Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నేడు ట్రేడ్ మరియు రిటెయిల్ వినియోగదారుల కోసం యుఎస్ డాలర్ (USD) యూరో (EUR) మరియు పౌండ్ స్టెర్లింగ్ (GBP)లో ఫుల్ వ్యాల్యూ ఔట్వర్డ్ రెమిటెన్స్ సేవను ప్రారంభించింది. మొదటిసారిగా ‘పూర్తి విలువ’ ఫీచర్ ఒక వినియోగదారుదు విదేశాలకు నగదు పంపించినప్పుడు, విదేశీ బ్యాంక్ ఛార్జీలలో ఎటువంటి తగ్గింపు లేకుండా, విదేశాలకు పంపిన పూర్తి మొత్తం విదేశీ లబ్ధిదారునికి చేరుతుందని ఇది నిర్ధారిస్తుంది.
బ్యాంక్ ఇప్పటి వరకు అమెరికన్ డాలర్ల డినామినేషన్లలో వ్యక్తిగత వినియోగదారులకు మాత్రమే పూర్తి విలువ చెల్లింపులకు మద్ధతు ఇస్తూ వచ్చింది. పరిశ్రమలో మొదటిసారిగా, ఇది వాణిజ్య సంబంధిత చెల్లింపుల లావాదేవీలకు ఈ సేవలను అందించేందుకు అనుగుణంగా ఈ ఆఫర్‌ను విస్తరించింది. ఇంకా, ఇది అమెరిన్ డాలర్, పౌండ్ స్టెర్లింగ్, యూరోలకు ఈ సేవలు అందుబాటులో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం మరియు రిటెయిల్ రెమిటెన్స్‌ల కోసం ప్రస్తుత మరియు పొదుపు ఖాతాదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
‘‘హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన వినియోగదారులను ఉత్తేజపరిచేందుకు టైలర్ మేడ్, వినూత్న ఉత్పత్తులను రూపొందించడంలో ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. దానితో మేము మా పూర్తి-విలువ కలిగిన బాహ్య చెల్లింపుల సేవను వ్యక్తుల కోసం మాత్రమే కాకుండా వ్యాపారులకూ అందుబాటులోకి తీసుకు వస్తున్నందుకు సంతోషిస్తున్నాము. చెల్లింపు జరిగే చోట వినియోగదారుల అవసరాలను మేము గమనించి, దాన్ని పరిష్కరించడం సంతోషంగా ఉంది. ఈ ప్రొడక్ట్ మా వినియోగదారులకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని మేము కచ్చితంగా అనుకుంటున్నాము” అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిటెయిల్ ట్రేడ్ అండ్ ఫారెక్స్ బిజినెస్ హెడ్ జతీందర్ గుప్తా అన్నారు.
భారతదేశం నుంచి వాణిజ్య సంబంధిత రెమిటెన్స్, సరళీకృత పథకం కింద వ్యక్తిగత సంబంధిత చెల్లింపులు మరియు భారతదేశం నుంచి (USD, GBP మరియు EURలో) మరియు రెమిట్నౌ- నెట్‌బ్యాంకింగ్ పోర్టల్ (USDలో మాత్రమే) కోసం బ్యాంకు శాఖను సంప్రదించడం ద్వారా సరళీకృత రెమిటెన్స్ పథకం కింద విదేశీ ఔట్వర్డ్ చెల్లింపుల సేవలను పొందవచ్చు.