Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ పాఠశాలల్లోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసేందుకు..
ఇండియా, 19 జూన్ 2022 : ప్రపంచంలో సుప్రసిద్ధ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు నాణ్యమైన విద్యను చేరువ చేయనున్నారు. ఈ భాగస్వామ్యంతో అత్యున్నత నాణ్యత, సాంకేతిక ఆధారిత మ్యాథ్స్, సైన్స్ రిశోర్స్లు నాల్గవ తరగతి మొదలు పదవ తరగతి విద్యార్ధులకు అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 'బైజూస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. దీని ద్వారా నాణ్యమైన అభ్యాసాంశాలను ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల విద్యార్ధులకు సైతం అందించగలము. ఈ కార్యక్రమం ద్వారా, ప్రభుత్వ పాఠశాలల్లోని 4 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు సరైన మార్గనిర్ధేశకత్వం, విద్యతో మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా చేసుకున్నాము. వారు మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఇది సహాయపడనుందని ఆశిస్తున్నాము. అత్యుత్తమ విద్యా వ్యవస్థకు ఓ ఆకృతినివ్వడానికి ముందుకు వచ్చిన బైజూస్‌కు ధన్యవాదములు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి విద్యార్ధులకు టాబ్లెట్స్ అందించేందుకు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది` అని అన్నారు.
బైజూస్ ఫౌండర్, సీఈవో బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే మా నిబద్ధత దిశగా ఇది మరో ముందడుగా నిలుస్తుంది. విద్య అనేది ప్రాధమిక హక్కు. విద్యార్ధుల సామాజిక-ఆర్ధిక పూర్వాపరాలు, వారున్న ప్రాంతాలతో సంబంధం లేకుండా అది అందరికీ లభ్యం కావాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా , ఈ తరహా భాగస్వామ్యాలు అత్యున్నత ప్రభావం చూపుతాయనే భావనలో ఉన్నాను. ఈ సమ్మిళిత ప్రయత్నాలు ప్రతి చిన్నారికీ సహాయపడటంతో పాటుగా వారి వాస్తవ సామర్థ్యం బయటకు తీసుకువచ్చేందుకు తోడ్పడుతుంది` అని అన్నారు.
ఈ అవగాహన ఒప్పందంతో, ఏ ఒక్క విద్యార్ధీ విద్యావనరులు లేక చదువుకు దూరం కాకూడదనే లక్ష్యానికి మరింత చేరువవుతున్నాము. గత రెండు సంవత్సరాలుగా ఆన్లైన్ విద్యకు గణనీయంగా ఆదరణ పెరగడంతో విద్యావ్యవస్ధ వేగవంతంగా డిజిటలీకరించబడుతుంది. తద్వారా లక్షలాది మంది విద్యార్ధులు తమ పూర్తి సామర్ధ్యం తెలుసుకునే అవకాశం కూడా కలిగింది. ఈ భాగస్వామ్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విప్లవానికి సహాయపడటంతో పాటుగా సాంకేతిక ఆధారిత అభ్యాసాన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.