Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఏఐసీ)తో భాగస్వామ్యం చేసుకుని కనీస మద్దతు ధర హామీని విస్తరిస్తోన్న సిన్జెన్టా ఇండియా వెజిటెబుల్ సీడ్స్
గుంటూరు మార్కెట్లో మే 2022లో 2వేల మంది రైతులతో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం
మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులను కాపాడే ప్రభావంతమైన మార్గంగా నిలుస్తుంది
గుంటూరు, 22 జూన్ 2022 : చిన్న, సన్నకారు రైతులకు తగిన సాధికారితను అందించడంతో పాటుగా ఊహాతీత మార్కెట్ పరిస్ధితుల కారణంగా ఎదురయ్యే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి వారిని కాపాడే వినూత్న ప్రయత్నంలో భాగంగా సిన్జెన్టా ఇండియా ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఏఐసీ)తో ప్రత్యేకమైన ఒప్పందాన్ని గుంటూరులోని మిర్చి పంట రైతుల కోసం చేసుకుంది. ఈ ఒప్పందంతో రైతులు తమ పంట దిగుబడికి సహేతుకమైన ధరలను పొందగలరు. దానితో పాటుగా మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ నష్టాల బారిన పడకుండా కాపాడుకోగలరు.
'రైతుల కష్టాలను మేము అర్ధం చేసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని చిన్న కమతాల రైతులకు మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దాము. దీని ద్వారా వారు తమ ఆదాయానికి భద్రత పొందగలరు మరియు వారు కోరుకున్న పంటను సాగు చేసుకునే అవకాశమూ లభిస్తుంది` అని డాక్టర్ కె సీ రవి , చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్, సిన్జెన్టా ఇండియా అన్నారు.
'సిన్జెన్టా వెజిటేబుల్ సీడ్స్ డివిజన్ తో పాటుగా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రారంభించిన ఈ పథకం మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఓ గేమ్ ఛేంజర్‌గా నిలువనుంది. గుంటూరు ఏపీఎంసీ వద్ద, దాదాపు 80 శాతం ఎండుమిర్చి వేలం జరుగుతుంది. అందువల్ల ఈ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఇది సరైన ప్రాంగణం` అని రవి జోడించారు
సిన్జెన్టా వెజిటెబుల్ సీడ్స్ గత కొద్ది కాలంగా చిన్న కమతాల రైతులకు నిలకడతో కూడిన వృద్ధిని అందించేందుకు సరైన భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది . 'సిన్జెన్టా వెజిటేబుల్ సీడ్స్ ఎంతోమంది సాగుదారులకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఎందుకంటే, అత్యుత్తమ నాణ్యత కలిగిన విత్తనాలు మరియు సేవలను టీమ్ సభ్యులు అందించగలరు. మా దగ్గర విస్తృత శ్రేణిలో వెజిటేబుల్ హైబ్రిడ్స్ ఉన్నాయి. ప్రతి హైబ్రిడ్‌కూ వినూత్నత ఉంది. వారు కోరుకునే నాణ్యతలు ఉండటం వల్ల సాగుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. మా పెంపకం దారులు కమోడిటీ విక్రయాల సమయంలో మార్కెట్ ధర గురించి ఆందోళన చెందుతుండటంతో పాటుగా ఆదాయపరంగా తమకు జరుగుతున్న నష్టాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గమనించి వారికి అవసరమైన మద్దతును అందించాలనుకుంటున్నాము` అని సంజయ్ సింగ్, టెర్రిటరీ హెడ్, సౌత్ ఆసియా వెజిటేబుల్స్, సిన్జెన్టా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు.
'గుంటూరులోని అచ్చంపేట మండలంలోని ఓ చిన్న గ్రామంలో 2వేల మందికి పైగా రైతులు సిన్జెన్టా హాట్ పెప్పర్ హైబ్రిడ్ హెచ్‌పీహెచ్ 5531 సాగు చేస్తున్నారు. హాట్ పెప్పర్ రైతులు సరాసరిన రెండు ఎకరాల భూమి కలిగి ఉండటంతో పాటుగా ఎకరాకు 1.5 లక్షల రూపాయల పెట్టుబడిని పంట సాగు కోసం పెట్టారు. పంట సాగు సమయంలో మార్కెట్ ధరల కారణంగా వీరు నష్టపోకుండా చేసేందుకు, తమ పెట్టుబడుల నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు, తరువాత సీజన్లో పంట సాగు కోసం మరలా పెట్టుబడి పెట్టేందుకు తోడ్పడేలా తగు చర్యలు తీసుకున్నాము` అని సంజయ్ అన్నారు.
