Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి : వృద్థి అవకాశాలకు ఎటువంటి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత వృద్ధికి దోహదం చేసే చర్యలపై దృష్టి పెట్టామన్నారు. అయినప్పటికీ 2021లో జీడీపీ 6.6 శాతం క్షీణించిందన్నారు. ఈ క్రమంలో వృద్ధి నుంచి ద్రవ్యోల్బణం వైపు దృష్టిని మరల్చలేకపోయామన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో కేంద్ర బ్యాంక్ సకాలంలో స్పందించిందనీ.. ఈ విషయంలో ఏ మాత్రం తొందరపడిన ఆర్థిక వ్యవస్థపై వినాశకర పరిణామాలు ఉండేవని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం ఓ దశలో అత్యవసరంగా మారిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్లుగా తొలుత అంచనా వేశామని.. కానీ ఉక్రెయిన్- రష్యా పరిణామాలతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. అప్పుల రికవరీకి కఠిన పద్దతులను అనుసరించడం ఎంతమాత్రం సరైన పద్దతి కాదన్నారు. ముఖ్యంగా తమ నియంత్రణలోలేని సంస్థలు రుణాల రికవరీకి అనుసరిస్తున్న పద్దతులపై ఆర్బీఐ దృష్టి సారించిందన్నారు.