Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు పర్యాటక కేంద్రాల వైవిధ్యతల్లో కోస్తా, పర్వతాలు మరియు నగరాల ఆవలకూ విస్తరించింది. ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటిగా ఆధ్యాత్మికత, పరంపర మరియు సంప్రదాయాలు అన్నింటినీ కలుపుకున్న సంగమంగా భారతదేశం ఉంది. మహమ్మారి పరిస్థితులు నియంత్రణలోకి వచ్చిన తర్వాత స్థానిక పర్యాటక ప్రాంతాలను ఆవిష్కరించేందుకు ఉత్తేజిస్తుండగా, గత రెండేళ్ల నుంచి సాంస్కృతిక పర్యాటకం అత్యంత ముందంజలో ఉంది. భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులు ప్రయాణ అనుభవాలను, అభిప్రాయాలను అధ్యయనం చేసిన గ్లోబల్ ట్రావెల్ కంపెనీ ఓయో నేడు ‘ఇండియాస్ ట్రెజర్ ట్రూవ్ ఆఫ్ కల్చరల్ ట్రావెల్ 2022’ నివేదికను విడుదల చేసింది. ఈ అధ్యయన నివేదిక ప్రకారం గత రెండేళ్లలో 3.5 రెట్లు అభివృద్ధి సాధించగా 2022లో సాంస్కృతిక కేంద్రాల్లో శ్రీనగర అత్యంత ఎక్కువ బుకింగ్‌లను సాధించింది. శ్రీనగర్ మాత్రమే కాకుండా జమ్ము మరియు కశ్మీర్‌లలో పహల్గామ్ మరియు జమ్ము భారతదేశంలో ముందంజలో ఉన్న 5 సాంస్కృతిక కేంద్రాల్లో ర్యాంక్ సాధించగా, ఈ ప్రాంతాల్లో పర్యాటకానికి ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తించింది.
జనవరి నుంచి ఏప్రిల్ 2022 వరకు ఓయో బుకింగ్ డేటా విశ్లేషణ ప్రకారం శ్రీనగర, పహల్గామ్, బోధ్‌గయా, శిరడి మరియు జమ్ము ర్యాంకింగ్‌లలో టాప్ 5 సాంస్కృతిక కేంద్రాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం తన ఆధ్యాత్మికతకు ఖ్యాతి ఆర్జించింది. సాంస్కృతిక- పర్యాటక విభాగంలో ఓయో డేటా పుణ్యక్షేత్రాలు మరియు పరంపరల కేంద్రాలకు వినియోగదారుల్లో ఎక్కువ ఆసక్తిని చాటి చెబుతోంది. ఎక్కువ మంది ప్రజలు వారణాసిని ఆధ్యాత్మిక కేంద్రంగా చూస్తుండగా, ఇది 2022లో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న పుణ్యక్షేత్రాల జాబితాలో చేరింది. దీని తర్వాత తిరుపతి, పూరి, అమృతసర్ మరియు శిరిడి ఉన్నాయి. ఇవే కాకుండా ఓయో మిడ్-సమ్మర్ వెకేషన్ ఇండెక్స్‌లో ఈ వేసవిలో వైష్ణోదేవి భేటీకి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి కనబరిచారు.
ఈ నివేదిక ప్రకారం పరంపరను కలిగిన కేంద్రాలకు వస్తే ఔరంగాబాద్‌లోని అజంతా మరియు ఎల్లోరా గుహలు మరియు ఆగ్రాలోని తాజ్‌మహల్ అగ్రగామి కేంద్రాలుగా ఉండగా తలా 25% ఓట్లు దక్కించుకున్నాయి. హంపి, ఖజురహో మరియు మహాబలిపురం మిగిలిన అగ్రగామి 5 కేంద్రాల్లో ఉన్నాయి.