'ఏఐసీ ఇప్పుడు చిన్న రైతులకు వినూత్నమైన అవకాశం కల్పిస్తుంది. వీరంతా కూడా సిన్జెన్టా హాట్ పెప్పర్ హైబ్రిడ్ హెచ్‌పీహెచ్ 5331ను సాగు చేస్తున్నారు. వీరికి ఫసల్ భావాంతర్ కవచ్ మద్దతు ఉంది. ఏఐసీ యొక్క ఈ భీమా పథకంతో రైతులకు మార్కెట్లో ప్రతికూల ధరల సమయంలో కూడా తగిన రక్షణ లభిస్తుంది. ఈ ప్రొడక్ట్‌తో పాలసీ హోల్డర్లు మార్కెట్లో ధరలు ఊహాతీతంగా పడిపోయినప్పటికీ రక్షించబడతారు. బీమా చేయించిన పంట ధర పడిపోతే అంటే కనీస మద్దతు ధర లేదా థ్రెషోల్డ్ ధర కంటే తక్కువగా ఉంటే అతనికి నష్టం జరుగుతుంది. అలా జరగకుండా ఉండటం కోసం పాలసీహోల్డర్‌కు థ్రెషోల్డ్ ధర మరియు మార్కెట్ మోడల్ ధర మధ్య వ్యత్యాసాన్ని అందించడం ద్వారా పాలసీదారుకు పరహారాన్ని ఏఐసీ చెల్లిస్తుంది` అని ఏఐసీ సీఎండీ శ్రీ ఎంకె పొద్దార్ అన్నారు.
సాగు చేసిన పంటకు మార్కెట్లో అనూహ్యమైన హెచ్చుతగ్గుల కారణంగా రైతులు తరచుగా పంట మార్పిడి విధానం అనుసరించే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ విధంగా చేస్తున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోక పోవచ్చు. ఇది పెట్టుబడిపై తక్కువ రాబడికి దారి తీయవచ్చు.
మద్దతు కోసం పాలసీని ఎంచుకునే రైతులు ఊహించని విధంగా ధరల పతనం వల్ల ప్రభావితం కాలేరు. ఎందుకంటే వారు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి నష్టాన్ని నివారించుకోగలరు.
'మార్కెట్లో డిమాండ్ - సరఫరా నడుమ ఉన్న అంతరాల కారణంగా మార్కెట్లో నిత్యావసరాల ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రైతులు నష్టపోయే అవకాశాలూ ఉన్నాయి. అలా జరుగకుండా ఉండాలంటే తాము పెట్టుబడి పెట్టిన డబ్బును సురక్షితంగా ఉంచడం ద్వారా ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు. రైతులు తాము పండించిన పంటను సుదీర్ఘకాలం పాటు విక్రయించకుండా ఉండలేరు. వారు తమ వర్కింగ్ క్యాపిటల్‌ను త్వరగా పొందడంతో పాటుగా పంట ఉత్పత్తిలో ఎదురయ్యే ఖర్చులనూ సెటిల్ చేయాల్సి ఉంది. స్థిరమైన మార్కెట్ ధరను పొందడం ద్వారా రైతులు పంట ఎంపికలో సరైన నిర్ణయాలను తీసుకోగలరు` అని పొద్దార్ అన్నారు
అత్యున్నత నాణ్యత కలిగిన విత్తనాలను రైతులకు అందించడానికి సిన్జెన్టా వెజిటేబుల్ సీడ్స్ తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రతి దశలోనూ విలువను సృష్టించేందుకు, సస్టెయినబల్ వృద్ధికి భరోసా అందించేందుకు ఉత్పత్తి ఆవిష్కరణలనూ చేస్తుంది.
సిన్జెన్టా ఫౌండేషన్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) సైతం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. రైతులకు భీమా విస్తరించేందుకు సరైన మద్దతు భాగస్వామిని గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.