Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు నం.1 ప్యాకేజ్డ్ అటా బ్రాండ్, మల్టీగ్రెయిన్లు కలిగిన ఆశీర్వాద్ అట్టా, ఆశీర్వాద్ వాల్యూ-యాడెడ్ అట్టా వేరియంట్, మే 29, 2022న వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డేకి ముందుగా తన ఫ్లాగ్షిప్ హ్యాపీ టమ్మీ వెబ్సైట్లో ఫైబర్ మీటర్ & మై మీల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. జీర్ణక్రియకు సంబంధించిన అవగాహన, ప్రాముఖ్యతను మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ పోషించే పాత్రను తెలియజేసేందుకు బ్రాండ్ చేస్తున్న ప్రయత్నాలను విస్తరించేందుకు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చేపట్టింది. ఈ బ్రాండ్ 2021లో మామ్స్ప్రెస్సో నిర్వహించిన ‘ఏ సర్వే ఆన్ డైజెస్టివ్ హెల్త్’ పేరిట నిర్వహించిన సమీక్షకు స్పందించిన వారిలో 56% భారతీయ తల్లులు తమ కుటుంబం జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొంది. సమీక్షకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని, జీర్ణక్రియ గురించి వినియోగదారులకు అవగాహన కల్పించే ఒక ప్లాట్‌ఫారమ్‌ను హ్యాపీ టమ్మీ వెబ్సైట్ http://happytummy.aashirvaad.com/ ను బ్రాండ్ ప్రారంభించింది మరియు 2 నిమిషాల్లో జీర్ణ ప్రక్రియ గురించి మరింత తెలుసుకునేందుకు భారతదేశపు మొట్టమొదటి డైజెస్టివ్ కోషియంట్ (DQ) పరీక్షను నిర్వహిస్తోంది.
గత ఏడాది, ఈ కార్యక్రమం ద్వారా 12 లక్షల కన్నా ఎక్కువ మంది భారతీయ వినియోగదారులు వెబ్‌సైట్‌ను సందర్శించగా, వారిలో 3.3 లక్షల కన్నా ఎక్కువ మంది ఎక్కువ మంది DQ పరీక్షను ఎదుర్కొన్నారు. పోషకాహార రంగంలో నిపుణుల బ్లాగులు, వీడియోలు అలాగే అధిక ఫైబర్‌తో కూడిన వంటకాలు తదితతర కంటెంట్ వెబ్సైట్లో ఉంది. ఇది వినియోగదారులకు డైటీషియన్తో సంప్రదింపులను బుక్ చేసుకునే అవకాశాన్నీ ఇస్తుంది. హ్యాపీ టమ్మీ గురించి సంభాషణను ఒక స్థాయి పైకి తీసుకువెళ్లేందుకు అనుగుణంగా బ్రాండ్ ఇప్పుడు–ఫైబర్ మీటర్ మరియు మై మీల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఫైబర్ మీటర్ ఒక వ్యక్తి తమ ప్రస్తుత ఆహారం ద్వారా సిఫార్సు చేయబడిన రోజువారీ ఫైబర్‌ను తీసుకుంటున్నారో లేదో సూచిస్తుంది. తదనంతరం, మై మీల్ ప్లాన్ సూచించిన డైట్ ప్లాన్‌ను అందిస్తుండగా, ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సు చేసిన డైటరీ అలవెన్స్లతో అందిస్తున్న డైటరీ ఫైబర్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. వినియోగదారులు వివిధ వంటకాల్లో సూచించిన భోజన ప్రణాళికల నుంచి దీన్ని ఎంచుకోవచ్చు. కొనసాగుతున్న ఈ ప్రయత్నం గురించి ఐటిసి లిమిటెడ్‌లో స్టేపుల్స్, స్నాక్స్ అండ్ మీల్స్, ఫుడ్స్ డివిజన్, ఎస్బియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గణేష్ కుమార్ సుందరరామన్ మాట్లాడుతూ, “గత ఏడాది మామ్స్ప్రెస్సో నిర్వహించిన ‘ఏ సర్వే ఆన్ డైజెస్టివ్ హెల్త్’ పేరిట నిర్వహించిన సమీక్షలో 56% మంది భారతీయ తల్లులు తమ కుటుంబ సభ్యులు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని సమీక్షలో పేర్కొన్నారు. అధిక ఫైబర్‌తో మల్టీగ్రెయిన్లు కలిగిన ఆశీర్వాద్ గోధుమపిండి, జీర్ణక్రియపై సమాచారాన్ని అందించడం ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు, దాన్ని వినియోగించుకునేందుకు, మరియు సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఇది 2021లో వినియోగదారులలో జీర్ణక్రియపై అవగాహన పెంచే లక్ష్యంతో మేము డైజెస్టివ్ కోషెంట్ (DQ) పరీక్షను అందుబాటులోకి తీసుకురాగా, ఇది చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయంపై మా దృష్టిని మరింత పెంచుకునేలా, ఇది మమ్మల్ని ప్రోత్సహించింది మరియు ప్లాట్‌ఫారమ్ కింద అదనపు కార్యక్రమాలు- ఫైబర్ మీటర్ మరియు మై మీల్ ప్లాన్ ప్రారంభిస్తున్నందుకు మేము ఇప్పుడు సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు. జీర్ణక్రియ ప్రాముఖ్యత గురించి వినియోగదారుల దృష్టిని ఆకట్టుకునేందుకు, మల్టీగ్రెయిన్లతో కూడిన ఆశీర్వాద్ గోధుమ పిండి పలు మాధ్యమాలలో కమ్యూనికేషన్‌ను క్రియాశీలకం చేసింది. వినియోగదారులు ఫైబర్ మీటర్‌ని పరీక్షించుకోవచ్చు మరియు http://happytummy.aashirvaad.com/ లో ఉచిత భోజన పథకాన్ని పొందవచ్చు.