Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన రికార్డ్ స్థాయికి పతనం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రోజు రోజుకు మరింత క్షీణిస్తోంది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 15 పైసలు కోల్పోయి ఏకంగా 79.60కు పడిపోయింది. ఇది రూపాయి చరిత్రలోనే అత్యంత కనిష్టం. ఇంట్రాడేలో 79.53-79.66 మధ్య కదలాడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస పతనం, ఎఫ్ఐఐలు తరలిపోవడం, వాణిజ్య లోటు పెరగడం, ద్రవ్యోల్బణం ఎగిసిపడటం తదితర పరిణామాలు రూపాయి విలువను దిగజారేలా చేస్తున్నాయి. సోమవారం సెషన్లో రూ.170.51కోట్ల ఎఫ్ఐఐలు తరలిపోయాయి. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4 వేల కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వెనక్కి పోయాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల దేశంలో పెట్టుబడుల తగ్గుదలకు దారితీయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడం, దేశంలో మందగమన గణంకాలు రూపాయిని బలహీనపర్చుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.