Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాము గడిపే ప్రదేశాలను అత్యున్నతంగా శుభ్రపరచడంలో భారతీయులు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. డైసన్ గ్లోబల్ డస్ట్ స్టడీ 20221 ప్రకారం 46% మంది భారతీయులు గణనీయంగా తమ క్లీనింగ్ కార్యక్రమాలను పెంచుకున్నారు. ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు భారతీయులు తమ ఇళ్లను వారానికి 5– 7 సార్లు శుభ్రపరుస్తున్నారు. మొత్తం ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ఇది చాలా ఎక్కువ. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి, మనం శుభ్రపరుస్తున్న ప్రాంగణాలన్నీ నిజంగా శుభ్రపడుతున్నాయా ? మన కంటికి కనబడని ధూళి, దుమ్ము ఇంకా అక్కడ ఉంటుందనిపిస్తుందా ? ఆఖరకు మీరు పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేసినప్పటికీ, మీరు ధూళి కణాలకు హాట్‌స్పాట్‌గా నిలిచే ప్రాంతాలను కవర్ చేశారా ? భారతదేశంలో ప్రతి 10 గృహాలలో ఏడు గృహాలలో ఒక డస్ట్ ఎలర్జీ బాధితులు ఉంటున్నారు. అయినప్పటికీ 40% మంది భారతీయులు ఇప్పటికీ ఇంటిలో ధూళి కణాలు ప్రమాదకరంకాదని భావిస్తున్నారని అధ్యయనం1 వెల్లడించింది. తరచుగా, మనం నిల్వ ఉన్న ధూళి కణాలను గురించి పెద్దగా పట్టించుకోము మరియు ఆధూళి కణాలు మన ఆరోగ్యంపై చూపే ప్రభావమూ గుర్తించము.
ధూళిని చాలామంది హానికరంగా భావించనప్పటికీ, వాస్తవంలో, ఇది అత్యంత సంక్లిష్టమైన పదార్ధం. దీనిలో ధూళికణాలు, వాటి విసర్జనాలు, బ్యాక్టీరియా, చిన్న పురుగులు, ఇతర ధూళి కణాలు కూడా ఉంటాయి. సాధారణ కంటి చూపుతో చూడలేనటువంటి ఈ ధూళి కణాలు మీ ఇంటిలో పలు ప్రాంతాలలో పేరుకు పోయి ఉంటుంది. అది నేల, సోఫాలు, పరుపులపై కూడా చేరుతుంది. అతి సులభమైన అంశమైనటువంటి సోఫాలో కూర్చోవడం వల్ల కూడా గాలిలోకి ఈ ధూళి కణాలు చేరడంతో పాటుగా అలెర్జి కలిగించవచ్చు.
మనం మన జీవితకాలంలో మూడవ వంతు పరుపుల2 మీద గడుపుతుంటాము. కానీ డైసన్ గ్లోబల్ డస్ట్ స్టడీ 20221 చూపే దాని ప్రకారం భారతీయులు ఎప్పుడో కానీ తమ పరుపులను శుభ్రపరచడానికి ప్రాధాన్యతనివ్వడం లేదు. ఈ పరుపులు శుభ్రంగా ఉన్నట్లు కనబడినప్పటికీ, లక్షలాది ధూళి కణాలకు నిలయంగా ఈ పరుపులు ఉంటాయి. ఇవి మీరు నిద్రపోయినప్పుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చాలామంది ప్రజలు తమ ఫ్లోర్స్‌ను తరచుగా వాక్యూమ్ చేసినప్పటికీ ఇతర ప్రాంగణాలు అంటే పరుపులు, గోడలు, సీలింగ్స్ మొదలైన వాటిని పట్టించుకోరు. డైసన్ వద్ద మైక్రోబయాలజీ రీసెర్చ్ సైంటిస్ట్ గా సేవలనందిస్తోన్న డెన్నీస్ మాధ్యూ మాట్లాడుతూ మనం ఇంటిలో తరచుగా పట్టించుకోకుండా వదిలే ధూళి కణాలు కలిగిన ప్రాంతాలు, వాటిని శుభ్రపరుచుకోవడంలో అనుసరించాల్సిన విధానాలను గురించి కొన్ని సలహాలను అందించారు.
