Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కొన్ని దశాబ్దాలుగా గొప్ప ప్రగతిని కనబర్చుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ను మోడీ సర్కార్ స్టాక్ మార్కెట్లోకి తెచ్చి.. ఈ సంస్థను తీవ్ర అగాథంలో పడేసింది. దేశంలోని అతిపెద్ద ఈ బీమా కంపెనీ షేర్లు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొం టున్నాయి. గురువారం సెషన్లోనూ బీఎస్ఈలో ఈ సూచీ 2.17 శాతం నష్టపోయి రూ.721.95 వద్ద ముగిసింది. మార్కెట్ వాల్యుయేషన్‌లో నాలుగో వంతు తుడిచిపెట్టుకుపోయింది. ఐపీఓ ఇష్యూ ధర రూ.949తో పోల్చితే దాదాపు 25 శాతం విలువ తగ్గింది. మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయిన దగ్గరి నుంచి కేవలం నాలుగు సెషన్లలో మాత్రమే లాభపడింది. ఎల్ఐసీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.4.57 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.
నాలుగు రోజుల నష్టాలకు తెర..
వరుసగా నాలుగు సెషన్లలో నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం ఉపశమనం లభించింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల భయాలతో ప్రారంభంలో దాదాపు 300 కుప్పకూలిన సెన్సెక్స్ మధ్యాహ్నం నుంచి లాభాల వైపు సాగింది. ఆటో, సిమెంట్ తప్ప దాదాపు అన్ని రంగాలు రాణించడంతో తుదకు సెన్సెక్స్ 428 పాయింట్లు పెరిగి 55320 కు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 122 పాయింట్లు రాణించి 16478 వద్ద ముగిసింది.