సాంస్కృతిక పర్యాటకంలో పర్యాటకకు సంఖ్య వృద్ధికి సంబంధించి ఓయోలో ప్రొడక్ట ఎస్వీపీ అండ్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గోడ్బోలే మాట్లాడుతూ, ‘‘సాంస్కృతిక పర్యాటకం భారతదేశపు పర్యాటక ఆర్థిక వ్యవస్థకు అపారమైన చేయూత ఇస్తోంది. భారతదేశవ్యాప్తంగా స్థానిక పర్యాటకంలో వృద్ధి కనిపిస్తుండగా, ప్రజలు గత కొన్నేళ్ల నుంచి శ్రీమంతమైన సాంస్కృతిక కేంద్రాలను ఆవిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు. మేము పలు గోప్యంగా ఉండే రత్నాలు, చరిత్ర ప్రసిద్ధ కేంద్రాలు, పవిత్ర కేంద్రాలు మరియు ఆధ్యాత్మిక లేదా ఆరోగ్య చికిత్సలు చేయించుకునే కేంద్రాలను యువత ఎక్కువగా భేటీ కావడాన్ని మేము చూశాము. వారణాసి, శిరడి, రాజస్థాన్ మరియు కేరళ 2021 నుంచి ఈ ఉద్దేశానికి వరుసగా అత్యంత ఎక్కువ బుకింగ్‌లు చేసుకుంటున్న నగరాలుగా ఉన్నాయి. సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రయాణం సదృఢం అవుతున్నట్లే మేము స్థానికంగా నిర్వహణ చేస్తున్న హోటళ్లు మరియు హోం స్టేల యజమానులకు వరుసగా మద్ధతు ఇస్తుండగా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజనాన్ని ఇచ్చి స్వయం ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాము. మా స్థానిక హోమ్‌స్టే కార్యకలాపాలను జమ్ము మరియు కాశ్మీర్‌లోని కెవాడియా మరియు పెహల్గామ్లో చేసినట్లు వినియోగదారులకు అనుకూలకరమైన బుకింగ్‌ల క్యాన్సిలేషన్ మరియు మార్పులను కూడా అందిస్తోంది. పే ఎట్ హోటల్ ఎంపిక అటువంటి ప్రముఖ కేంద్రాల్లో ఎక్కువ పర్యాటకుల సంఖ్యను ఆకట్టుకుంటుంది.
ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే, ఈ సమీక్షకు స్పందించిన వారిలో 7% మంది ప్రఖ్యాత స్థానిక పుణ్యక్షేత్రాల్లో స్టే చేసేందుకు కోరుకుంటున్నారని తేటతెల్లం చేసింది. అంటే పుణ్యక్షేత్రాలకు ఇతర కేంద్రాలకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునే సామర్థ్యం ఉండగా, చిన్న స్థానిక వ్యాపారాలకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. ఓయో పండుగలు మరియు లాంగ్ వీకెండ్లలో ఆధ్యాత్మిక కేంద్రాలకు డిమాండ్ స్పష్టంగా ఎక్కువ కావడాన్ని గమనించింది. ఉదాహరణకు ఏప్రిల్‌లో విషు మరియు బైశాఖి పండుగ లాంగ్ వీకెండ్లో ఓయో హరిద్వార మరియు అమృతసర్ తదితర పుణ్యక్షేత్రాల వద్ద ఎక్కువ బుకింగ్‌లు ఉన్నట్లు గుర్తించింది.
స్థానిక సముదాయాల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో మరియు స్థానిక యువతకు స్టార్టప్ ప్రారంభించే పారిశ్రామికవేత్తలు అయ్యేందుకు మద్ధతు ఇచ్చే దిశలో ఓయో ఇటీవల జమ్ము మరియు కశ్మీర్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘క్రౌన్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా’ అనే దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ప్రభుత్వ మిషన్ యూత్ ప్రోగ్రామ్ ద్వారా ఓయో 75 గ్రామాల్లో హోమ్ స్టేలను ప్రారంభించడం ద్వారా వ్యాపార దక్షతను అభివృద్ధి పరిచే మరియు స్వయం-ఉద్యోగ అవకాశాలను సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉంది. అదే తరహాలో రైతులకు అదనపు ఆదాయ మూలాలను సృష్టించేందుకు మరియు వారికి మద్ధతు ఇచ్చేందుకు ఓయో అగ్రి-స్టేస్ ప్రారంభించగా, దాని మొదటి ప్రాయోజిత అనుష్ఠానం గత ఏడాది గుజరాత్‌లోకి కేవాడియాలో (ఇప్పుడు ఏక్తానగర్) ప్రారంభించింది.