Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వినియోగదారులకు సరికొత్త ట్యాక్సీ అనుభవం అందించడమే లక్ష్యంగా 'రైడి' వచ్చిందని ఆ సంస్థ వ్యవస్థాపకులు సత్యవికాస్ ఎంపాటి తెలిపారు. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న అగ్రిగేటర్ల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను సులభతరం చేసే ఉద్దేశంతో రైడి సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మమ్మాక్యాబ్స్ వ్యవస్థాపకులు సీఈఓ అయిన తాను యువ పారిశ్రామికవేత్తలతో ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ విప్లవాత్మక ప్రొవైడర్ బైక్‌లను కలిగి ఉన్న వివిధ రకాల సేవలను అందిస్తుందన్నారు. అనేక రకాల క్యాబ్‌లు కాకుండా ఆటోలు ఉన్నాయన్నాని రైడి సిఇఒ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయ సేవలు, అద్దె ఎంపికలు ఉన్నాయన్నారు.