Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శామ్సంగ్ యొక్క ప్రముఖ 2022 శ్రేణి Curd Maestro™ మరియు Digi-Touch Cool™ రెఫ్రిజిరేటర్లు స్పోర్ట్ నూతన భారతీయ డిజైన్లు
కొత్త రెఫ్రిజిరేటర్ డిజైన్లు 20 నుండి 40 సంవత్సరాల వయసు గల జెన్ Z మరియు సహస్రాబ్ది ప్రజల వ్యాప్తంగా నిర్వహించిన వినియోగదారు పరిశోధన ఫలితంగా ఉద్భవించాయి
రు. 8,500 వరకూ క్యాష్‌బ్యాక్, కేవలం రు.990 తో మొదలయ్యే సులభమైన ఈఎంఐ ఆప్షన్లు, మరియు కొత్త మోడల్స్ పైన ఒక ఈఎంఐ తగ్గింపుతో పొందండి
హైదరాబాద్ జూన్, 2022 : భారతదేశ అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్, నేడు విస్తృత ప్రజాదరణ పొందిన తన Curd Maestro™ and Digi Touch Cool™ యొక్క 2022 కొత్త భారతీయ కేంద్రిత డిజైన్లతో రెఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రకటించింది.
ప్రపంచం యొక్క మొట్టమొదటి రెఫ్రిజిరేటర్ Curd Maestro™ అది పెరుగును తయారు చేయగలిగినట్టిది, ఇప్పుడు బొకే సిల్వర్ రంగులో, స్టీల్ ఫినిష్ పై పరిశ్రమ యొక్క మొదటి పూల ప్యాటర్న్ డిజైన్ మరియు మిడ్-నైట్ బ్లోజమ్ రెఫ్రిజిరేటర్ల శ్రేణిలోలభిస్తాయి. లభిస్తాయి. ఆహారాన్ని నిల్వ చేయడానికి అతీతంగా ఆహారపదార్థాల తయారీ వరకు వెళ్ళడం ద్వారా, ఈ రెఫ్రిజిరేటర్లు ప్రతిరోజూ పెరుగును తయారుచేసేందుకు శ్రమపడే అంశాలను ప్రస్తావిస్తాయి, మరియు రెఫ్రిజిరేటర్ యొక్క సాంప్రదాయక వాడకమును విప్లవాత్మకం చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. శామ్సంగ్ యొక్క Curd Maestro™ రెఫ్రిజిరేటర్లలో పెరుగును తయారు చేసే ప్రక్రియ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి-జాతీయ పాడి పరిశోధన సంస్థ, కర్నాల్ వారిచే సిఫార్సు చేయబడింది.
అదనంగా వర్ణాన్ని జోడిస్తూ, Digi Touch Cool™ యొక్క 2022 శ్రేణి డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్లు కొత్త పువ్వుల ప్యాటర్నులలో లభిస్తాయి, అవి – అర్బన్ ట్రాపికల్ మరియు హైడ్రేంజియా ప్యాటర్న్. మరింత స్టోరేజ్ స్థలం మరియు సౌకర్యాన్ని అందించడానికి డిజైన్ చేయబడిన ఈ రెఫ్రిజిరేటర్లు పేటెంట్ హక్కు పొందిన Digi-Touch Cool™ 5-ఇన్-1 టెక్నాలజీతో వస్తాయి, అది వినియోగదారులు తమ రెఫ్రిజిరేటరు తలుపును తెరవకుండానే ఒక్క టచ్ తో రెఫ్రిజిరేటరు సెట్టింగులను నియంత్రణ చేయడానికి సాధికారత కల్పిస్తుంది మరియు కూలింగ్ ని నిలుపుకుంటూ విద్యుత్తును ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది.