ఆయన మాట్లాడుతూ ‘‘కంటికి కనిపించే ధూళిని శుభ్రపరచడం అతి సహజం. అయితే, కొన్ని ప్రాంతాల శుభ్రత గురించి మనం అసలు పట్టించుకోము. ధూళి వల్ల మన ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభావం పడుతుంది. మనం తరచుగా ధూళి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేసే ప్రాంతాలు మన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. అందువల్ల, ఈ ప్రాంతాలను గుర్తించడంతో పాటుగా మైక్రోస్కోపిక్ పరిమాణంలో ఉన్నటువంటి ధూళిని సైతం తొలగించడం ద్వారా ఇంటితో పాటుగా ఆరోగ్యం సైతం కాపాడుకోవడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు.
మీ పరిశుభ్రతా కార్యక్రమాలు నిజంగా ప్రభావితం చేయడానికి, దిగువ పేర్కొన్న అత్యంత నిర్లక్ష్యం చేయబడిన స్ధలాలను ఓ సారి పరిశీలిస్తే...
1. గోడలు
గోడలను శుభ్రపరచడం గురించి మనం ఎప్పుడోకానీ ఆలోచించము. డైసన్ గ్లోబల్ స్టడీ 2022 ప్రకారం, కేవలం 32% మంది భారతీయులు మాత్రమే తమ ఇంటి గోడలను తరచుగా శుభ్రపరుస్తున్నారు. అయితే, కొన్ని రకాల గోడలపై ఉన్న ధూళి కారణంగా అచ్చులా మచ్చలు వస్తాయి. తడిగుడ్డ, క్లీనింగ్ వైప్స్ లేదంటే అడ్వాన్స్డ్ ఫిలే్ట్రషన్తో వాక్యూమ్ క్లీనర్ వినియోగించి గోడల నుంచి డస్ట్ తొలగించాలి. ఒకవేళ మీరు సీలింగ్‌తో పాటుగా గోడలను సైతం వాక్యూమ్ చేయాలనుకుంటే, ముందుగా సీలింగ్ శుభ్రపరిచి అనంతరం గోడలను శుభ్రపరచాలి. తద్వారా మీరు గాలిలో ఎగిరే ధూళి కణాలను ఒడిసిపట్టవచ్చు. మరీ ముఖ్యంగా సీలింగ్స్ శుభ్రపరిచిన తరువాత గోడలు లేదా ఫర్నిచర్ లేదా నేలపై పడే ధూళి ఒడిసి పట్టవచ్చు. పైనుంచి కిందకు క్లీనింగ్ చేయడం వల్ల మీకు కనిపించే ధూళి కణాలన్నీ ఒడిసిపట్టడం సాధ్యమవుతుంది.
2. పరుపులు
ధూళి కణాలు చర్మ కణాలపై ఉంటాయి. మృత కణాలను ఆహారంగా తీసుకుంటాయి. మన చర్మంపై నుంచి 2–3 గ్రాముల మృతకణాలు రాలుతుంటాయి. రాత్రిపూట పరుపులపై రాపిడి వల్ల ఇంకాస్త ఎక్కువగా ఇది జరుగుతుంటుంది. అందువల్ల పరుపులనేవి ఈ ధూళికణాలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా నిలుస్తాయి. పరుపుల మీద వెచ్చదనం, కటిగా ఉండటం, తేమ వంటివి వీటికి అనుకూలంగా ఉంటాయి. ఒక పరుపు మీద లక్షల కొద్దీ ధూళి కణాలు ఉంటాయి. ప్రతి కణమూ 20కు పైగా మలమూత్రాదులను విసర్జిస్తాయి. ఇవి ఎలర్జిక్ రియాక్షన్స్‌ను ఇస్తాయి. అయితే, 63% మంది భారతీయులు అసలు శుభ్రపరచక పోవడం లేదా తమ పరుపులను తరచుగా వాక్యూమ్ చేయడం లేదు అని అధ్యయనాలు 1 వెల్లడిస్తున్నాయి.
రెండు వైపులా పరుపులను వాక్యూమింగ్ చేయడం వల్ల చర్మపు మృతకణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక మీ పరుపులు మరియు వాషింగ్ షీట్స్ మరియు బ్లాంకెట్లను 145డిగ్రీల ఫారిన్ హీట్ లేదా 195డిగ్రీల ఫారిన్హీట్తో అలెర్జిక్ మెటీరియల్ పోగొట్టడంతో పాటుగా అలెర్జిన్స్‌ను తగ్గించడం మరియు విడదీయడం చేస్తాయి.
