Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫార్మింగ్ టెక్నాలజీలపై ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇమ్టెక్స్ ఫార్మింగ్ 2022 తో పాటుగా టూల్టెక్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ను బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (బీఐఈసీ) వద్ద నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా 30 నెలల విరామం తరువాత ఇమెక్ట్స్ను భౌతికంగా నిర్వహిస్తున్నారు. ఫార్మింగ్ సాంకేతికతలైనటువంటి ప్రెసెస్, వెల్డింగ్, జాయినింగ్, హై స్పీడ్ లేజర్ మెషీన్లు, రోబోటిక్స్, షీట్ మెటల్ వర్కింగ్తో ఆటోమేషన్, ఎడిటివ్ తయారీ, మెట్రాలజీ, క్యాడ్/క్యామ్ వంటి వాటిని ఎగ్జిబిటర్లు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనను కర్నాటక ఉన్నత విద్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్ సీ ఎన్ ; పూర్వ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె శివన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఎంటీఎంఏ అధ్యక్షులు రవి రాఘవన్ ; వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర రాజమణి, ముఖ్య సలహాదారు పీజె మోహన్రామ్ పాల్గొన్నారు. దాదాపు 50% మెషీన్ టూల్స్ కర్నాటకలోనే ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించిన డాక్టర్ అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ నైపుణ్యంతో కూడిన మానవ వనరులను పెంచాల్సి ఉందన్నారు. ఐటీ, తయారీ రంగాల సమ్మేళనం కారణంగానే డిజిటల్ తయారీ సాంకేతికతలలో కర్నాటక అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇస్రోలో తన ప్రయాణం గురించి వెల్లడించిన డాక్టర్ శివన్, అంతరిక్షం, వ్యూహాత్మక రంగాలకు అవసరమైన అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన, క్లిష్టమైన భాగాల తయారీకి మెషీన్ టూల్ ఇండస్ట్రీ తయారీ రంగంలో అతి కీలకమైన పాత్రను పోషించిందన్నారు. ఇన్స్పేస్ కార్యక్రమం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందన్న శివన్ ఇస్రో కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ప్రైవేట్ పరిశ్రమలను కోరారు.
అంతకు ముందు తన స్వాగతోపన్యాసంలో రాఘవన్ మాట్లాడుతూ భారతీయ మెషీన్ టూల్ పరిశ్రమ 2022–23లో దాదాపు 9500–10వేల కోట్ల రూపాయలకు చేరనుంది అని అన్నారు. ప్రదర్శనలో భాగంగా తొలిరోజు ఇండియన్ మెటల్ ఫార్మింగ్ మెషీన్ టూల్ పరిశ్రమ 2022 తో పాటుగా ఇమ్టెక్స్ ఫార్మింగ్ 2022 ప్రదర్శన కేటలాగ్ విడుదల చేశారు. ఈ ప్రదర్శన జూన్ 21వ తేదీ వరకూ జరుగనుంది. దాదాపు 19 దేశాల నుంచి 350 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్న ఈ ప్రదర్శనకు 40వేల మంది సందర్శకులు వస్తారని అంచనా.