Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతదేశపు ప్రీమియర్ కమ్యూనికేషన్స్ సేవల ప్రదాత భారతీ ఎయిర్టెల్ (ఎయిర్టెల్) నేడు తమ ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్టీటీహెచ్) బ్రాడ్‌బ్యాండ్ సేవలు– ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్‌ను లడఖ్ మరియు అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దీనితో, భారతదేశపు మారుమూల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాలలో తమ ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేట్ ఐఎస్పీగా ఎయిర్టెల్ నిలిచింది. తద్వారా వినియోగదారులకు ప్రపంచ శ్రేణి డిజిటల్ ప్రాధన్యతను తీసుకురావడంతో పాటుగా డాటా సూపర్హైవేకు వారిని కలుపుతుంది.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వ టెలికామ్ శాఖ కార్యదర్శి శ్రీ కె రాజారామన్ మాట్లాడుతూ ‘‘తమ ఎఫ్టీటీహెచ్ సేవలను లడఖ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ప్రారంభించిన ఎయిర్‌టెల్‌ను అభినందిస్తున్నాను. చెన్నై మరియు పోర్ట్‌బ్లెయిర్ నడుమ సముద్రగర్భంలో కేబుల్ వేయడాన్ని గత సంవత్సరం గౌరవనీయ ప్రధాని ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యంకు అనుగుణంగా ఈ ప్రాంతానికి హై స్పీడ్ డాటా కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ ప్రాంతంలోని ప్రజలకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
విర్ ఇందర్ నాథ్, సీఈఓ – బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్, భారతీ ఎయిర్టెల్ మాట్లాడుతూ ‘‘ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క అత్యున్నత శ్రేణి బ్రాడ్‌బ్యాండ్ అనుభవాలను ఈ ప్రాంత వాసుల చెంతకు తీసుకు రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. మహమ్మారి అనంతర ప్రపంచంలో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌కు ఇళ్ల నుంచి డిమాండ్ పెరిగింది. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ లెర్నింగ్ తో పాటుగా ఆన్లైన్ వినోదం వంటి వాటి కోసం వాడుతున్నారు. వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు భారీ మొత్తంలో పెట్టుబడులను ఎయిర్టెల్ పెడుతుంది మరియు తమ ఎఫ్టీటీహెచ్ ఫుట్‌ప్రింట్‌ను 2000కు పట్టణాలు, నగరాలకు దేశవ్యాప్తంగా రాబోయే మూడు సంవత్సరాలలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటుగా డిజిటల్ కనెక్టడ్ ఇండియాకు తోడ్పాటునందించనుంది’’అని అన్నారు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రస్తుతం లడఖ్‌లోని లేహ్ మరియు అండమాన్ అండ్ నికోబార్ దీవులలోని పోర్ట్బ్లెయిర్లో లభ్యమవుతున్నాయి. ఈ కంపెనీ తమ సేవలను ఈ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలకు రాబోయే కొద్ది నెలల్లో విస్తరించనుంది.
మహోన్నత అనుభవాలను అందించేందుకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్‌లో అత్యాధునిక సాంకేతిక అంశాలు సైతం భాగంగా ఉంటాయి. దీని తరువాత తరపు వై–ఫై రౌటర్లు సిమ్మిట్రికల్ డౌన్లోడ్ మరియు అప్లోడ్ స్పీడ్స్ కలిగి ఉండటంతో పాటుగా ఏకకాలంలో 60 ఉపకరణాలను సైతం కనెక్ట్ చేసుకునే అవకాశం అందిస్తుంది. దీనికి ఎయిర్టెల్ యొక్క అత్యున్నత 24 గంటల కస్టమర్ సేవా మద్దతు మరియు నిరూపిత నెట్వర్క్ విశ్వసనీయత అందిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కు మార్చి 31,2022 నాటికి4.8 మిలియన్ వినియోగదారులు ఉన్నారు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా 847 నగరాలు మరియు పట్టణాలు వ్యాప్తంగా లభిస్తుంది. దీనిని 2025 నాటికి 2000 పట్ణణాలకు విస్తరించనుంది. ఈ కంపెనీ తమ ఇన్స్టాల్డ్ హోమ్స్ బ్రాడ్‌బ్యాండ్‌ను 150% వృద్ధి చేయడంతో పాటుగా ఇదే సమయంలో 40 మిలియన్ కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. హై స్పీడ్ డాటా మరియు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్‌కు తోడుగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ విస్తృతశ్రేణిలో ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలతో వస్తుంది. దీనిలో కాంప్లిమెంటరీ సబ్‌స్ర్కిప్షన్స్ ను ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను పూర్తి డిజిటల్ వినోదం కోసం అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం https://www.airtel.in/broadband/ చూడండి.