3. పెట్ బాస్కెట్లు
భారతీయులలో 21% మందికి పెట్ అలెర్జిన్స్ పట్ల అవగాహన లేదు. పెంపుడు జంతువుల సంబంధిత అలెర్జీలు ఇంటిలోని దుమ్ములో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కేవలం 36%మంది మాత్రమే తమ పెట్ బాస్కెట్లను తరచుగా1 శుభ్రపరుస్తుంటారు. పరుపుల్లాగానే, పెట్ బాస్కెట్లు కూడా ధూళి కణాలకు నిలయం. వీటిమీద పెంపుడు జంతువుల నుంచి రాలిన జుట్టు, ఇతర కణాలు ఉంటాయి. వీలైతే, తొలగించతగిన కవర్స్‌ను 140డిగ్రీల ఫారిన్‌హీట్ లేదా 195డిగ్రీల ఫారిన్ హీట్ వాష్‌తో ఉతకాలి. ఒక వేళ అలా వీలు కాకపోతే, వాక్యూమ్ క్లీనర్‌పై మినీ మోటరైజ్డ్ టూల్‌ను వినియోగించి హ్యాండ్‌హెల్డ్ మోడ్‌లో ఉంచి అవాంఛిత పెట్ హెయిర్, డాండర్, అలెర్జిన్స్‌ను తొలగించాలి.
4. దీపాలు మరియు ల్యాంప్‌షేడ్స్
ల్యాంప్‌షేడ్స్ మరియు లైట్ ఫిట్టింగ్స్పై కూడా ధూళి చేరవచ్చు. దాదాపు 73% మంది భారతీయులు వీటిని తరచుగా శుభ్రపరచడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతుంటారని అధ్యయనాలు1 చెబుతున్నాయి. మీ వాక్యూమ్ క్లీనర్‌పై సాఫ్ట్ బ్రష్ ఎటాచ్ చేయడం తో అప్టాప్ అడాప్టర్ వినియోగించడం వల్ల హై ల్యాంప్‌షేడ్స్ చేరుకోవడం సాధ్యమవుతుంది.
5. షెల్వ్స్
దాదాపు 55% మంది భారతీయులు తమ షెల్వ్స్ను తరచుగా శుభ్రపరచరు1. షెల్వ్ప్ను శుభ్రపరచడం అత్యంత కష్టమైన పని. లోతైన పరిశుభ్రత కోసం మీ షెల్వ్స్లో ఉన్న వస్తువులను అతి జాగ్రత్తగా బయటకు తీయాలి. ముందుగా టాప్ షెల్వ్ప్ను శుభ్రపరచాలి. అందువల్ల గాలిలో ఉండే ధూళి కణాలు మరలా అక్కడకు చేరవు. మీ వాక్యూమ్ క్లీనర్‌లో సాఫ్ట్ బ్రష్ ఎటాచ్‌మెంట్‌ను అప్ టాప్ అడాప్టర్‌తో వినియోగించడం ద్వారా హై అప్ ఏరియాల నుంచి డస్ట్ తొలగించడం వీలవుతుంది. తడిగుడ్డ వినియోగించి మచ్చలు లేదా మరకలు ఉంటే తొలిగించాలి. అలాగే షెల్వ్ప్ పూర్తిగా ఆరిన తరువాత మాత్రమే ఈ షెల్వ్ప్లో వస్తువులను తిరిగి అరలలో చేర్చాలి. ఒకవేళ వీలైతే, గోడ నుంచి షెల్వ్ప్బయటకు తీసి ఫర్నిచర్ కింద వాక్యూమ్ చేయవచ్చు. ఒకవేళ మీరు డస్ట్ చూసినట్లయితే, అది బ్యాక్టీరియా, మౌల్డ్స్ మరియు ధూళి కణాల కాలనీలు కావొచ్చు
6. సీలింగ్స్
సీలింగ్ టెక్చర్స్ దుమ్ము, సాలెపురుగులకు నిలయాలుగా ఉంటాయి. కానీ, వీటిని ఇప్పటికీ 65% మంది భారతీయులు తమ ఇంటి శుభ్రత సమయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. వాక్యూమింగ్ చేయడం వీటిని శుభ్రపరచడంలో అతి తేలికైన మార్గం. మీ వాక్యూమ్ క్లీనర్‌తో సాఫ్ట్బ్రష్ ఎటాచ్మెంట్ వినియోగించడం వల్ల భారీ విస్లీర్ణంలో శుభ్రపరచవచ్చు, అదే సమయంలో రంగు లేదా వాల్ పేపర్‌కు ఎలాంటి నష్టం జరగదు. మూలలు చేరుకోవడం కష్టమైతే క్రివైజ్ టూల్‌ను వాడవచ్చు. తేలిక పాటి కార్డ్ ఫ్రీ వాక్యూమ్ అనేది ఎత్తైన ప్రాంగణాలలో శుభ్రపరచడానికి చక్కటి అవకాశంగాఉంటుంది.
