Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వయాకామ్ 18 యొక్క సుప్రసిద్ధ వినోద విభాగం, నికెలోడియన్ తమ ఆలోచనాత్మక కార్యక్రమాల ద్వారా విజయవంతంగా చిన్నారులకు చేరువ కావడంతో పాటుగా యువ హృదయాలకు అవసకరమైన వినోదమూ అందిస్తుంది. చిన్నారులలో యోగా ప్రయోజనాల పట్ల అవగాహన మెరుగుపరిచే క్రమంలో, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు యోగా దినోత్సవ వేడుకలను మరింత ఉన్నతంగా మలిచేందుకు నికెలోడియన్ సర్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా తమ ప్రతిష్టాత్మక ప్రచారం ‘యోగా సే హై హోగా’ ను తిరిగి ప్రారంభించడంతో పాటుగా వేలాదిమంది చిన్నారులను సంతోషకరమైన యోగా ప్రపంచంలోనికి తీసుకువెళ్లింది. ఈ ప్రచారంలో భాగంగా నికెలోడియన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్నారులను విస్తృత శ్రేణి సృజనాత్మక కార్యక్రమాలతో కలుసుకోవడంతో పాటుగా వారికి అనుకూలమైన రీతిలో యోగా ప్రయోజనాలను సైతం తెలిపింది. దీనితో పాటుగా ఈ ప్రచారంలో వినోదాత్మక ఇంటరాక్టివ్ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఆన్లైన్లో యోగా తాము చేసిన యోగాసనాలను పంచుకోవడం ద్వారా టీవీలో కనిపించే అవకాశం కూడా ఉంది. దీనికోసం చిన్నారులు చేయాల్సిందల్లా నిక్ఇండియా డాట్ కామ్ (nickindia.com)కు లాగిన్ కావడంతో పాటుగా యోగా చేస్తూ ఫోటో లేదా వీడియో అప్లోడ్ చేయడం ! మరీ ముఖ్యంగా చిన్నారులు అభిమానించే ఆసనం అప్లోడ్ చేయవచ్చు.
వరుసగా మూడవ సంవత్సరం నికెలోడియన్తో భాగస్వామ్యం చేసుకోవడం గురించి ఆయుష్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, శ్రీమతి కవితా గార్గ్ మాట్లాడుతూ ‘‘గత రెండు సంవత్సరాలుగా చిన్నారులు అత్యున్నత స్థాయి ఒత్తిడి ఎదుర్కొవడంతో పాటుగా నిశ్చల జీవనశైలికి అలవాటు పడుతున్నారు. వారిని తమ సాధారణ కార్యక్రమాల వైపు మళ్లించడం తప్పనిసరి. అందుకు తగిన సహాయం కూడా చేయాల్సి ఉంది. యోగా శక్తితో వారిలో సానుకూల శక్తిని జొప్పించవచ్చు. నికెలోడియన్ యొక్క కార్యక్రమాల పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమాల ద్వారా చిన్నారులలో ఆరోగ్యవంతమైన అలవాట్లను సృజనాత్మక నమూనాలో చిన్నతనంలోనే అలవరుచుకునేలా చేయగలుగుతున్నారు. నికెలోడియన్తో మా భాగస్వామ్యం ద్వారా నిక్టూన్స్ పట్ల చిన్నారుల ఇష్టంపై ఆధారపడి ఆ చిన్నారులలో యోగాతో మానవ సంబంధాలలో సమతుల్యత తీసుకురావడం సాధ్యమవుతుందని భావిస్తున్నాం’’ అని అన్నారు. తన సంతోషాన్ని మిరా సింగ్ వెల్లడిస్తూ ‘‘ యోగా వల్ల నా ఏకాగ్రత పెరగడంతో పాటుగా పలు అంశాలపై దృష్టి సారించడమూ పెరిగింది. మన చుట్టూ ఎన్నో అంశాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ మనల్ని ప్రశాంతంగా ఉంచడంలో యోగా ఎంతగానో సహాయపడుతుంది. ఇది మానసిక ప్రశాంతత అందించడంతో పాటుగా మరింత సృజనాత్మకంగా వ్యవహరించేందుకూ తోడ్పడుతుంది. నేనెప్పుడూ కూడా ఆ కుటుంబ సభ్యులు , స్నేహితులను యోగా అభ్యసించాల్సిందిగా ప్రోత్సహిస్తుంటాను. చిన్నారులలో యోగా యొక్క ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించడంలో సహాయపడుతున్న నికెలోడియన్ పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమం గురించి ఆకృతి శర్మ మాట్లాడుతూ ‘‘ గత రెండు సంవత్సరాలు మాకు ఎంతో కష్టంగా గడిచింది. అయితే, యోగాలో నేను ఎంతో సౌకర్యం చూశాను. సరైన, చక్కటి అంశాల పట్ల నేను దృష్టి సారించేందుకు ఇది నాకు ఎంతగానో తోడ్పడింది. గత సంవత్సరాల కాలంలో, యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం, ధ్యానం మాత్రమే కాదు, అంతకు మించి ఎంతో ఉందని అర్ధం చేసుకున్నారు. నా జీవితంలో క్రమశిక్షణ ఆవశ్యకతను ఇది తెలిపింది. స్వీయ నియంత్రణ అభ్యసించేందుకూ తోడ్పడింది. ఈ కారణం చేతనే నేను నా అభిమాన నిక్టూన్స్ చూడటాన్ని చూడటం పట్ల సంతోషంగా ఉన్నాను. నా స్నేహితులను యోగా అనుసరించాల్సిందిగా, దాని ప్రయోజనాలను అనుభవించాల్సిందిగా కోరుతున్నాను’’ అని అన్నారు. యోగా ప్రయోజనాలు గురించి విస్తృతంగా నిక్టూన్స్ ప్రచారం చేస్తున్నాయి. ఇది ఆరోగ్యవంతమైన, సమతుల్యమైన జీవితం పట్ల చిన్నారులకు స్ఫూర్తి కలిగిస్తుంది. 2019లో ఈ ప్రచారంలో మోటు మరియు పట్లూ లు యోగాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటుగా కలిసి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 40వేల మంది ప్రభాత్ తార గ్రౌండ్లో పాల్గొనడంతో పాటుగా ముంబైలో అతిపెద్ద యోగా కార్యక్రమం– యోగా బై ద బేలో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో 10వేల మంది యోగీస్ హాజరయ్యారు. దీనిలో నిక్టూన్స్ శివ మరియు రుద్ర కూడా హాజరయ్యారు. గత సంవత్సరం, మహమ్మారి కారణంగా నికెలోడియన్ ఈ యోగా డే ను వర్ట్యువల్‌గా ఆయుష్ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం చేసుకుని నిర్వహించింది. దీనిద్వారా ఆరోగ్యవంతమైన రోగ నిరోధక వ్యవస్ధను నిర్మించాల్సిన ఆవశ్యకత తెలిపింది. ఈ డిజిటల్ భాగస్వామ్యం ను విస్తృత స్ధాయిలో ఇంటరాక్టివ్ పోస్ట్స్, వీడియోలతో ప్రోత్సహించారు. వీటిని అనుసరించి దేశవ్యాప్త పోటీలు సైతం నిర్వహించారు. దీనిద్వారా 6,30,000 మంది తల్లులు మరియు చిన్నారులు డిజటల్ మాధ్యమాల ద్వారా చేరుకుంది. అంతేకాదు, 3వేలకు పైగా ఎంట్రీలను బ్రాండ్ ప్లాట్‌ఫామ్‌పై యోగా పోటీలకు అందుకుంది. విస్తృత శ్రేణిలో అవగాహన మెరుగుపరచడంతో పాటుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందుగా ప్రచారం చేస్తూ నికెలోడియన్ ఈ సంవత్సరం యోగా సే హీ హోగా కోసం మొత్తం నికెలోడియన్ ఫ్రాంచైజీ, డిజిటల్ మరియు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడంతో పాటుగా ఒక బలమైన ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ప్రచారం నిర్వహిస్తుంది.