Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణె : ఒకప్పుడు భారత ద్విచక్ర వాహన రంగంలో మెరుపు మెరిసిన బజాజ్ చేతక్ ఇప్పుడు కొత్త రూపంలో వస్తోంది. రాహుల్ బజాజ్ జయంతి సందర్భంగా మంగళవారం పూణెలోని అకుర్డిలో కొత్తగా నిర్మించిన ఈవీ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. 1970లలో ఐకానిక్ చేతక్ స్కూటర్ రూపొందింది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని ఏడాదికి 5 లక్షల యూనిట్లకు విస్తరించనున్నామని చేతక్ టెక్నాలజీస్ ఛైర్మన్ రాజీవ్ బజాజ్ తెలిపారు. ఈ ప్లాంట్, విక్రేతల కోసం దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామన్నారు.