Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే
న్యూఢిల్లీ: బంగారు బాతు లాంటి ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)ని స్టాక్ మార్కెట్లోకి తీసుకు రావడం ద్వారా అబాసు పాలు అవుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఏమీ పాలుపోవ డం లేదు. ఈ స్టాక్‌ను నిలబెట్టడానికి పలు ప్రకటనలు చేస్తోంది. ఇందులో భాగంగానే డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఎల్ఐసీ షేర్ల పతనం తాత్కాలికమేనని పేర్కొన్నారు. ఎల్ఐసి ఫండమెంటల్స్ గురించి వాటాదారులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుం దని అభిప్రాయపడ్డారు. వాటాదారులకు మరింత విలువను చేకూర్చేం దుకు బీమా సంస్థ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించడం ద్వారా కేంద్రం తన ఖజానాలో రూ.20,500 కోట్లు వేసుకుంది. మే 17న రూ.949 వద్ద లిస్టింగ్ కాగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు విలువ పడిపోతూనే ఉంది. శుక్రవారం సెషన్లో రూ.709.70 వద్ద ముగిసింది. ఇప్పటి వరకు మదుపర్లు దాదాపు 25 శాతం విలువ కోల్పోయారు.