Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ బీ2బీ ఎగ్జిబిషన్ల నిర్వాహక సంస్థ ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా తమ అత్యంత విజయవంతమైన ఈవెంట్లలో ఒకటైన హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్ అండ్ జెమ్ ఫెయిర్ (హెచ్‌జెఎఫ్ 2022)ను నేడు ముత్యాల నగరి హైదరాబాద్‌లో అతి పెద్ద వాణిజ్య వేదికలలో ఒకటైన హెచ్ఐసీసీ, నోవోటెల్, హైటెక్ సిటీ వద్ద ప్రారంభించింది. భారీ స్థాయిలో ఆభరణాలపై దృష్టి కేంద్రీకరించిన ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొనడంతో పాటుగా వజ్రాలు, ట్రెండింగ్‌లో ఉన్న బంగారం మరియు విలువైన ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సంవత్సరం, ఈ ప్రదర్శన అతి పెద్దది కావడంతో పాటుగా ఈ రంగం వృద్ధి సూచికగానూ నిలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక షోకు ముఖ్య అతిథిగా హిజ్ ఎక్స్‌లెన్సీ శ్రీ మొహమ్మద్ మాలికీ, అంబాసిడర్ టు ఇండియా , ఎంబసీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ మొరాకో పాల్గొనగా, గౌరవ అతిథిగా తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య ,ఐటీ , ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ; భారతదేశంలో టర్కీ కాన్సుల్ జనరల్, కాన్సులేట్ ఆఫ్ టర్కీ హైదరాబాద్– శ్రీ ఒర్హాన్ యల్మాన్ ఒకన్ ; తెలంగాణా బులియన్, జెమ్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ జగ్దీష్ ప్రసాద్ వర్మ ; హెచ్జెఎంఏ అధ్యక్షుడు శ్రీ మహేందర్ తయాల్ ; హెచ్జెఎంఏ కన్వీనర్ శ్రీ ముకేష్ అగర్వాల్ ; ఏఓజె శ్రీ సుమేష్ వధేరా ; ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యోగేష్ ముద్రాస్ ; ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా గ్రూప్ డైరెక్టర్ శ్రీమతి పల్లవి మెహ్రా ; ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా సీనియర్ పోర్ట్‌ఫోలియో డైరెక్టర్ శ్రీ పంకజ్ షెండీ పాల్గొన్నారు.
ఈ అంతర్జాతీయ షో కోసం ఎగ్జిబిటర్లను విభిన్నమైన విభాగాల నుంచి ఎంపిక చేశారు. ఈ ప్రదర్శకులు విస్తృత శ్రేణిలో ప్రపంచ శ్రేణి ఉత్పత్తుల రూపకల్పన సామర్ధ్యం, ప్రపంచ వ్యాప్తంగా విభిన్న మార్కెట్ల అవసరాలను తీర్చే శక్తి పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు. వీరు 1000కు పైగా ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్లను ప్రదర్శిస్తారు. దీనికి హైటెక్ సిటీ జ్యువెలరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (హెచ్జెఎంఏ), తెలంగాణా బులియన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫౌండేషన్ (టీబీజీజెఎఫ్), ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్స్మిల్ ఫెడరేషన్ (ఏఐజెజీఎఫ్), ద బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ (టీబీజెఏ), జెమ్ అండ్ జ్యువెలరీ ట్రేడ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీజెటీసీఐ) మద్దతునందిస్తున్నాయి. దాదాపు 50వేలకు పైగా నూతన డిజైన్లను ఎగ్జిబిటర్లు ప్రదర్శించనున్నారు. వీరిలో కీలకమైన ప్రదర్శకులలో శ్రీ శుభం జ్యువెలర్స్, స్వరూప్ జ్యువెలర్స్, చింతామణి గోల్డ్, నరేడీ జ్యువెల్స్, వినతి జ్యువెలర్స్ ; శ్రీ కల్పతరు, జ్యువెల్స్ పార్క్ మరియు జై గులాబ్ దేవ్ వంటివి ఉన్నాయి. ఈ ఎక్స్‌పోకు ముందుగా పలు రోడ్ షోలను చుట్టు పక్కల జిల్లాలైన కరీంనగర్, హనమ్‌కొండ, కావలి, ప్రొద్దుటూరు, వనపర్తిలలో నిర్వహించింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆభరణాల షోలలో ఒకటిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్ అండ్ జెమ్ ఫెయిర్ 2022 గురించి ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ ‘‘ ప్రపంచం కోసం భారతదేశపు తయారీ అనే భారత ప్రభుత్వ ప్రచారానికి ఓ క్లాసిక్ ఉదాహరణ హెచ్‌జెఎఫ్ 2022. ఈ తరహా భారీ ప్రదర్శన 75 బిలియన్ డాలర్లు/5.83 లక్షల కోట్ల ఎగుమతులను రాబోయే ఐదేళ్లలో చేరుకోవాలనే లక్ష్యానికి తోడ్పాటునందిస్తాయి. ఈ ఎక్స్‌పోలో పాల్గొన్న వారి స్పందన అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఈ రంగపు అభివృద్ధికి సైతం నిదర్శనంగా నిలువనుంది’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘ మెరిసే మరియు స్టేట్మెంట్ పీసెస్కు హైదరాబాద్ ఖ్యాతి గడించింది, దీనిలో కాసుల పేరు, టెంపుల్ జ్యువెలరీ, మనగ మలై, వంకీ వంటి వి సైతం ఉన్నాయి. ప్రకాశం పట్ల ఈ ప్రేమను హెచ్‌జెఎఫ్ వద్ద మేము అర్ధం చేసుకున్నాము మరియు ఈ ఎక్స్పో ద్వారా ఈ రంగం నూతన శిఖరాలను చేరుకునేందుకు తోడ్పడనున్నాము. మా ఎక్స్పోలకు జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలోని కొనుగొలుదారులు మరియు విక్రేతల నుంచి నిరంతర మద్దతు మాకు లభించడంతో పాటుగా ప్రతి సంవత్సరం ట్రెండింగ్ ఆవిష్కరణలు కూడా జరుగుతున్నాయి. సమీప భవిష్యత్‌లో మరింత మెరుగైన వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నాను. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ఆభరణాల పరిశ్రమలో దీర్ఘకాల వృద్ధి చోటు చేసుకోనుంది’’ అని వెల్లడించారు. భారత ప్రజల నడుమ డిస్పోజబల్ ఆదాయం పెరగడం చేత భారతీయ జెమ్స్ అండ్ జ్యువెలరీ మార్కెట్ వేగవంతంగా వృద్ధి చెందుతుంది. 2021 ఆర్థికసంవత్సరంలో ఇది 78.50 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి అది 119.80 బిలియన్ డాలర్లు/9 లక్షల కోట్ల రూపాయలుగా చేరింది. సృజన్మాక ఉత్పత్తి ఆవిష్కరణలు, డిజైనర్ ఉత్పత్తులు, సాంకేతిక ఆవిష్కరణలను హెచ్‌జెఎఫ్ వద్ద ప్రదర్శిస్తున్నారు. ఇది రాబోయే ఐదేళ్లలో మరింతగా భారతీయ జెమ్స్ అండ్ జ్యువెలరీ మార్కెట్ వృద్ధికి తోడ్పడనుంది. మూడు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్లో ఆభరణాల ప్రదర్శనలతో పాటుగా పలు అంశాలపై సదస్సులు, అవగాహన కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. ఈ ప్యానెల్స్‌లో పరిశ్రమకు చెందిన సుప్రసిద్ధ వ్యక్తులు వ్యాఖ్యాతలు ఉండటంతో పాటుగా ఈ బీ2బీ షోకు మరింత విలువను తీసుకురానున్నారు. తొలి రోజు శ్రీ బాలాజీ జ్యువెలర్స్‌కు చెందిన శ్రీ ప్రవీణ్ కుమార్, ఈ వాణిజ్యంలోని మర్మాలను , క్లిష్ట సమయంలో కూడా ఆభరణాల వ్యాపారం విజయవంతం చేయడానికి ఏమి చేయాలనేది తెలిపారు. రెండవ రోజు, బీఐఎస్ హాల్‌మార్కింగ్ సెషన్‌ను బులియన్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఫౌండేషన్ మరియు దాని సభ్యులు నిర్వహించనున్నారు. దీనిని అనుసరించి జీజెఏ– ద జెమ్ అండ్ జ్యువెలరీ అకాడమీకి చెందిన శ్రీమతి బిజల్ షా కలర్డ్ జెమ్‌స్టోన్స్, వజ్రాల విలువపై ప్రభావం చూపే అంశాలు, ఆభరణాల కోసం సృజనాత్మక డిజైన్స్ వంటి అంశాలు వెల్లడించనున్నారు. చివరగా రెండవ రోజు ఆభరణాల పరిశ్రమలో మోసాల గుర్తింపు మరియు నివారణ గురించి స్కిల్ గురు శ్రీ బి విజయ రఘురామ్రాజు, పీఆర్ ఆఫీసర్, జాయలుక్కాస్ ఇండియా లిమిటెడ్, పోలీస్ డిపార్ట్మెంట్ లో సీడీటీఐ మరియు వర్టికల్ ట్రైనర్ తెలుపనున్నారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ కమ్యూనిటీ తొలి రోజు ప్రత్యేకంగా సాయంత్రం పూట ఓ వినూత్నకార్యక్రమానికి సాక్షిగా నిలిచారు. పవర్ ఆఫ్ యంగ్ అంటూ యువ జ్యువెలర్స్ చేరుకున్న విజయాలు వేడుక చేశారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశపు జెమ్ అండ్ జ్యువెలరీ కమ్యూనిటీకి వారు అందించిన సేవలను గుర్తించారు. దీనిని అనుసరించి ఈ సీజన్ ట్రెండ్స్‌ను చూపుతూ టాప్ ఎగ్జిబిటర్లు రూపొందించిన కలెక్షన్‌తో ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. అనంతరం నెట్వర్కింగ్ నైట్ కొనసాగింది.