Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు నింగికంటడంతో ఆకాశయానం మరింత భారం అవుతోంది. అధిక ఇంధన ధరలు విమాన కంపెనీలపై పెను భారంగా మారాయి. దీంతో ఆ వ్యయాలను ప్రయాణికులపై వేయాలని ఆయా కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గురువారం న్యూఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలో లీటర్‌పై ధర ఏకంగా 16.26 శాతం లేదా రూ.19,757 ఎగిసి రూ.1,41,232.87కు చేరింది. ఇదే జీవిత కాల గరిష్ట స్థాయి. గత నెలలో చాలా స్వల్పంగా కిలో లీటర్‌పై 1.3 శాతం (రూ.1563.97) మేర తగ్గించి.. ఇప్పుడు భారీ స్థాయిలో పెంచడం ఆయా కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.