Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· సెక్యూర్+ గూగుల్ నెస్ట్ క్యామ్ (బ్యాటరీ) మరియు నెస్ట్ అవేర్ను టాటా ప్లే అందుబాటులోకి తీసుకు రాగా, ఇండ్లకు అత్యాధునిక భద్రత పర్యవేక్షణ అందిస్తూ వ్యక్తులు, ప్రాణులు, వాహనాలు, పరిచయం ఉన్న ముఖాలను గుర్తించే ఇంటెలిజెంట్ అలర్ట్ తదితరాలను ఇది కలిగి ఉంది
· ముంబయి, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, దిల్లీ+ ఎన్ఎసిఆర్, లక్నో మరియు జైపూర్‌లలోని టాటా ప్లే చందాదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది.
టాటా ప్లే సెక్యూర్+ | 2-వే కమ్యూనికేషన్ - https://youtu.be/AQ5MoycKzcc
టాటా ప్లే సెక్యూర్+ | ప్రాణిని చూసిన అలర్ట్ - https://youtu.be/qU4zbqNr_Zg
టాటా ప్లే సెక్యూర్+ | క్లౌడ్ స్టోరేజ్ - https://youtu.be/dBVYZbXnEhw
టాటా ప్లే సెక్యూర్+ | ఫేస్ డిటెక్షన్ - https://youtu.be/iTYfCyOxu_w
టాటా ప్లే సెక్యూర్+ | థీమ్యాటిక్ ఫిలిం- https://youtu.be/fZYpwYmTSWE
న్యూఢిల్లీ : భారతదేశంలో ముందంజలో ఉన్న కంటెంట్ వితరణ ప్లాట్ఫారం టాటా ప్లే (ఇంతకు మునుపు టాటా స్కై అని పేరు) నేడు టాటా ప్లే సెక్యూర్ మరియు టాటా ప్లే సెక్యూర్+ విడుదల ద్వారా గృహ భద్రత పరిష్కరణల విభాగంలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. బ్రాండ్ చిహ్నం మార్పు సందర్భంలోనే టాటా ప్లే ఈ కొత్త విషయాన్ని తన చందాదారులకు సురక్షితమైన ఇంటిని ఇవ్వాలని నిర్ణయించుకోగా, ఇది ఉత్తమమైన రేపటికి మార్గాన్ని సూచిస్తుంది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
సెక్యూర్+ ఆఫరింగ్‌లకు టాటా ప్లే ఇప్పుడు గూగుల్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా, తన చందాదారులకు గూగుల్ నెస్ట్ సెక్యూరిటీ కెమెరాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. టాటా ప్లే సెక్యూర్+ బండ్లెడ్ సేవ కాగా, అందులో బ్యాటరీతో కూడిన గూగుల్ నెస్ట్ క్యామ్, వార్షిక చందాతో నెస్ట్ అవేర్ మరియు గూగుల్ నెస్ట్ మినీ ఉంటాయి. గూగుల్ నెస్ట్ క్యామ్ మెరుగైన ప్రత్యేకతలను కలిగి ఉండగా, అందులో వ్యక్తి/ ప్రాణి/ వాహనాల అలర్ట్‌లు, ఆన్-డివైస్ ప్రాసెసింగ్, బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ మరియు స్పీకర్ ద్వారా టూ-వే కమ్యూనికేషన్, వెదర్ రెసిస్టెన్స్ తదితరాలు ఉన్నాయి. నెస్ట్ క్యామ్ బ్యాటరీ-పవర్డ్ కాగా, అనుకూలకరమైన స్థలాల్లో ఉంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది మరియు విద్యుత్తు లేదా వై-ఫై లేనప్పుడు కూడా రికార్డు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టాటా ప్లే సెక్యూర్+లో విలక్షణ ప్రత్యేకతల్లో నెస్ట్ అవేర్ ఉండగా, అందులో పరిచయం ఉన్న ముఖాన్ని గుర్తు పట్టడం మరియు 30/60 -రోజుల పాటు వీడియో హిస్టరీని చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇన్స్టాలేషన్ మరియు నిర్వహణ సేవలు, విక్రయాననంతర మరియు కస్టమర్ కేర్‌ను టాటా ప్లే నిర్వహిస్తుంది. నెస్ట్ క్యామ్ మరియు నెస్ట్ అవేర్కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ పొందండి.
