Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్య, కాలుష్యం, వ్యవసాయ అమసర్థతలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నామని అంటున్న హైదరాబాద్ యువత
హైదరాబాద్ : హైదరాబాద్ లో శామ్ సంగ్ ఇండియా నిర్వహించిన ఎడ్యుకేషన్ మరియు ఇన్నోవేషన్ రోడ్ ప్రదర్శనలో కళాశాలకు చెందిన యువ విద్యార్థులు ముందుకు వచ్చి రాష్ట్రంలో, దేశంలో ప్రజలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. సాల్వ్ ఫర్ టుమారో గురించి వాగ్థానం చేసారు. విద్య పరిమితంగా అందుబాటులో ఉండటం, నేర్చుకోవడానికి భాషా అడ్డంకులు, తీవ్రమైన కాలుష్యం, తయారీ మరియు వ్యవసాయ అసమర్థతలు, ఆరోగ్య సంరక్షణ మద్దతు లేకపోవడం, పరిమితంగా వ్యవసాయ విజ్ఞానం వంటి పరిమితంగా అవకాశం ఉన్న వాస్తవిక ప్రపంచం సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటు న్నామని హైదరాబాద్ లో విద్యార్థులు కోరుకున్నారు. తమ ఆలోచనలను చర్యలుగా మార్చటంలో తమకు సలహా ఇచ్చి, మద్దతు చేసే మరియు ప్రజల జీవితాలను మార్చడంలో సహాయపడే శామ్ సంగ్ వారి సాల్వ్ ఫర్ టుమారో ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ పోటీ వంటి వేదికల్ని తాము కోరుకుంటున్నామని అన్నారు.
శామ్ సంగ్ అంతర్జాతీయ సీఎస్ఆర్ కార్యక్రమం సాల్వ్ ఫర్ టుమారో గురించి మాట్లాడటానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హైదరాబాద్ లోని 500 మందికి పైగా విద్యార్థులతో పాట నగరానికి చెందిన యువ ఆవిష్కరణకర్తలు - ఆరోగ్య సంరక్షమ మరియ సంక్షేమ ఉత్పత్తులు కోసం పని చేసే డాక్టర్. సత్యనారాయణ కూచిభట్ల, సహ-స్థాపకులు, పరిశోధన టెక్నాలజీస్, చిన్న రైతులు /భూ యజమానులకు అందుబాటులో ఉండే మరియు సరసమైన సంక్లిష్టమైన వ్యవసాయ సామగ్రిని తయారు చేయడానికి కృషి చేసిన ఆర్ షణ్ముఖ రావు , ఆవిష్కరణకర్త, మరియు సుస్థిరత సంచారం విభాగంలో పని చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి, డేటా సైంటిస్ట్, సహ స్థాపకులు -హల మొబిలిటి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం విజయవంతంగా సామాజిక సంస్థలను నిర్వహిస్తున్న ఈ నవ వైతాళికులు తమ విజయం యొక్క అనుభవాలు మరియు వైఫల్యాలు మరియు తమ చుట్టూ ఉన్న సమాజాలను మార్చటానికి తమకు గల కల గురించి విద్యార్థులతో మాట్లాడారు.
సాల్వ్ ఫర్ టుమారో ఆరంభ సంచిక విద్య, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ మరియు వ్యవసాయ రంగాల్లో 16-22 సంవత్సరాలకు చెందిన భారతదేశంలో యువత నుండి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. కార్యక్రమంలో పాల్గొనడానికి యువత తమ ఆలోచనలను జులై 31, 2022 వరకు పంపించవచ్చు.
దరఖాస్తు వెబ్ సైట్: http://www.samsung.com/in/solvefortomorrow
ఇప్పటి వరకు, దేశవ్యాప్తంగా 7,000కి పైగా బృందాలు ఈ ఇన్నోవేషన్ పోటీ కోసం తమ పేర్లను నమోదు చేశారు. దీనిలో ముగ్గురు జాతీయ విజేతలు ఐఐటీ ఢిల్లీ వారి నిపుణుల సలహా క్రింద తమ ఆలోచనలను తరువాత స్థాయికి తీసుకువెళ్లడానికి ఐఎన్ఆర్ 1 కోటి వరకు మెగా సహాయం మరియు సలహా మద్దతుని ఆరు నెలలు కోసం పొందుతారు.