Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 152 పాయింట్ల పతనం
ముంబయి: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూశాయి. అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. బుధవారం సెషన్లోనూ బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 400 పాయింట్లు పతన మయ్యింది. తుదకు 152 పాయింట్ల నష్టంతో 52,541కు పడి పో యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 40 పాయింట్లు తగ్గి 15,692 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున తగ్గాయి. నిఫ్టీలో రిలయన్స్ ఇండిస్టీస్ 1.21 శాతం నష్టపోయింది. ఐటీ, లోహ, చమురు, గ్యాస్, ఎఫ్ఎంసీజీ రంగాలు అధిక ఒత్తిడికి గురైయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు వార్తలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మరోవైపు దేశంలో అధిక ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, ఎఫ్ఐఐలు తరలిపోవడం సూచీల నష్టా లకు ప్రధాన కారణంగా ఉన్నాయి.