7. కర్టెన్స్ అండ్ బ్లైండ్స్
డైసన్ గ్లోబల్ డస్ట్ స్టడీ 20221 ప్రకారం, 68% మంది భారతీయులు తమ కర్టెన్స్ లేదా బ్లైండ్స్ను తమ ఇంటిని శుభ్రపరిచే సమయంలో మరిచిపోతున్నారు. భారీ స్ధాయిలో మురికి వాటిమీద చేరడంతో పాటుగా వస్త్రాలపై ధూళి కణాలు కూడా భారీగా ఉంటాయి. సాఫ్ట్ బ్రష్ టూల్ లేదా లాండర్‌తో మీరు వాక్యూమ్ చేయడం వల్ల మరింతగా శుభ్రపరచవచ్చు.
లోతైన శుభ్రత కోసం అత్యున్నత సలహాలు
1. తరచుగా శుభ్రపరచాలి
ధూళి అనేది ఎలకో్ట్రస్టాటికల్గా కఠినమైన నేలపై అంటుకుపోయి ఉంటుంది. ఎక్కువ కాలం ఇది నేలపై ఉండటం వల్ల , దానిని తొలగించడానికి కూడా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. తరచుగా శుభ్రపరచడం వల్ల ధూళి త్వరగా, సులభంగా వదిలించవచ్చు. ఇది మొత్తం ఇంటికి వర్తిస్తుంది కానీ కేవలం నేలకు మాత్రమే వర్తించదు. రోజుకు ఓ ప్రాంతంలో (పైన పేర్కొన్న జాబితా)లో శుభ్రపరచడం అని పెట్టుకుంటే ప్రతి నెలా మీ ఇల్లు శుభ్రపరుచుకోవడం సాధ్యమవుతుంది. ఒకేసారి ఇల్లు మొత్తం శుభ్రపరచాలనుకునే భయంకరమైన ఆలోచన నుంచి బయటపడటంతో పాటుగా మీ ఇంటిని ఆహ్లాదకరమైన రీతిలో శుభ్రపరుచుకోవడం అనేది సాధ్యం కావడానికి ఇది తోడ్పడుతుంది.
2. సరైన మార్గంలో శుభ్రపరచాలి
తడిగుడ్డ మరియు/ లేదా వెట్ మాప్‌తో శుభ్ర పరచడం వల్ల ఇంటిలో సూక్ష్మజీవులను నాశనం చేయడం సాధ్యం కావొచ్చు. అయితే, డిస్ఇన్ఫెక్టెంట్లతో వెట్క్లీనింగ్ మరియు ధూళి కణాలను వాక్యూమ్ సక్షన్‌తో తొలగించడం , రెండూ ఒకటే కాదు. ఈ రెండూ విభిన్నమైనవి. పరిశుభ్రమైన ఇంటిని చేరుకునేందుకు మనం ఏకీభావంతో పనిచేయాలి. మాపింగ్ చేసేటప్పడు తరచుగా మనం చేసే తప్పు ఏమిటంటే, మురికి నేల పై తుడవడం. మరలా అదే నీటిని ఉపయోగించడం వల్ల ధూళి కణాలకు మరింత అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటుగా మరకలు పడేందుకు సైతం అవకాశం కల్పిస్తుంటాము. మాపింగ్ చేయడానికి ముందు ఇంటిని శుభ్రంగా తుడవడం అవసరం.
