Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో రోడ్ షోలు
న్యూఢిల్లీ :ఐడీబీఐ బ్యాంక్ విక్రయాన్ని మోడీ సర్కార్ వేగ వంతం చేసింది. ఈ బ్యాంక్ ప్రయివే టీకరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) అమెరికాలో రోడ్ షోలను నిర్వహిస్తుంది. వచ్చే నెలలో ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించే అవకాశాలున్నాయని సంబంధిత అధికారి వెల్లడించారు. ఈ బ్యాంక్‌లో ప్రస్తుతం కేంద్రానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ క్రమంలో ఎంత వాటాను విక్రయిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రయివేటీకరించడానికి ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. చట్టంలో మార్పులనూ చేయగా, లావాదేవీ సలహాదారులనూ నియమిస్తుంది. ఈ బ్యాంక్‌లోని మెజారిటీ వాటాను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం పడిందనేది మాత్రం సుస్పష్టం.