Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది 60 సెకన్లలో అంతా అయిపోయింది ! అన్న రీతిలో 270 ఇండ్లతో కూడిన ఈ ప్రాజెక్ట్ మొత్తం కొద్ది గంటలలోనే కొనుగోలుదారులు మరియు బ్రోకర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో విక్రయించడమైంది.
డాన్యూబ్ ప్రోపర్టీస్ యొక్క 350 మిలియన్ దీరామ్స్ అల్ర్టా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ జెమ్జ్ ను శనివారం, జూన్ 04,2022వ తేదీన ప్రారంభించిన కొన్ని గంటలలోనే పూర్తి గా విక్రయించబడింది.
అక్టోబర్ 2021 తరువాత డాన్యూబ్ ప్రోపర్టీస్ ఆవిష్కరించి విక్రయించిన మూడవ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ జెమ్జ్. అంతేకాదు, మార్చి 2022 లో 300 మిలియన్ దీరామ్స్ పెరల్జ్ ప్రాజెక్ట్‌ను ఫుర్జాన్ వద్ద ఆవిష్కరించిన రెండు నెలల్లో ప్రారంభించిన రెండవ ప్రాజెక్ట్ ఇది.
హైదరాబాద్ : డాన్యూబ్ ప్రోపర్టీస్‌కు చెందిన 350 మిలియన్ దీరామ్స్ అల్ర్టా లగ్జరీ ప్రాజెక్ట్ జెమ్జ్ కోసం శనివారం, జూన్04, 2022న షేక్ జయేద్ రోడ్ లోని సంస్థ కార్యాలయంలో జరిపిన వాణిజ్య అమ్మకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన కొద్ది గంటలలోనే మొత్తం ప్రాజెక్ట్ విక్రయించబడింది.
ఈ ప్రాజెక్ట్‌కు కొనుగోలుదారులు,బ్రోకర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.వీరంతా కూడా డాన్యుబ్ ప్రోపర్టీస్ కార్యాలయం ముందు వరుస కట్టడంతో పాటుగా అది తెరిచిన వెంటనే తమ గుప్తనిధి- కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. వారంతా కూడా తమ కలల ఇంటిని బుక్ చేసుకోవడంతో పాటుగా తమ తొలి డిపాజిట్‌ను తొలిరోజే చెల్లించారు. డెలివరీ సమయంలో పూర్తిగా ఫర్నిచర్ చేయించుకుని మరీ వారు తమ ఇళ్లను పొందగలరు. డాన్యూబ్ గ్రూప్ ఇప్పుడు అతి పెద్ద హోమ్ ఫర్నిషింగ్ నెట్‌వర్క్‌ను నడుపడంతో పాటుగా హోమ్ ఇంప్రూవ్మెంట్ బ్రాండ్ డాన్యూబ్ హోమ్‌ను సైతం నిర్వహిస్తుంది.
'డాన్యూబ్ ప్రోపర్టీస్ పట్ల కొనుగోలుదారుల విశ్వాసాన్ని ఇది ప్రదర్శిస్తోంది. మా అతిపెద్ద బలం మరియు ప్రేరణగా వేగంగా వృద్ధి చెందుతున్న యుఎఈ నివాసితులలో మా వినియోగదారుల సంఖ్య. వీరికి మేము మా వాగ్ధానాలను నెరవేర్చుతుండటం కూడా అదే రీతిలో పెరుగుతుంది` అని డాన్యూబ్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మెన్ రిజ్వాన్ సాజన్ అన్నారు.
ఆయనే మాట్లాడుతూ 'ఇది ఎనిమిది నెలల కాలంలో మా మూడవ ప్రాజెక్ట్. అదీ వెంటనే విక్రయించబడటం సానుకూల మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రదర్శిస్తుంది. అంతేకాదు మరింత మంది కొనుగోలుదారులు ప్రోపర్టీ మార్కెట్లో ప్రవేశిస్తున్నారని కూడా వెల్లడిస్తుంది` అని అన్నారు.