“మా Curd Maestro™ మరియు Digi Touch Cool™ రెఫ్రిజిరేటర్ల కొరకు కొత్తగా ఆవిష్కరించబడిన పువ్వుల ప్యాటర్న్, భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలను మనసులో ఉంచుకొని రూపకల్పన చేయడం జరిగింది. మా వినియోగదారులను సులభతరం చేసే అత్యాధునిక టెక్నాలజీతో సుసంపన్నం చేయాలనేది మా ముఖ్య లక్ష్యము కాగా, వారి సమగ్రమైన గృహాలంకరణకు అందమైన చూపును అందించడానికి రెఫ్రిజిరేటర్లపై ఈ ప్రత్యేక డిజైన్లను రూపకల్పన చేశాము,” అన్నారు, శామ్సంగ్ ఇండియా, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బిజినెస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్‌దీప్ సింగ్.
ధర, ఆఫర్లు మరియు లభ్యత:
రెఫ్రిజిరేటర్ల Curd Maestro™ మరియు Digi Touch Cool™ 2022 శ్రేణి అన్ని రిటెయిల్ ఛానళ్ళ వ్యాప్తంగా మరియు శామ్సంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోరు శామ్సంగ్ షాప్ పైన లభిస్తుంది. Digi Touch Cool™ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ శ్రేణి రు. 18,690 ధరతో మొదలవుతుంది మరియు Curd Maestro™ ఫ్రోస్ట్ శ్రేణి రు. 27,990 ధరతో మొదలవుతుంది.
వినియోగదారులు రు. 8,500 వరకూ క్యాష్‌బ్యాక్, కేవలం రు.990 తో మొదలయ్యే సులభమైన ఈఎంఐ ఆప్షన్లు, మరియు కొత్త మోడల్స్ పైన ఒక ఈఎంఐ తగ్గింపుతో పొందవచ్చు.
Curd Maestro™: ప్రతిరోజూ ఇంటి కోసం నవీన ఆవిష్కరణ
Curd Maestro™ రెఫ్రిజిరేటర్ ఇండియాలో సాంప్రదాయక రెఫ్రిజిరేటర్ శైలిని ఆహార పదార్థాల నిల్వ మరియు ఆహార పదార్థాల పరిరక్షణకు అతీతంగా మార్చివేస్తుంది. క్లిష్టతరమైనది, సమయం తీసుకునేది మరియు ఉపాయంతో కూడినది అయినా కూడా, భారతీయ గృహాల్లో ఆవశ్యక ఆహారపదార్థమైన పెరుగు తయారీ ప్రక్రియ యొక్క శ్రమతో కూడిన అంశాలను Curd Maestro™ ప్రస్తావిస్తుంది. Curd Maestro™, స్థానిక అవసరాలను తీర్చడానికై శామ్సంగ్ చే ఒక స్థానిక ఆవిష్కరణ ప్రతి సారీ ఒకే సుస్థిరత్వంతో పెరుగును తయారు చేస్తుంది మరియు విభిన్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగు తయారు చేసుకునే శ్రమ అంతటినీ తగ్గించివేస్తుంది.
ఈ రెఫ్రిజిరేటర్ పెరుగు తయారీని 6.5 నుండి 7.5 గంటలలో పూర్తి చేస్తుంది — మృదువైన పెరుగు కోసం 6.5 గంటలు మరియు చిక్కని పెరుగు కోసం 7.5 గంటలు. మనం పాలు మరిగించి, చల్లబరచి మాన్యువల్ గా పెరుగు తోడు వేయాలి, అప్పుడు Curd Maestro™ ఆ పని యొక్క అత్యంత కీలకమైన విధి — పులియబెట్టడాన్ని పూర్తి చేసేస్తుంది. అది పెరుగును పులియబెట్టడమే కాకుండా దానిని నిల్వ కూడా చేస్తుంది.