3. అత్యాధునిక ఫిలే్ట్రషన్తో వాక్యూమ్స్ వినియోగించండి
వాక్యూమింగ్ ప్రధాన లక్ష్యం మీ ఇంటిలో మురికి, ధూళి తొలగించడం. అత్యాధునిక ఫిలే్ట్రషన్తో వాక్యూమ్ చేయడమనేది మీ వాక్యూమ్‌లో అన్ని అవాంఛనీయ కణాలు చేరాయన్న భరోసా అందిస్తుంది. మీ వాక్యూమ్ లోపల అవి ఉండి పోవడం వల్ల మీ ఇంటిలో మరలా వెంటనే చేరాయన్న భయం ఉండదు. ఫిలే్ట్రషన్ పరంగా 99.99% ఫిలే్ట్రషన్ చేరుకునేందుకు ఐదు దశల ఫిలే్ట్రషన్ సిస్టమ్‌తో వాక్యూమ్స్ కోసం చూడాలి. ఈ ఫిలే్ట్రషన్ పార్టికల్స్ 0.3 మైక్రాన్స్ కంటే తక్కువగా ఉంటాయి. ఈ ఫిల్టర్లు మీరు ఇంటిలో ఒడిసిపట్టిన కణాలు వాక్యూమ్ లోపల నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతో పాటుగా కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే మీ ఇంటిలోకి తిరిగి చేరే అవకాశం కల్పిస్తుంది.
4. సరైన ఉపకరణాలు వినియోగించాలి
డైసన్ గ్లోబల్ డస్ట్ స్టడీ వెల్లడించిన దాని ప్రకారం, ఇంటిలో ప్రభావవంతంగా ధూళి కణాలు తొలగించడంలో వాక్యూమ్ క్లీనర్లు ఎంతగానో సహాయపడతాయని భారతీయులు భావిస్తున్నారు. అయినప్పటికీ కేవలం 39% మంది భారతీయులు మాత్రమే వాక్యూమ్ క్లీనర్లను తమ ఇంటి శుభ్రతకోసం వాడుతున్నారు. 65% మంది వెట్ మాప్ వాడుతుంటే, 70% మంది బ్రష్మరియు పాన్ వాడుతున్నారు. ఇక ఎంతో మంది ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులలో క్లీనింగ్ చేయడం ద్వారా తరచుగా క్లీనింగ్ చేస్తున్నారు.
స్వీపింగ్ మరియు డస్టింగ్ వల్ల ఉపరితలాలు పరిశుభ్రంగా ఉన్నట్లు కనిపించవచ్చేమో కానీ ఇంటిలో నుంచి ధూళి మాత్రం అవి తొలగించలేవు. అవి ఏం చేస్తాయంటే ధూళిని పైకి లేపుతాయి. అందువల్ల అవి గాలిలో తేలియాడుతూ గదిలో మరో చోట చేరతాయి. మీ ఇంటి శుభ్రత దగ్గరకు వచ్చేసరికి అన్నిటికీ ఒకటే మందు విధానం పనిచేయదు. మీ ఇంటి పరిమాణం దగ్గర నుంచి మీ ఇంటిలో ఏ భాగం శుభ్రపరుస్తున్నారు, సరైన వాక్యూమ్ క్లీన్ ఉపకరణాలను వినియోగిస్తున్నారా లేదా అన్నది కూడా కీలకమే ! విభిన్న పరిమాణాలలో విభిన్నమైన వాక్యూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి క్లీనింగ్ అవసరమూ తీర్చే రీతిలో వీటిని డిజైన్ చేయడం జరిగింది. విభిన్న ప్రాంతాలను క్లీన్చేయడానికి విభిన్నమైన క్లీనింగ్ ఉపకరణాలు ఉన్నాయి. మినీ మోటరైజ్డ్ టూల్‌తో మీ స్టిక్ వాక్యూమ్‌ను హ్యాండ్‌హెల్డ్ వాక్యూమ్కు కట్టుబడి ఉండేలా చేస్తే, మ్యాట్రస్ (అప్‌హోలెస్ట్రీ) టూల్ ను టెక్స్టైల్స్ నుంచి డస్ట్ మరియు అలెర్జిన్స్ తొలగించే రీతిలో డిజైన్ చేశారు. క్విక్ రిలీజ్ క్రెవిక్ టూల్ మీరు అతి సన్నటి ఖాళీల్లో సైతం శుభ్రపరిచేందుకు తోడ్పడుతుంది.