Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మధుమేహవ్యాధి ఇండియాలో నానాటికీ పెరుగుతున్న ఒక సవాలుగా ఉంటోంది. దాదాపుగా 50% మధుమేహ వ్యాధి కేసులు వ్యాధినిర్ధారణ చేయబడకుండానే కొనసాగుతున్నాయి దాదాపుగా 90% మంది ప్రీడయాబెటిక్స్ కి తమకు ఆ వ్యాధి ఉందని అసలే తెలియదు1. ఈ అంతరాన్ని గుర్తించి, ఇండియా వ్యాప్తంగా దగ్గర దగ్గరగా 50000 మందిని స్క్రీనింగ్ చేయడం ద్వారా మధుమేహవ్యాధి, ప్రీడయాబెటిస్ స్థితి యొక్క అవగాహనను పెంచడానికి హార్లిక్స్ డయాబెటిస్ ప్లస్, అపోలో షుగర్ క్లినిక్స్ తో కలిసి ముందుకు వచ్చింది. నెలరోజుల పాటు సాగే తమ కార్యక్రమంలో హార్లిక్స్ డయాబెటిస్ ప్లస్ మరియు అపోలో షుగర్ క్లినిక్స్ వారు ఉచితంగా స్క్రీనింగ్ చేస్తారు మరియు అధికంగా బ్లడ్ షుగర్ ఉన్న వ్యక్తులకు మధుమేహవ్యాధి యాజమాన్యంపై ఉచితంగా నిపుణుల సలహా సంప్రదింపులు మరియు మార్గదర్శనం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఇతర నగరాలతో పాటుగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ మరియు పుణె వంటి అధిక మధుమేహవ్యాధి ఉన్న నగరాల్లో 200 కు మించిన అపోలో క్లినిక్స్ / అపోలో షుగర్ క్లినిక్స్ క్రియాశీలం చేయబడతాయి. సుమారు 72.96 మిలియన్ల మంది పెద్దలు మధుమేహ వ్యాధిగ్రస్థులుగా నిర్ధారించబడి మధుమేహవ్యాధి ఇండియాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యగా ఉంటోంది.3 తర్వాతి 25 సంవత్సరాలలో వ్యాధి యొక్క ఉనికి రేటు రెట్టింపు అవుతుందనే సూచికతో మన దేశం చైనా తర్వాత ర్యాంక్ #2 గా ఇవ్వబడింది. నిశ్చలమైన జీవనశైలి మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాల వినియోగం పెరుగుదలతో, మధుమేహవ్యాధి భారతీయ జనాభాలో 7.3% మంది మధుమేహ వ్యాధిగ్రస్థులుగా మరియు తదుపరి 10.3% మంది ప్రీడయాబెటిక్ స్థితిలో ఉన్న ప్రమాద ఘంటికతో మధుమేహ వ్యాధి కొనసాగుతూనే ఉంది4. అతిగా బరువు ఉన్న వ్యక్తులు, పొగత్రాగేవారు, వయస్సులో 45 ఏళ్ళు అంతకు పైబడినవారు, మధుమేహవ్యాధి కుటుంబచరిత్ర కలిగినవారు, లేదా నిశ్చల జీవనశైలి గడుపుతున్నవారు మధుమేహ వ్యాధినిర్ధారణ పొందే అధిక ప్రమాదములో ఉంటారు. కంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, నరాలు పాడు కావడం, పాదాలు దెబ్బతినడం వంటి దీర్ఘ-కాలిక మధుమేహవ్యాధి సమస్యలను నివారించుకోవడానికి మొదట్లోనే వ్యాధినిర్ధారణ చేయించుకోవడం మరియు దాని నిర్వహణ చేసుకోవడం మాత్రమే ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకునే ఏకైక మార్గము. హిందూస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, న్యూట్రిషన్, క్రిష్ణన్ సుందరం గారు, ఇలా అన్నారు, “నివారక ఆరోగ్య రక్షణను ఒక ఉమ్మడి స్థలముగా చేయడం మరియు ఇండియాలో వ్యాధి భారమును తగ్గించడం ఈ భాగస్వామ్యం యొక్క దృష్టిసారింపుగా ఉంది. అవగాహనా స్థాయి అతి తక్కువగా ఉన్నట్టి ఒక స్థితి ఏదంటే అది మధుమేహవ్యాధి మాత్రమే. మొదట్లోనే కనిపెట్టడం మరియు చికిత్స చేయడం వల్ల దానితో ముడిపడి ఉన్న సంభావ్యతా చిక్కులను తప్పించగలుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా, మధుమేహవ్యాధిని బాగా నిర్వహణ చేసుకోవడానికి గాను అవగాహనను మెరుగుపరచడం మరియు జాగ్రత్త పద్ధతులను అలవరచుకోవడాన్ని పెంచడానికి మేము లక్ష్యంగా చేసుకున్నాము. ప్రీడయాబెటిస్, మధుమేహవ్యాధి లక్షణాలు, మరియు దానితో ముడిపడి ఉన్న అధిక ముప్పు అంశాల పట్ల వినియోగదారులకు అవగాహన కల్పించడం మా ప్రయత్నంగా ఉంది. అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ సి. చంద్రశేఖర్ గారు ఇలా అన్నారు:
“అపోలో షుగర్ క్లినిక్స్ వద్ద, మధుమేహవ్యాధితో ఉన్న వ్యక్తులకు సమీకృత సంరక్షణ అందించడం మా దృష్టిసారింపుగా ఉంటోంది. ఇండియా నానాటికీ ప్రపంచం యొక్క మధుమేహవ్యాధి రాజధానిగా తయారవుతూనే ఉంది. కేవలం ఎక్కువ స్వీట్లను తినడం ఒక్కటే దీనికి మూలకారణం కాదు. ఒత్తిడి, వ్యాయామ లోపము, అపసవ్యంగా తినడం, మరియు నిద్రించే అలవాట్లు వంటి జీవనశైలి అంశాలు మరియు సహజంగానే జన్యుసంబంధిత అంశాలు ఇందులో భారీ పాత్రను పోషిస్తాయి. తమ స్థితి పట్ల అవగాహన కలిగి ఉంటూనే తగిన శ్రద్ధ, జీవనశైలి మార్పులు, తిండి మార్పులు, మరియు సరియైన చికిత్సా ప్రణాళికలతో మధుమేహవ్యాధితో ఉన్నవారు చురుకైన జీవితాన్ని ఆనందించగలుగుతారని మేము విశ్వసిస్తాము. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి సహాయపడే అతి పెద్ద చొరవ దిశగా స్పృహాత్మకంగా ముందడుగు వేసినందుకు గాను మేము HUL బృందాన్ని నిజాయితీగా అభినందిస్తున్నాము మరియు ప్రశంసిస్తున్నాము. ఇది, మొదట్లోనే స్క్రీనింగ్ చేయడం యొక్క ప్రాముఖ్యతను ముందుకు నడపడానికి మరియు మధుమేహ వ్యాధిగ్రస్థులు/ప్రీడయాబెటిక్స్ ని గుర్తించి శాస్త్రీయంగా నిరూపించబడిన చికిత్సా పద్ధతులు మరియు జీవనశైలి మార్పుల ద్వారా వారిని శ్రేయోమార్గములో నడిపించడానికి సహాయపడేందుకు మేము ప్రయత్నిస్తున్న తనదైన శైలిలోని ఏకైక చొరవగా ఉంది” అన్నారు.