Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రఖ్యాత అంతర్జాతీయ స్మార్ట్-డివైస్ బ్రాండ్ ఒప్పో తన K సిరీస్‌లో సరికొత్త K10 5Gని నేడు ఆవిష్కరించింది. ఇది ఒప్పో గ్లో 7.99ఎంఎం అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో కూడిన ఫోన్ ఇది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ కలిగి ఈ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 5జీబీ ర్యామ్ వరకు పెంచుకోవచ్చు. ఎక్కువ సేపు పనిచేసే 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, మెరుపు వేగంతో ఛార్జింగ్ అయ్యే 33W SUPERVOOCTM ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన అత్యంత సన్నని 5G ఫోన్ K10 5G. మైమరపింపజేసే అనుభూతి, బిగ్గరగా, స్పష్టమైన ధ్వని, గొప్ప సరౌండ్ సౌండ్ అందించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా-లీనియర్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ వ్యవస్థ ఉంది.
స్టైలిష్ డిజైన్
అల్ట్రా-స్లిమ్ డిజైన్, సొంతమైన ఒప్పో గ్లోతో ఆకట్టుకునేలా ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది K10 5G ఫోన్. ఒప్పోకు ప్రత్యేకమైన గ్లిట్టర్ శాండ్ ప్రాసెస్ ఉపయోగించి రూపొందించిన ఈ ఫోన్ వెనుక ప్యానెల్ గ్లాసీ, మ్యాటీ టెక్స్చర్తో సమ్మిళితమై ఉంటుంది. ఇది ఒక విశిష్ఠమైన మెటల్ ఆకృతిని సృష్టించి ఫింగర్ ప్రింట్ కారణంగా ఫోన్‌పై గీతలు పడకుండా చూస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎర్గోనామిక్ స్టైలింగ్‌తో పాటు సొగసైన స్ట్రెయిట్ మిడిల్-ఫ్రేమ్ డిజైన్ కలిగి ఉంది. భారీ బ్యాటరీ సామర్థ్యం ఉన్నప్పటికీ ఇది కేవలం 7.99ఎంఎం మందంతో కూడి ఉంది. రెండు అద్భుతమైన వర్ణాల్లో ఇది అందుబాటులో ఉంది -
• మిడ్నైట్ బ్ల్యాక్ - బ్ల్యాక్ కాన్వాస్‌లో మెరిసే నక్షత్ర ప్రభావాన్ని చూపుతుంది
• ఓషన్ బ్లూ ఫినిష్‌లో ప్రీమియం లుక్ కోసం అడుగు భాగంలో బ్లూ -గ్రే గ్రేడియంట్ కలిగి ఉంటుంది
అసమానమైన పనితీరు
ఒప్పో K10 5G ఏడు 5G బ్యాండ్స్‌కు సపోర్టు చేసే మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్ శక్తిని కలిగి ఉంది. 6nm ప్రాసెస్ టెక్నాలజీ ఆప్టిమైజ్డ్, స్మూత్ గేమింగ్ అనుభూతిని, 2.4GHz క్లాక్ స్పీడ్ ల్యాగ్ ఫ్రీ అనుభూతిని యూజర్లకు అందిస్తుంది. ఇది 8జీబీ RAMతో (5జీబీ వరకు RAM పెంచుకోవచ్చు)128జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. బహుళ యాప్స్, మీడియా మధ్య వేగంగా, నిరంతరాయంగా మారేందుకు కావాల్సిన దాని కంటే ఎక్కువ మెమరీ అందిస్తుంది.
5000ఎంఎహెచ్ బ్యాటరీతో కూడిన ఈ అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్ మెరుపు-వేగంతో ఛార్జింగ్ అందించే 33W SUPERVOOCTM టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. ఆప్టిమైజ్ నైట్ ఛార్జింగ్, పోర్ట్ యాంటీ-బర్న్ ప్రొటెక్షన్, ఛార్జింగ్ ఓవర్-టెంపరేచర్ కంట్రోల్, ఆల్-డే AI పవర్ సేవింగ్ వంటి యూజర్-సెంట్రిక్ ఫీచర్లతో కూడి ఉంది. ఈ డివైస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. అంటే యూఎస్బీ కేబుల్ ఉపయోగించి దీని ద్వారా ఇతర డివైసులు ఛార్జ్ చేయవచ్చు. K10 5G టైప్-C ఛార్జింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్ కలిగి ఉంది. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్స్ OS 12.1 పై రన్ అవుతుంది. యూజర్లు వేరే యాప్స్ ఉపయోగిస్తున్నా మ్యూజిక్, వీడియోస్ వంటి బ్యాక్‌గ్రౌండ్ స్ట్రీమ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. అంతే కాకుండా ఇది నిరంతరాయ గేమింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో ఫ్లెక్స్డ్రాప్, స్మార్ట్ సైడ్ బార్, గూగుల్ లెన్స్‌తో త్రీ-ఫింగర్ ట్రాన్స్‌లేట్ వంటి ఫీచర్లు రోజువారీ సామర్థ్యాన్ని పెంచుతాయి.
టాప్ క్లాస్ ఆడియో సిస్టమ్
ఒప్పో K10 5Gలో అల్ట్రా-లీనియర్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ అద్భుతమైన ధ్వని అందించడమే కాదు ఔట్పుట్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మ్యూజిక్‌ను శ్రావ్యంగా అందించేందుకు ఈ ఫోన్లో ఇయర్ ఫోన్స్‌లాగా పనిచేస్తాయి. అంతే కాకుండా ఈ ఫోన్లో అమర్చిన ఆల్ట్రా -వాల్యూమ్ మోడ్ మీడియా/రింగ్టోన్స్/అలారమ్స్/నోటిఫికేషన్స్ కోసం 100% కంటే ఎక్స్టర్నల్ వాల్యూమ్ సెట్టింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఒప్పో K10 5G అల్ట్రా-లీనియర్ స్పీకర్ శ్రేణి నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి 3D సరౌండ్ సౌండ్ రింగ్టోన్లను రూపొందించడానికి సౌండ్ ఎన్హాన్స్మెంట్ స్పెషలిస్ట్ డైరాక్తో ఒప్పో భాగస్వామ్యం కలిగి ఉంది.
ఆకట్టుకునే డిస్ప్లే
ఒప్పో K10 5G - 100% DCI-P3 హై కలర్ గ్యామట్‌తో 6.56’’ HD+ 90Hz కలర్-రిచ్ డిస్ప్లేను కలిగి ఉంది. కచ్చితమైన దృశ్య ప్రభావాన్ని చూపేందుకు రంగులను తగినట్టుగా అనుసంధానించుకుంటూ చక్కని చిత్రాలు అందిస్తుంది. ప్రకాశవంతమైన లేదా చీకటి వాతావరణంలో ఆ పరిసర కాంతికి తగినట్టుగా స్క్రీన్ విజిబిలిటీ పెంచేందుకు లేదా తగ్గించేందుకు దీనిలో ఆల్-డే AI ఐ కంఫర్ట్ ఆటోమ్యాటిక్‌గా గుర్తిస్తుంది.
కెమెరా
48MP AI డ్యూయల్ కెమెరా (f/1.7) సెటప్, 108 MP అల్ట్రా-క్లియర్ ఇమేజ్ ఫీచర్ కలిగిన K10 5G చక్కని రంగుల్లో ఎటువంటి మచ్చలు లేకుండా చిత్రాన్ని బంధిస్తుంది. దీనిలోని అల్ట్రా-క్లియర్ 108 MP ఇమేజ్ సున్నితమైన వివరాలు సంగ్రహించి అధిక పిక్సెల్ చిత్రాలు పునర్నిర్మించడానికి సాఫ్ట్వేర్ అల్గారిథమ్ ఉపయోగిస్తుంది. ఇందులో 2MP డెప్త్ కెమెరా (f/2.4) కూడా ఉంది. శబ్దాన్ని తగ్గించడానికి, ప్రకాశవంతమైన, మరింత వివరణాత్మక నైట్ షాట్స్ తీసేందుకు అల్ట్రా నైట్ మోడ్ సహ అనేక ఫీచర్లకు ఇది సపోర్టు చేస్తుంది. మసగ్గా ఉండే బ్యాక్‌గ్రౌండ్స్‌తో పెద్ద పోర్ట్రెయిట్ షూట్ చేసేందుకు దీనిలోని పోర్ట్రెయిడ్ మోడ్ సాయపడుతుంది. అలాగే మెరుగైన చక్కని ఔట్పుట్ అందించేందుకు ఇమేజ్ పేరామీటర్స్ను ఏఐ సీన్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ అడ్జస్ట్ చేస్తుంది. ఈ పరికరం ముందు భాగంలో AI పోర్ట్రెయిట్ రీటచింగ్తో కూడిన శక్తివంతమైన 8MP ఫ్రంట్ కెమెరా (f/2.0) ఉంది.
ధర, లభ్యత
ఒప్పో K10 5G అమ్మకాలు జూన్ 15, 2022 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ – ఫ్లిప్‌కార్ట్, మెయిన్‌లైన్ రిటైల్ అవుట్లెట్లు, ఒప్పో ఆన్లైన్ స్టోర్‌లో ప్రారంభమవుతాయి. ధర రూ. 17,499. ఫ్లిప్‌కార్ట్ లేదా ఒప్పో ఆన్లైన్ స్టోర్‌లో K10 5Gని కొనుగోలు చేసే కస్టమర్లు ఎటువంటి ఖర్చు లేని 3 నెలల ఈఎంఐ పొందవచ్చు. ఎస్బీఐ డెబిట్/క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలు, యాక్సిస్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 ఫ్లాట్ తగ్గింపు పొందవచ్చు.