Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్, 13 జూలై 2022: హైదరాబాద్‌లో 2008 రెండవ త్రైమాసికం (Q2) అనంతరం ప్రస్తుతం రికార్డు స్థాయిలో నివాసాల విక్రయాలు నమోదయ్యాయి. అలాగే 2008 తర్వాత అత్యధిక త్రైమాసిక లాంచ్‌లు కూడా ఇప్పుడే జరిగాయి. పలు ప్రముఖ డెవలపర్లు నగరంలోని పశ్చిమ శివారు ప్రాంతాల్లో తమ వ్యాపార లావాదేవీలతో అడుగు జాడలను విస్తరించడంతో 2022 రెండవ త్రైమాసికం (Q2)లో త్రైమాసికం నుంచి త్రైమాసికానికి (Q-o-Q) కొత్త లాంచ్‌లు 24% వృద్ధి చెందాయి. అదే విధంగా Q-o-Q లోనూ విక్రయాలు 38% పెరిగాయి. హైదరాబాద్‌లో 2021 మొదటి అర్థ సంవత్సరం (H1)తో పోల్చితే 2022లోని ఆరు నెలల్లో (H1) విక్రయాలు 39% పెరిగాయి.
హైదరాబాద్‌లో అత్యధిక విక్రయాలు పశ్చిమ శివారు ప్రాంతాలైన తెల్లాపూర్, నల్లగండ్ల, కొండాపూర్ సబ్‌మార్కెట్ నుంచి వచ్చాయి. రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ యూనిట్లలో అత్యధిక విక్రయాలు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో 2022లోని మొదటి ఆరు నెలల్లో (H1) 9549 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ యూనిట్లు విక్రయం కాగా, 2021 మొదటి ఆరు నెలల్లో (H1) జరిగిన విక్రయాలతో పోల్చితే 39% అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా, 2008 రెండో త్రైమాసికం (Q2) అనంతరం ఇప్పుడే హైదరాబాద్ అత్యధిక త్రైమాసిక విక్రయాలను చూసిందిు అని జెఎల్ఎల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ వివరించారు.
2022 Q2లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ఆరోగ్యకరమైన ఆఫ్టేక్
హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్ 2022 రెండవ త్రైమాసికంలో (Q2) 53,000 యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, ఇది టాప్ 7 నగరాల్లో 2021 రెండవ త్రైమాసికంతో (Q2) పోల్చితే ఏడాది నుంచి ఏడాదికి (Y-o-Y) 171% వృద్ధి చెందింది. ఒకవైపు మహమ్మారి నియంత్రణ, మరో వైపు కొనుగోలుదారుల్లో పెరిగిన విశ్వాసానికి అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సీక్వెన్సియల్ ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో విక్రయాలు 3% వృద్ధి చెందాయి. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, వడ్డీ రేట్లతో రెసిడెన్షియల్ ధరలలో పెరుగుదల 2022 రెండవ త్రైమాసికంలో (Q2) దాదాపు ఫ్లాట్ సీక్వెన్షియల్ వృద్ధికి దారితీసింది. మొత్తం విక్రయాల్లో ముంబయి (23%) అనంతరం బెంగళూరు 21%, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 19% ఉన్నాయి. విక్రయాల్లో వృద్ధి పరంగా Q-o-Q పరిశీలిస్తే 2022 రెండవ త్రైమాసికంలో (Q2) పరిశీలనలో ఉన్న అన్ని నగరాల్లో హైదరాబాద్ అత్యధిక వృద్ధిని (38%) సాధించింది. అంతేకాకుండా, 2021 రెండవ త్రైమాసికంలో (Q2) విక్రయించిన యూనిట్లు 2021 రెండవ త్రైమాసికంలో (Q2) విక్రయించిన 3,157 యూనిట్లతో పోల్చితే 2022 రెండవ త్రైమాసికంలో (Q2) విక్రయించిన 5,537 యూనిట్లతో పోల్చితే 2022 రెండవ త్రైమాసికంలో (Q2) Y-o-Y విక్రయాలు 75% వృద్ధిని సాధించింది.
డేటాలో అపార్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి. మా విశ్లేషణ నుంచి రో హౌస్‌లు, విల్లాలు, ప్లాట్ డెవలప్మెంట్లు మినహాయించాము.
మూలం: రియల్ ఎస్టేట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (REIS), జెఎల్ఎల్ రీసెర్చ్
ప్లాట్లు, విల్లాల విభాగంలో మరో 6,013 రెసిడెన్షియల్ యూనిట్లు 2022 రెండవ త్రైమాసికంలో (Q2) టాప్ ఏడు నగరాల్లో విక్రయం అయ్యాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్‌లలో ఎక్కువ శాతం ట్రాక్షన్ కనిపించింది. ప్లాట్లు, విల్లాల విభాగంలో త్రైమాసిక విక్రయాలలో 28% హైదరాబాద్ నుంచే వచ్చాయి. ఈ విభాగంలో 1700 రెసిడెన్షియల్ యూనిట్లు విక్రయం అయ్యాయి.
2021 మొదటి ఆరు నెలల (H1) కన్నా 2022లో మొదటి ఆరు నెలలలో (H1)విక్రయాల్లో బలమైన పునరుద్ధరణ
గమనిక: ముంబయిలో ముంబయి నగరం, ముంబయి ప్రాంతాలు, థానే నగరం మరియు నవీ ముంబయి కలిసి ఉన్నాయి.
డేటాలో అపార్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి. మా విశ్లేషణ నుంచి రో హౌస్‌లు, విల్లాలు, ప్లాట్ డెవలప్మెంట్లు మినహాయించాము.
మూలం: రియల్ ఎస్టేట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (=జు×ూ), జెఎల్ఎల్ రీసెర్చ్
ఉత్తరం వైపు ధరలు పెరుగుతున్నాయి
ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల, బలమైన డిమాండ్ కారణంగా హైదరాబాద్ మినహా అన్ని నగరాల్లో Y-o-Y3-7% వృద్ధిని చూపించే మూలధన విలువలతో నివాస ధరలలో పెరుగుదలకు కారణమైంది. అదే సమయంలో రెండంకెల ధరల వృద్ధిని సాధించడం ద్వారా స్థిరత్వాన్ని ప్రదర్శించింది. 'డెవలపర్లు ఇన్పుట్ ధర పెరుగుదలను పాక్షికంగా ఆమోదించడంతో, అది ఇప్పుడు ప్రస్తుత నివాస ధరలలో ప్రతిబింబిస్తోంది. కొత్త లాంచ్‌లు కూడా అధిక ధరలతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా వడ్డీ రేట్లు పెరగడంతో, సొంత ఇంటి ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది డిమాండ్‌లో కొంత స్వల్పకాలిక ద్రవ్యోల్బణానికి కారణం కావచ్చు కానీ, ఇంటి యాజమాన్యం చుట్టూ మారుతున్న డైనమిక్స్ మరియు వడ్డీ రేట్లు ఇప్పటికీ దిగువ వైపున ఉన్నందున, నివాస డిమాండ్, దాని వృద్ధి పథంలో కొనసాగే అవకాశం ఉంది. ఐటీ రంగం మరియు స్టార్టప్‌ల ద్వారా అందుబాటులోకి వస్తున్న ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెట్‌ను ముందంజలోకి తీసుకు వెళుతున్నాయి. అదనంగా, ఎస్ఆర్డిపి కార్యక్రమం ద్వారా నగరంలోని మౌలిక సదుపాయాలపై పెట్టుబడితో నగరంలోని ఉత్తరం, తూర్పు విభాగాల్లో కొత్త రెసిడెన్షియల్ క్లస్టర్లను ప్రారంభించేందుకు అవకాశం కలిగింది. ఇది రెసిడెన్షియల్ అమ్మకాలను పెంచడంలో దోహదపడుతోంది` అని భారతదేశంలో జెఎల్ఎల్ చీఫ్ ఎకనామిస్ట్ మరియు హెడ్ రీసెర్చ్ అండ్ ఆర్ఇఐఎస్ డా.సమంతక్ దాస్ వివరించారు.
కొత్త లాంచ్‌ల స్కేల్-అప్
2022 రెండవ త్రైమాసికంలో (Q2) 63,000 కన్నా ఎక్కువ యూనిట్లతో కొత్త లాంచ్‌లు నమోదు కాగా, Q-o-Q 6% మరియు Y-O-Y 135% వృద్ధి నమోదైంది. కొత్త లాంచ్‌లలో ముంబై 27% వాటాతో ఆధిపత్యం కొనసాగించగా, తర్వాత హైదరాబాద్ మరియు పూణె వరుసగా 25% మరియు 21%తో మద్ధతు అందించాయి. ఢిల్లీ ఎన్‌సిఆర్, హైదరాబాద్, ముంబై మరియు పుణెలలో Q-o-Q ప్రాతిపదికన త్రైమాసిక లాంచ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇది బెంగళూరు, చెన్నై మరియు కోల్‌కతాలో ఈ త్రైమాసిక కొత్త లాంచ్‌ల ధోరణి తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో ఈ త్రైమాసికంలో కొత్త లాంచ్‌లు 24% పెరిగాయి, ఇది త్రైమాసిక వృద్ధి రేటులో పుణె తదుపరి స్థానంలో నిలిచింది.
2022 రెండవ త్రైమాసికంలో (Q2) విస్తరించిన కొత్త ప్రాజెక్ట్ లాంచ్‌లు
భారతదేశంలోని టాప్ ఏడు నగరాల్లో 2022 రెండవ త్రైమాసికంలో (Q2) ప్లాట్లు మరియు విల్లా విభాగాలలో దాదాపు 8,056 యూనిట్లు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌లకు కొనుగోలుదారుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ప్లాట్లు మరియు విల్లా విభాగంలో 20% లాంచ్‌లు హైదరాబాద్ నుంచే వచ్చాయి. ఈ విభాగంలో దాదాపు 1630 రెసిడెన్షియల్ యూనిట్లు ప్రారంభమయ్యాయి.
విక్రయం కాని ఇన్వెంటరీ 2.1% వృద్ధి చెందుతుంది
022 రెండవ త్రైమాసికంలో (Q2) కొత్త లాంచ్‌లు విక్రయాలను అధిగమించడంతో Q-o-Q ప్రాతిపదికన ఏడు నగరాల్లో అమ్ముడుపోని జాబితా 2.1% పెరిగింది. ముంబయి, ఢిల్లీ ఎన్‌సిఆర్ మరియు బెంగళూరు కలిసి విక్రయం కాని స్టాక్‌లో 60% వాటాను కలిగి ఉన్నాయి. విక్రయించాల్సిన సంవత్సరాల అంచనా (YTS) స్టాక్‌ను లిక్విడేట్ చేసేందుకు అంచనా వేసిన సమయం 2022లో మొదటి త్రైమాసికంలో (Q1) 4.2 ఏళ్ల నుంచి 2022లో రెండవ త్రైమాసికంలో (Q2) 3.6 ఏళ్లకు క్షీణించడం ఇది బలమైన అమ్మకాల వృద్ధికి సూచన అని చెప్పవచ్చు.
హైదరాబాద్‌లో రెండవ త్రైమాసికంలో (Q2) విక్రయించబడని జాబితా వృద్ధి పెరిగింది. ఎందుకంటే కొత్త లాంచ్‌లు నగరంలో అమ్మకాలను అధిగమించాయి మరియు వైటిఎస్ (YTS) గత త్రైమాసికంతో పోలిస్తే ఏ మార్పు లేకుండా ఉంది.
మొత్తం అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ నిష్పత్తిలో అమ్మకాల పనితీరును విశ్లేషించడం
విక్రయాల వ్యాప్తి - మొత్తం అందుబాటులో ఉన్న ఇన్వెంటరీకి వ్యతిరేకంగా విక్రయించిన అపార్ట్మెంట్ల % అని నిర్వచించగా, మార్కెట్లు వాస్తవానికి సాధారణ ప్రాతిపదికన ఎలా పనిచేశాయో, అన్ని నగరాల్లో విక్రయం కాని, ఇన్వెంటరీ వివిధ స్థాయిలకు కారణమవుతుంది. ఈ మెట్రిక్‌తో పోలిస్తే, 2022 మొదటి ఆరు నెలలకు (H1) సంబంధించిన విక్రయాల వ్యాప్తి పాన్-ఇండియా స్థాయిలో సగటున 18% మేర ఉంది. వ్యక్తిగత నగరాలను పరిశీలిస్తే, విక్రయాలు అత్యధికంగా పుణెలో (28%), బెంగళూరు మరియు కోల్‌కతా (21%) సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నాయి. పుణె మరియు కోల్‌కతా రెండూ అపార్ట్మెంట్ల సంపూర్ణ అమ్మకాల పరంగా చిన్న మార్కెట్ అయినప్పటికీ విక్రయాల వ్యాప్తిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు సాధారణీకరించిన పోలికతో అవి మెరుగ్గా పనిచేస్తాయి. నగరాల్లో విక్రయాల పనితీరును విశ్లేషించినప్పుడు విక్రయాలు మెరుగు కావడం మధ్య వృద్ధి చెందుతున్న ఇన్వెంటరీ స్థాయిలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఔట్లుక్:
పెరుగుతున్న ఇన్పుట్ ధరను డెవలపర్లు కొనుగోలుదారులకు పాక్షికంగా అందించారు. వడ్డీ రేట్లు పెరగడం కూడా అదనపు భారంగా మారింది. ఫలితంగా, స్వల్పకాలంలో అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టవచ్చు. ఏది ఏమైనప్పటికీ, మహమ్మారిని విజయవంతంగా నిలువరించడం, కొనుగోలుదారుల మెరుగైన మనోభావాలు మరియు నివాస మార్కెట్లో బలమైన మూలాధారాలు మధ్యస్థం నుంచి దీర్ఘకాలికంగా లాంచ్‌లు మరియు అమ్మకాలు రెండింటిలోనూ వృద్ధికి దారి తీస్తాయి. కస్టమర్-సెంట్రిక్ మరియు నిరూపితమైన ఎగ్జిక్యూషన్ సామర్ధ్యం, అలాగే నాణ్యమైన ఉత్పత్తులను కలిగి ఉన్న విశ్వసనీయ డెవలపర్లు మాత్రమే మనుగడ సాగిస్తారు మరియు దృఢంగా ఉంటారు.