Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆన్-గ్రౌండ్ కాంపైన్ ద్వారా రీటైలర్ రుణాలు గురించి అవగాహన కల్పించడం
చెన్నై, తమిళనాడు, 13 జూన్ 2022: భారతదేశంలో ప్రముఖ మరియు అతి వేగంగా పెరుగుతున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్, టీవీఎస్ క్రెడిట్ ఇటీవల చిన్న, మధ్యస్థ రీటైలర్స్ అవసరాలు తీర్చడంలో సహాయపడటానికి పని మూలధనం రుణాలు, తాకట్టు లేని వ్యాపార రుణాలు, మరియు స్టాక్ కొనుగోలు ఫైనాన్సింగ్ వంటి తమ రీటైలర్ లోన్ ఆఫరింగ్స్ గురించి అవగాహన కలిగించడానికి రీటైలర్ కనక్ట్ మార్కెటింగ్ యాక్టివేషన్ ను ఆరంభించింది.
స్థానిక రిటైలర్ రంగం గత కొద్ది సంవత్సరాలుగా స్థిరంగా వృద్ధి చెందుతున్నా కూడా తక్కువ సేవలు మాత్రమే అందుకుంటోంది. తన నిజమైన సామర్థ్యాన్ని ఉపయోగించడానికి, సులభంగా క్రెడిట్ అందచేయ డం ద్వారా అంతరాన్ని తగ్గించడంలో ఎన్ బీఎఫ్ సీలు కీలకమైన బాధ్యతవహిస్తాయి. రీటైలర్స్ కు తమ పని మూలధనం పై మెరుగైన నియంత్రణ మరియు తమ వస్తువులు పై సరళతను అందించే ఆర్థిక పరిష్కారాలను టీవీఎస్ క్రెడిట్ అందిస్తోంది.
'కస్టమర్స్ అభిలాషలు నిజం చేయడానికి సకాలంలో, సరసమైన క్రెడిట్ తో వారికి సాధికారత కలిగంచే లక్ష్యానికి టీవీఎస్ క్రెడిట్ లో మేము కట్టుబడ్డాము. మా రీటైలర్ కనక్ట్ ప్రోగ్రామ్ ఈ లక్ష్యంతో ఏర్పడింది: చిన్న రీటైలర్స్ తమ వ్యాపారాన్ని పెంచుకోవడంలో సహాయపడటానికి. రాబోయే కొద్ది వారాల్లో, మేము ఈ కార్యక్రమం ద్వారా నాలుగు రాష్ట్రాలలో 1,00,000 రీటైలర్స్ తో సంబంధాన్ని కలిగి ఉండాలని లక్ష్యాన్ని కలిగి ఉన్నాము` అని చరణ్ దీప్ సింగ్, హెడ్- మార్కెటింగ్ అండ్ సీఆర్ఎం, టీవీఎస్ క్రెడిట్ అన్నారు.
చెన్నైసుభాష్ స్టోర్ ప్రొప్రైటర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. 'నా నాన్నగారితో కలిసి, నేను గత 40 ఏండ్లుగా జనరల్ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాను. మేము మా పని మూలధనం అవసరాల్ని తీర్చడానికి, మేము ఎన్నో బ్యాంక్స్ ను సంప్రదించాము కానీ చాలా డాక్యుమెంట్స్ అవసరమవడం వలన లోన్ పొందలేకపోయాము. ఆ సమయంలో, మా డిస్ట్రిబ్యూటర్స్ లో ఒకరు టీవీఎస్ క్రెడిట్ ను సూచించారు. దీని ప్రకారం, మేము అవసరాన్ని టీవీఎస్ క్రెడిట ప్రతినిధికి తెలియచేసాం, అతను ఎక్కువ ఇబ్బంది మరియు ఎక్కువ డాక్యుమెంట్ల పని లేకుండా మేము లోన్ పొందడంలో సహాయం చేసారు. నేను నా స్నేహితులు మరియు నా కుటుంబానికి టీవీఎస్ క్రెడిట్ లోన్స్ ను తప్పనిసరిగా సిఫారసు చేస్తాను` అని అన్నారు.
కాంపైన్ ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో జరుగుతోంది, ఈ రాష్ట్రాల్లో పలు పట్టణాలను కవర్ చేస్తోంది. రోడ్ ప్రదర్శనలు మరియు మార్కెట్ పై ప్రభావం చూపించ కార్యకలాపాలు ద్వారా టీమ్ రీటైలర్స్ ను చేరుతోంది. తమ వ్యాపారాన్ని పెంచుకోవడంలో సహాయపడే లోన్ ఆఫరింగ్స్ ను రీటైలర్స్ కు అందచేస్తోంది.
టూ-వీలర్ రుణాలు, యూజ్డ్ కార్ రుణాలు, ట్రాక్టర్ రుణాలు, యూజ్డ్ వాణిజ్య వాహనాల రుణాలు, వ్యాపార రుణాలు, వినియోగదారు రుణాలు మరియు పర్శనల్ లోన్స్ సహా టీవీఎస్ క్రెడిట్ ఇతర లోన్స్ ను అందిస్తోంది.