Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ ప్రారంభం
- 450 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆటోమొబైల్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోకాపేట్లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ సంస్థను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఆటో మొబైల్ సంస్థ హైదరాబాద్లో రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ స్వాగతిస్తున్నామన్నారు. హైదరాబాద్లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా-ఈని ప్రారంభించబోతున్నామన్నారు. 65వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థలో 450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటుచేసినట్టు, అక్కడ అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నేడు వాహనాల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఉపయోగం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రారంభోత్సవంలో ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, టామ్ గ్రీకో ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేందర్ దుబ్బా, అడ్వాన్స్ జీసీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమక్షంలో అధికారికంగా సోమవారం ప్రాంరభించారు.