Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలర్‌తో 78కు పతనం
- చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో కనిష్టానికి...
ముంబయి : ''ప్రపంచ మార్కెట్లో భారత రూపాయి విలువ రికార్డ్ స్తాయిలో పడిపోతోంది. డాలర్‌తో రూపీ విలువ 69కి క్షీణించి.. ప్రస్తుతం దవాఖానాలో పడింది. మేము అధికారంలోకి వస్తే డాలర్‌తో సమానంగా రూపాయి విలువ పెరిగేలా చేస్తాం. రూపాయి కోసం ఇతర దేశాలు వరుస కడుతాయి'' అని 2013లో నరేంద్ర మోడీ చేసిన ప్రకటన. కానీ.. దీనికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోతూనే ఉంది. తాజాగా డాలర్‌తో రూపాయి విలువ 78కి పైగా పతనమయి.. 79కి చేరువ రేసులో ఉంది. సోమవారం అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి విలువ మరో 20 పైసలు పడిపోయి ఏకంగా 78.13కి క్షీణించింది. ఓ దశలో ఏకంగా 78.29కు దిగజారింది. శుక్రవారం సెషన్లోనూ 19 పైసలు కోల్పోయి 77.93 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. అధిక చమురు ధరల పెరుగుదలకు తోడు విదేశీ నిధులు తరలిపోవడం రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్లు వరుస పతనం, ఎఫ్ఐఐలు తరలిపోవడం, డాలర్‌కు డిమాండ్ పెరగడం తదితర అంశాలు రూపాయిని బలహీనపర్చుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి విలువ తగ్గడం ద్వారా దిగుమతి వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. ముఖ్చంగా చమురు చెల్లింపులు భారం కానున్నాయి. మరోవైపు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ప్రియం కానున్నాయి. దిగుమతుల బిల్లులు పెరగడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా చేసిన అప్పులపై అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పూడ్చడానికి ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్ను భారాలు మోపనున్నాయి. దీంతో అంతిమంగా భారతీయులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది.