Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో ఐపీఓకు..!
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్ పే ఇప్పటి వరకు 10 లక్షల ద్విచక్ర వాహన బీమా పాలసీలను విక్రయించినట్టు వెల్లడిం చింది. ఇందులో 75శాతం పాలసీలు కూడా ద్వితీయ, తృతీయ శ్రేణీ నగ రాల నుంచి వచ్చినవేనని పేర్కొంది. రెండు నిమిషాల్లోనే కాగితరహిత బీమాను అందిస్తున్నట్టు తెలిపింది. వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం లోని ఈ సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రావడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థ విలువ దాదాపు రూ.75వేల కోట్లుగా అంచనా వేస్తున్నట్టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాల సమాచారం.