Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశపు టియర్ 2 + పట్టణాలలోని విద్యార్థులకు వినూత్నమైన అభ్యాస అవకాశాలు మరియు అవగాహన తీసుకురానుంది
మాస్టర్‌క్లాస్‌ను 3500కు పైగా భాగస్వామ్య పాఠశాలల్లోని 1.4 మిలియన్ల మందికి పైగా విద్యార్థుల కోసం నిర్వహించారు
నిజామాబాద్, జూన్ 19, 2022: భారతదేశంలోని చిన్న పట్టణాలకు చెందిన విద్యార్థులకు వినూత్నమైన అనుభవాలు, అవగాహన మరియు అభ్యాసాన్ని తీసుకురావాలనే తమ ప్రయత్నంలో భాగంగా భారతదేశపు అగ్రగామి పాఠశాల ఎడ్టెక్ కంపెనీ లీడ్ నేడు ఎక్స్‌క్లూజివ్ మాస్టర్ క్లాస్ సిరీస్‌ను వ్యక్తిత్వ వికాసం పై సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు ఆర్ మాధవన్‌తో నిర్వహించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. భారతదేశంలో 400కు పైగా పట్టణాలు, నగరాల్లోని లీడ్ పవర్డ్ స్కూల్స్ విద్యార్థుల కోసం ట్యూటర్ మరియు మార్గదర్శిగా ఆర్ మాధవన్ మారారు. ఆయన తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాలను గురించి వెల్లడించడంతో పాటుగా ప్రదర్శన నైపుణ్యాలు, శారీరక భాష, సామాజిక మర్యాద సహా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కళ, శాస్త్రపు అంతరాల్లోకి తీసుకువెళ్లారు.
లీడ్ విద్యార్థులతో వర్ట్యువల్‌గా జరిగిన తన సంభాషణలలో మాధవన్, ఎదుగుదల మనస్తత్వాన్ని పెంచుకోవడం, స్వీయ గౌరవం నిర్మించుకోవడం, జీవితంలో ప్రతి అంశంలోనూ విజయం సాధించడంలో వ్యక్తిత్వ వికాసం ఏ విధంగా అత్యంత కీలకమైనదీ వివరించారు. సరైన పాఠశాల విద్య సంపూర్ణ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడగలిగేదీ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలదనే అంశాలపై కూడా ఆర్ మాధవన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
లీడ్ కోఉఫౌండర్ అండ్ సీఈఓ సుమీత్ మెహతా మాట్లాడుతూ 'అవగాహన మరియు అభ్యాస అవకాశాలను అందించగలిగితే భారతదేశపు టియర్ 2+ పట్టణాలలోని విద్యార్థులు సైతం మెట్రో నగరాల్లోని విద్యార్థులలా మెరుగైన ప్రదర్శన కనబరచగలరని నిరూపితమైనది. లీడ్ నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌తో చిన్న పట్టణాలలోని విద్యార్థులు భవిష్యత్‌కు అవసరమైన జీవిత నైపుణ్యాలను ఆ అంశాలపై నిపుణులు మరియు ఆర్ మాధవన్ లాంటి సెలబ్రిటీల నుంచి అభ్యసించగలరు. ప్రతి చిన్నారికీ అత్యద్భుతమైన అభ్యాసాన్ని అందుబాటులోకి తీసుకురావడం మా లక్ష్యాలలో అతి కీలకమైన భాగం` అని అన్నారు.
ఆర్ మాధవన్ మాట్లాడుతూ 'లీడ్స్ మాస్టర్ క్లాస్‌లో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. నా జీవిత అనుభవాల ద్వారా యువ హృదయాలకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని కలిగించే అవకాశం దీని ద్వారా నాకు కలిగింది. భారతదేశంలోని పాఠశాలలు భవిష్యత్ నైపుణ్యాలైనటువంటి వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై చిన్నతనం నుంచే తగిన శిక్షణ అందించాల్సి ఉంది. విద్యార్ధులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడటంలో అత్యంత కీలకపాత్రను ఇవి పోషిస్తాయి. నేటి కాలంలో, పాఠశాలలు సంపూర్ణ అభ్యాస వాతావరణాన్ని అందించడం అత్యంత కీలకం. ఇది విద్యార్థులను భవిష్యత్‌లో పూర్తి ఆత్మవిశ్వాసం కలిగిన నాయకులుగా ఎదిగేందుకు తగిన వీలు కల్పిస్తుంది` అని అన్నారు.
లీడ్ పవర్డ్ స్కూల్స్‌కు చెందిన విద్యార్ధులు పూర్తి శ్రద్ధతో ఈ మాస్టర్‌క్లాస్‌ను విన్నారు. జీవితంలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన అంశాలను గురించి మాధవన్ వెల్లడించారు. దీనిలో మొదటి సారి చూసిన వెంటనే మంచి అభిప్రాయం ఎలా పొందాలి, సరైన బాడీ లాంగ్వేజ్ ఆవశ్యకత మరియు ఆత్మవిశ్వాసంతో ఏ విధంగా మాట్లాడాలనే అంశాలు సైతం ఉన్నాయి.
భారతదేశంలోని టియర్ 2+ పట్టణాలలోని పాఠశాల విద్యార్థులకు సైతం సంపూర్ణమైన అభ్యాస అనుభవాలను అందించేందుకు ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి కార్యక్రమం లీడ్స్ మాస్టర్ క్లాస్. దీనిద్వారా ఆయా బోధనాంశాలలో నిపుణులు మరియు సెలబ్రిటీల నుంచి నేరుగా అభ్యసించే అవకాశం కలుగుతుంది. వ్యక్తిగత ప్రతిభ మరియు నైపుణ్యం ఆధారంగా లీడ్స్ మాస్టర్ క్లాస్ సిరీస్ విద్యార్థులను పెద్ద కలలు కనాల్సిందిగా ప్రోత్సహిస్తూనే, తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడంలో తగిన ఆత్మవిశ్వాసమూ అందిస్తుంది. గతంలో లీడ్ మాస్టర్ క్లాస్ పాఠాలకు సెలబ్రిటీలైనటువంటి బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, టెన్నిస్ చాంఫియన్ సానియా మీర్జా, లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వంటి వారు హాజరయ్యారు.