'ఓ డెవలపర్‌గా, తాము స్ధిరంగా వినియోగదారులకు వాగ్ధానాలను డెలివరీ చేస్తున్నాము. ఇప్పటి వరకూ 17 ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తే వాటిలో 11 ప్రాజెక్ట్‌లను డెలివరీ చేశాము. ఇప్పటి వరకూ అత్యధిక ఆవిష్కరణ లతో సరిపోల్చినప్పుడు డెలివరీ రేషియో ఇది. ఇది కొనుగోలుదారులు, బ్రోకర్లు, మదుపరులకు మా ప్రోపర్టీల పట్ల ఉన్న విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. యూనిట్ల సంఖ్య పరంగా ఇప్పటి వరకూ 8,272 యూనిట్లను విక్రయించగావాటిలో 4556 యూనిట్లను డెలివరీ చేసింది. విలువ పరంగా మేము 3.63 బిలియన్ దీరామ్ విలువైన ఇళ్లను వినియోగదారులకు అందించాము. మొత్తంమ్మీద ఈ ఆస్తుల మొత్తం విలువ 5.65 బిలియన్ దీరామ్లుగా ఉండనుంది` అని అన్నారు
అందుబాటు ధరలలో ప్రోపర్టీ డెవలప్మెంట్ చేయడంతో పాటుగా యుఏఈలో శక్తివంతమైన ప్రయివేటు రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన డాన్యుబ్ ప్రోపర్టీస్ జెమ్జ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది. అత్యద్భుతమైర పిరమిడ్ నిర్మాణశైలిలో ఉంటుంది. మే 24,2022వ తేదీన జరిగిన పాత్రికేయుల సమావేశంలో బాలీవుడ్ సూపర్‌స్టార్, డాన్యూబ్ గ్రూప్ నూతన బ్రాండ్ అంబాసిడర్ సంజయ్‌దత్ పాల్గొనగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు.
ఈ సూపర్ ఎక్స్‌క్లూజివ్ ప్రాజెక్ట్ జెమ్జ్ 270 అత్యున్నతంగా డిజైన్ చేసిన అపార్ట్మెంట్లను 30 విలాసవంతమైన సౌకర్యాలతో అందిస్తుంది. డాన్యూబ్ ప్రోపర్టీస్ యొక్క ట్రెండ్ సెట్టింగ్ 1 % నెలవారీ చెల్లింపు ప్రణాళిక అత్యంత అందుబాటు ధరలో విలాసంగా 5,50,000 దీరామ్స్ ప్రారంభ ధరతో అందిస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌ను 5,30,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా కలిగిన ఈ ప్రాజెక్ట్‌లో 101,000 చదరపు అడుగుల ప్లాట్ ఏరియా అభివృద్ధి చేశారు. ఈ 14 అంతస్తుల ప్రాజెక్ట్‌లో 274 అపార్ట్మెంట్లు ఉండనున్నాయి. వీటిలో 74 1బీహెచ్‌కె , 24 స్టూడయో, 114 2బీఎచ్కె మరియు 42 3బీహెచ్‌కె మరియు 16 అపార్ట్మెంట్లు డూప్లెక్స్ రూపంలో ఉంటాయి.
జెమ్జ్ బై డాన్యూబ్‌ను అల్ ఫర్జాన్ అభివృద్ధి చేయనుంది. అత్యంత ఆహ్లాదకరమైన రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఇది. షేక్ జయేద్ రోడ్ మరియు మొహమ్మద్ బిన్ జయేద్ రోడ్ నడుమ ఇది ఉంది. ఆలోచనాత్మకంగా డిజైన్ చేసిన, నిర్మాణపరంగా అద్భుతం అనతగ్గ రీతిలో ఇది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అత్యంత విలాసవంతమైన బెడ్రూమ్లను ఆకట్టుకునే ఇంటీరియర్స్, నగర అందాలను వీక్షించే రీతిలో రూపొందించారు. విలాసవంతమైన వసతుల పరంగా ఈ ప్రాంతంలో మరే ఇతర డెవలపర్ వద్ద మనం ఇలాంటి సౌకర్యాలు చూడలేము. ఇది అత్యద్భుతమైన ప్రైవేట్ పూల్‌ను ఆక్వాజిమ్, యాంటీ కరెంట్ మెషీన్‌తో ఉండటంతో పాటుగా విలాసం, శ్రేష్టతను కలిగి ఉంది.
