విజయం సాధించినప్పటికీ, తమను తాము పరిమితం చేసుకోలేదు. వారు తమ నిబద్ధతను, కృషిని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నారు. ఇది మన మానవాళిని మరింతగా మెరుగుపర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు ఆయన.
గతంలో ఉన్న పోలియో మహమ్మారిని ఈ ప్రపంచం నుంచి పారద్రోలడంలో రోటరీ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అదే విధంగా 2025 నాటికి భారతదేశం నుంచి టీబీ మహమ్మారిని పారద్రోలడంలో మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రోటరీ సభ్యులను కోరారు. గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ (GPEI)లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని భాగస్వాములు మరియు ప్రభుత్వాలతో కలిసి 99.9% పోలియో కేసులను తగ్గించడంలో రోటరీ కీలక పాత్ర పోషించింది. పోలియో నిర్మూలన కోసం రూపొందించిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు కోవిడ్-19 వంటి ఇతర వ్యాధుల నుండి మిలియన్ల మంది ప్రజలను రక్షించడానికి కూడా సమర్థవంతంగా ఉపయోగించబడ్డాయి.
ఈ సందర్భంగా ప్రస్తుత రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు శేఖర్ మెహతా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... దేవుడు మనకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి ఏంటంటే... జీవితాలను మార్చడం. మనం మన ప్రయత్నాల ద్వారా మరియు ఇతరులకు సేవ చేయడం ద్వారా చాలామంది జీవితాల్లో మార్పును తీసుకురాగలం. సమాజానికి సేవ చేయాలనే గుణం మన నరనరాల్లో పాతుకుపోయింది. అలాగే రాబోయే రోజుల్లో మరింత సేవ చేయడం మన మిషన్ లో భాగం. గత ఏడాదిలో, ఖండాలలో వందల కంటే ఎక్కువ రోటరీ క్లబ్లను సందర్శించి, పోలియోను అంతం చేయడం, నైపుణ్యాభివృద్ధి