Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీటీ యాగ్రిగేటర్ యాప్‌గా ఇప్పుడు నిలుస్తుంది
న్యూఢిల్లీ : భారతదేశపు ప్రీమియర్ కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ ప్రదాత భారతీ ఎయిర్టెల్ (ఎయిర్టెల్) నేడు తమ వీడియో స్ట్రీమింగ్ సేవ – ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఇప్పుడు 2 మిలియన్ల మంది పెయిడ్ సబ్‌స్ర్కైబర్ల మార్కును అధిగమించినట్లు వెల్లడించింది. ఇప్పుడు ఇది భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీటీ యాగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
భారతదేశంలో అతి పెద్ద సంఖ్యలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను మొబైల్ మరియు భారీ స్ర్కీన్ ఫార్మాట్లలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అందిస్తుంది. మొబైల్ చందాదారులు ఒక ఓటీటీ ప్రదాతను తమకు అందుబాటులోని బోకె నుంచి కనీస రీచార్జ్ 148 రూపాయలతో ఎంచుకోవచ్చు. భారీ స్ర్కీన్ ఫార్మాట్‌ను ఈ సంవత్సరారం భంలో ఎక్స్ట్రీమ్ ప్రీమియంగా విడుదల చేశారు. ఇది 149 రూపాయల ధరలో లభ్యమవుతుంది. దీనిద్వారా 10,500కు పైగా చిత్రాలు, షోస్‌తో పాటుగా లైవ్ టీవీ ని ఎయిర్టెల్ యొక్క ఓటీటీ కంటెంట్ పార్టనర్స్ అయినటువంటి సోనీ లివ్, ఈరోస్ నౌ, లయన్స్‌గేట్ ప్లే, హోయ్ చాయ్, మనోరమ మ్యాక్ప్, షీమారూ, అలా్ట్ర,హంగామా ప్లే, ఎపికాన్, డాక్యుబే, డివో టీవీ మొదలైనవి ఉంటాయి.
ప్లాట్‌ఫామ్ ఇన్సైట్స్
1. యూజర్లు - భారతదేశ వ్యాప్తంగా రెండు మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. మరలమరల రీచార్జ్‌లు /సబ్‌స్ర్కిప్షన్ చేయడయనేది మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి అమితంగా కనిపిస్తుంది.
2. వినియోగదారులు అంటుకునిపోవడం - ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్పై సరాసరి వీక్షణ సమయం దాదాపు 150 నిమిషాలుగా ఉంది. ఇది స్ధిరంగా పెరుగుతుంది
3. సిరీస్ మరియు సినిమాల నడుమ ఎంచుకోవడం కష్టం - ఈ ప్లాట్‌ఫామ్‌పై గడిపే సమయంలో 51% మంది గుల్లాక్, ఉండేఖీ వంటి సిరీస్‌లపై గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాది వీక్షకులలో వీటి పట్ల ఎక్కువ మక్కువ ఉంది. సినిమాలు వీటిని అనుసరించి ఉంటున్నాయి. దాదాపు 49% మంది జేమ్స్ లాంటి ప్రాంతీయ బ్లాక్‌బస్టర్స్‌ను చూస్తున్నారు.
4. చక్కటి కంటెంట్‌కు ప్రేక్షకులు ప్రతిచోటా ఉన్నారు - ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ నుంచి వినియోగ గణాం కాలను చూసినట్లయితే ప్రాంతీయ సినిమా వీక్షణ పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. జేమ్స్ (కన్నడ), మాండు (తమిళం), ఆడవాళ్లు మీకు జోహార్లు (తెలుగు) చిత్రాలకు ఈ ఫ్లాట్‌ఫామ్‌పై వీక్షకులు బ్రహ్మరరథం పట్టడంతో పాటుగా గత నెలలో టాప్5లో ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రాలకు డిమాండ్ ఉంది.
5. సోనీలివ్, హంగామా, ఈరోస్ నౌ మరియు లయన్స్ గేట్ ప్లే వంటివి ఈ ప్లాట్‌ఫామ్‌పై అత్యధికంగా కంటెంట్ భాగస్వాములు వెదికిన ఓటీటీలుగానిలిచాయి. ట్రెండింగ్ టాప్ 10 జాబితాలో సోనీ తమ కంటెంట్ పరంగా అత్యున్నత స్ధానాలను ఆక్రమించిందిజ
ఈ మైలురాయి గురించి ఎయిర్టెల్ డిజిటల్ సీఈఓ ఆదర్శ్ నాయర్ మాట్లాడుతూ @ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఆలోచనకు తగిన సమయం ఆసన్నమైంది. ఇది వినూత్నమైన సేవగా, భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ కంటెంట్‌ను తీసుకురావడంతో ఒకే యాప్‌లో సింగిల్ సబ్‌స్ర్కిప్షన్ ద్వారా వీలైనంత తక్కువ ధరతో దానిని తీసుకువస్తుంది. మా వేగవంతమైన వృద్ధి, భారతీయ వినియోగదారుల అవసరాలను అత్యుత్తమ ప్రాంతీయ కంటెంట్‌తో తీర్చడం కారణంగానే సాధ్యమవుతుంది. మేము మా ప్రాంతీయ వ్యూహాలను మా ప్రస్తుత భాగస్వాముల చేత రెట్టింపు చేయడంతో పాటుగా అసాధారణ ప్రాంతీయ కంటెంట్ కేటలాగ్స్తో నూతన భాగస్వాములను సైతం జోడించుకోనున్నాము` అని అన్నారు.
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కోసం 20 మిలియన్ పెయిడ్ సబ్స్ర్కిప్షన్స్ను చేరుకునేందుకు ఎయిర్ టెల్ అవకాశాలను వెదకడంతో పాటుగా పంజాబ్ నుంచి చౌపాల్ టీవీ, ఒడిషా నుంచి కంచా లంకా ను తమ ఓటీటీ కంటెంట్ భాగస్వాముల జాబితాలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చౌపాల్ టీవీ మరియు కాంచా లంకా ను జోడించడంతో ఈ ప్లాట్‌ఫామ్ మరింతగా ఒడిషా,పంజాబ్లలోని చందాదారులకు చేరువకావడంతో పాటుగా దేశవ్యాప్తంగా వైవిధ్యమైన అభిరుచులు కలిగిన చందాదారులను చేరుకోవడమూ వీలవుతుంది. ఎయిర్టెల్ ఇప్పుడు ఇన్ల్ఫూయెన్సర్ కామర్స్ ప్లాట్‌ఫామ్ సోషల్ స్వాగ్‌ను సైతం తమ బోర్డ్‌పైకి తీసుకువచ్చింది. దీనికి అక్షయ్‌కుమార్, రానా దగ్గుబాటి, మహేష్ భూపతి లాంటి సెలబ్రెటీలు వెన్నంటి ఉన్నారు.
మరింత సమాచారం కోసం https://www.airtelxstream.in/ చూడండి.