Digi-Touch Cool™ 5-ఇన్-1: వినియోగదారు అవసరాలను తీర్చే నవీన ఆవిష్కరణ
డిజి టచ్ కూల్ 5-ఇన్-1 రెఫ్రిజిరేటర్లు ఐదు ప్రత్యేకితమైన ఫీచర్లతో వస్తాయి:
డిజిటల్ కంట్రోల్ కూల్™ టెంపరేచర్ సెట్టింగ్ – అధునాతన టెంపరేచర్ కంట్రోల్ సెట్టింగ్ తో సుసంపన్నమైన ఈ ఏర్పాటుతో, వైవిధ్యమైన సీజన్ పరిస్థితుల ఆధారంగా వినియోగదారులు తమ రెఫ్రిజిరేటర్ యొక్క ఉష్ణోగ్రతను సులభంగా అదుపు చేసుకోవచ్చు. మారుతున్న సీజన్ ఆవశ్యకతలను నెరవేరుస్తూనే విభిన్న స్థాయిల ఉష్ణోగ్రత పాయింట్లు వ్యక్తి తమ ఆహారపదార్థాల్ని అనుకూలంగా నిల్వ చేసుకోవడానికి వీలు కలిగిస్తాయి.
పవర్ కూల్ – శామ్సంగ్ Digi Touch Cool™ 5-ఇన్-1 రెఫ్రిజిరేటర్ పైన గల పవర్ కూల్ బటన్ 53% వరకూ వేగమైన ఐస్ తయారీ ప్రక్రియ మరియు 33% వేగమైన కూలింగ్ అందిస్తుంది. కాబట్టి, డిమాండును బట్టి సకాలములో చల్లబరచుకొని ఐస్ చేసుకోవడానికి ఇది వినియోగదారులకు సౌకర్యవంతమైన మార్గముగా ఉంటుంది.
ఈకో మోడ్ – ఈకో మోడ్ ఫంక్షన్ రెఫ్రిజిరేటర్ యొక్క ఉష్ణోగ్రతను సుమారు 6 డిగ్రీల సెల్సియస్ కు సర్దుబాటు చేస్తుంది, తద్వారా 28% ఎనర్జీ ఆదా అవుతుంది, అలా చలికాలం, రాత్రులు మరియు హై గ్రేడ్ కూలింగ్ అవసరం లేని సమయాల్లో నడిచే ఖర్చు తగ్గేలా చేస్తుంది.
బ్లాక్ఔట్ నోటిఫికేషన్ – ఒకవేళ పవర్ పోయిన కారణంగా రెఫ్రిజిరేటర్ యొక్క ఉష్ణోగ్రత గనక 9°C పైగా పెరిగిన పక్షములో, టచ్ ప్యానల్ మీద లైట్లు వెలిగి ఆరడం ద్వారా బ్లాక్ఔట్ నోటిఫికేషన్ ఫీచర్ తెలియజేస్తుంది, మరియు ఆహారం వ్యర్థం కాకుండా వినియోగదారులకు సహాయపడేందుకు గాను రెఫ్రిజిరేటరు ఆటో ఎక్స్-ప్రెస్ కూలింగును స్విచ్ ఆఫ్ చేస్తుంది.
ఇ-డీఫ్రోస్ట్ – ఈ అంతర్నిర్మిత ఫీచర్, వినియోగదారులు 3 సెకెన్ల పాటు ఇ-డీఫ్రోస్ట్ బటన్ పైన నొక్కడం ద్వారా ఫ్రీజరును డిఫ్రోస్ట్ చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఫ్రీజర్ వాల్స్ మరియు ఎవాపొరేటర్ పైన ఉన్న ఏదేని ఐస్ ని తొలగించే ప్రక్రియను అది తక్షణమే మొదలుపెడుతుంది, డీఫ్రోస్టింగ్ ప్రక్రియ పూర్తి కాగానే, అది ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది. టచ్ ప్యానల్ పైన 3 సెకెన్ల పాటు ఇ-డీఫ్రోస్ట్ పైన నొక్కి ఉంచి వినియోగదారులు కూడా ఏ సమయములోనైనా డీ-ఫ్రోస్టింగ్ ప్రక్రియను ఆపివేయవచ్చు.