ప్రయివేటు పూల్‌ను ఆలోచనాత్మకంగా అసాధారణ జీవనశైలికి స్ఫూర్తి కలిగించే రీతలో నిర్మించారు. ఇత ర ప్రత్యేకమైన వసతులలో నానీ సూపర్వైజర్లతో కిడ్స్ డే కేర్ బీ మ్యాచ్ ప్రమాణాల నెట్ ప్రాక్టీప్తో కూడిన క్రికెట్ పిచ్, యోగా సెంటర్లు ఒత్తిడి తగ్గిస్తాయి. దీనిలో అత్యాధునిక బ్యూటీ సలోన్ కూడా ఉంటుంది. దీనిలో సిబ్బంది సుశిక్షితులై ఉంటారు.
డాన్యూబ్ గ్రూప్ చైర్మెన్ అండ్ ఫౌండర్ రిజ్వాన్ సజాన్ మాట్లాడుతూ 'తమ కంపెనీ సుదీర్ఘకాలంగా గృహ మరియు గోల్డెన్ వీసాలను మదుపరుల కోసం ప్రాసెస్ చేస్తోంది. తగిన మార్గదర్శకాలను అనుసరించే వారికి వీటిని అందిస్తుంది. అంటే 2మిలియన్, 5 మిలియన్ మరియు 10 మిలియన్ దీరామ్ సీలింగ్స్‌ను సెప్టెంబర్ 2022 నుంచి ప్రాసెస్ ఆరంభంతో ఇవి అందించనుంది` అని అన్నారు.
తెలివైన ఫర్నిషింగ్స్ను పరిచయం చేయడంతో జెమ్జ్, భారీ గృహాలు మరియు ఫ్లోర్ ప్లాన్స్‌ను కన్వర్టబల్ లేఔట్స్‌తో కలిగి ఉంది. దీనిలో ఒన్ బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌ను 2 బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌గా మార్చడంతో పాటుగా 2 బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్‌ను 3 బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌గా మార్చవచ్చు. జెమ్జ్ వద్ద విలాసవంతమైన అపార్ట్మెంట్లు స్విమ్మింగ్ పూల్, బాల్కనీలో కలిగి ఉంది. ఇది అత్యద్భుతమైన విలాసంగా నిలుస్తుంది !
అక్టోబర్ 2022 తరువాత జెమ్జ్ ఆవిష్కరించనున్న మూడవ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇది. అంతేకాదు 300 మిలియన్ దీరామ్ పెరల్జ్ ప్రాజెక్ట్‌ను ఫర్జాన్‌ను మార్చి 2022లో ఆవిష్కరించిన తరువాత రెండవ ప్రాజెక్ట్.
జెమ్జ్ విక్రయంతో , డాన్యూబ్ ప్రోపర్టీస్ డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియో 8272 యూనిట్లకు విస్తరించింది. వీటి మొత్తం విలువ 5.65 బిలియన్ దీరామ్కు విస్తరించింది. ఇది ఇప్పటి వరకూ 4556 యూనిట్లకు విస్తరించింది. వీటి మొత్తం విలువ 3.63 బిలియన్ దీరామ్‌లు. ఇది మొత్తం పోర్ట్ఫొలియోలో రెండింట మూడొంతులుగా ఉంది.
యుఏఈ లో అత్యంత విజయవంతమైన డెవలపర్లలో ఒకటిగా అత్యధిక లాంచ్ టు డెలివరీ రేఫియో కలిగి ఉంది. డాన్యూబ్ గ్రూప్ ఇప్పటికే బాయ్జ్, గ్లామ్జ్, స్టార్జ్, రిసార్ట్జ్, లాన్జ్ డెలివరీ చేసింది. ఇది ఇటీవలనే బాయ్జ్, మిరాకల్జ్ను డెలివరీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌లన్నీ కూడా వినియోగదారులనుంచి ప్రశంసలు పొందాయి.