విడుదల చేస్తున్న మొదటి దశలో ఈ ఆఫర్ ముంబయి+ నవీ ముంబయి, థాణే, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, దిల్లీ+ ఎన్‌సిఆర్, లక్నో మరియు జైపూర్‌లతో కలిసి 10+ నగరాల్లో టాటా ప్లే చందాదారులకు అందుబాటులో ఉంటుంది. నెస్ట్ అవేర్ సేవలను నెస్ట్ క్యామ్ (బ్యాటరీ)తో విక్రయిస్తారు. దీని ధర బేసిక్ ప్లాన్ ఏటా రూ.3000 నుంచి మరియు ప్రీమియం ప్లాన్ రూ.5000 నుంచి ప్రారంభమవుతుంది. మా ప్లాన్లకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ పొందండి. https://store.google.com/in/product/nest_cam_battery?hl=en-GB&pli=1
ముంబయి+ నవీ ముంబయి, థాణే, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, దిల్లీ+ ఎన్‌సిఆర్, లక్నో మరియు జైపూర్లలో ప్రస్తుత మరియు కొత్త టాటా ప్లే చందాదారులు www.tataplay.com లో లాగిన్ కావచ్చు లేదా టాటా ప్లే కస్టమర్ కేర్‌ను 1800 208 6633 లేదా 1860 500 6633 సంఖ్యకు కాల్ చేయవచ్చు లేదా 08066982700 సంఖ్యకు మిస్డ్ కాల్ చేసి మరింత సమాచారాన్ని మరియు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
టాటా ప్లే చీఫ్ కమర్షియల్ అండ్ కంటెంట్ ఆఫీసర్ పల్లవి పురి మట్లాడుతూ, ‘‘టాటా ప్లే సెక్యూర్ మరియు టాటా ప్లే సెక్యూర్+ విడుదలతో మేము మా చందాదారులకు సురక్షిత మరియు భద్రతల ఎకోసిస్టమ్‌ను వారి ఇంటికి లేదా పని చేసే స్థలంలో నిర్మించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. ఈ కొత్త ఆఫర్ మనోరంజనకు అవతల కూడా అనుభవాలను అందించే మా ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది. గూగుల్‌తో కలిసి టాటా ప్లే సెక్యూర్+ ఆఫర్‌కు భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇది భారతదేశానికి నిజంగా అత్యాధునిక గృహ భద్రత అనుభాన్ని అందించనుంది’’ అని పేర్కొన్నారు.
గూగుల్ ఇండియా మరియు దక్షిణ ఆసియా హార్డ్‌వేర్ బిజినెస్ డెవలప్మెంట్ అధికారి సౌరభ్ ఆర్య మాట్లాడుతూ, ‘‘టాటా ప్లేతో భారతదేశానికి మా కొత్త తరపు నెస్ట్ క్యామ్ మరియు నెస్ట్ అవేర్ సేవలను తీసుకు వస్తున్నందుకు థ్రిల్‌గా ఉంది. ఇది మహోన్నతమైన అనుభాన్ని అందిస్తుంది, దానికి ఇంట్యూటివ్ వినియోగదారుల అనుభవాన్ని అందించే ఆన్-డివైజ్ మెషిన్ లెర్నింగ్‌లో మా విలక్షణమైన ఆవిష్కరణలకు కారణంగా ఉన్నాయి మరియు ఉన్నత స్థాయి గోప్యత మరియు భద్రత ప్రజలకు వారు పంచుకునే సమాచారం గురించి పూర్తి నియంత్రణ ఇస్తుంది. ప్రజలు, ప్రాణులు మరియు వాహనాలను గుర్తించే సామర్థ్యం వంటి ప్రత్యేకతలు, ఔట్‌డోర్ మరియు ఇండోర్లలో వినియోగించుకునే అవకాశం, హెచ్‌డిఆర్, టూ-వే కమ్యూనికేషన్ మరియు మరింత అభివృద్ధిపరచి, ఉన్నతీకరించి స్మార్ట్ సెక్యూరిటీ అనుభవాన్ని పొందేందుకు ప్రజలు ఎక్కువ సమయం వేచి ఉండాలని కోరుకోరు’’ అని పేర్కొన్నారు.
టాటా ప్లే సెక్యూర్, ప్రత్యామ్నాయ గృహ భద్రత పరిష్కారం కాగా, జూన్ 28 నుంచి చందాదారులకు అందుబాటులోకి వస్తోంది. మరిన్ని వివరాలకు లాగిన్ అవ్వండి: Best Home Security Surveillance Service in India | Tata Play https://qa-portal.tataplay.com/secure/home