Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పూర్తి సామర్థ్యానికి గ్రైండింగ్ మరియు బ్లెండింగ్ చేసిన తర్వాత కూడా ముక్కలు మురుకులతో సతమతమవుతున్నారా? చిన్న గృహోపకరణాలలో ఒక అగ్రగామి ప్రదాత అయిన ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బలమైన 1000W మోటరుతో సర్వశ్రేష్టమైన పనితీరును అందించడానికై రూపొందించబడిన ఒక పొందికైన ఇంకా శక్తివంతమైన మిక్సర్ గ్రైండర్ – HL7703 ఆవిష్కరణను నేడు ప్రకటించింది. 90 సెకెన్లలో కచ్చితమైన గ్రైండింగ్ అనుభవాన్ని వాగ్దానము చేస్తూ, ఈ కొత్త మిక్సర్ గ్రైండర్ అతి తక్కువ ఉండలతో సమమైన నునుపుదలను ఇచ్చేలా అధికమైన గ్రైండింగ్ మరియు బ్లెండింగ్ సామర్థ్యమును ఇస్తుంది. వడివడిగా అడుగులు పడుతున్న జీవనములో, వినియోగదారులు తమ పని వేగంగా అలాగే మెరుగైన సామర్థ్యముతో పూర్తి కావడానికి సహాయపడగల శక్తివంతమైన ఉత్పత్తుల కోసం చూస్తున్నారు. మిక్సర్ గ్రైండర్ల విషయానికి వచ్చినప్పుడు, వినియోగదారులు అతి గట్టివైన పదార్థాలను సైతమూ పెద్ద విడతలుగా గ్రైండ్ చేయడానికి సహాయపడగల ఉత్పాదనను కోరుకుంటున్నారు. వారి ఇంట్లో తయారు చేసుకునే పిండి ముద్దల కోసం ఎటువంటి ఉండలు లేని అత్యుత్తమ మిశ్రమాలను వారు కోరుకుంటున్నారు. వినియోగదారుల జీవితాలను సులభతరం మరియు సౌకర్యవంతం చేసే ఈ వాగ్దానముతో, ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ వారి కొత్త మిక్సర్ గ్రైండర్, ఇంట్లో సులభమైన వంటకాలను ఆస్వాదించేలా చేస్తుంది. ఆవిష్కరణపై వ్యాఖ్యానిస్తూ, ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లియెన్సెస్, ఇండియా ఉపఖండం మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ శ్రీ గుల్బహార్ తౌరణి గారు ఇలా అన్నారు, “ఒక మిక్సర్ గ్రైండర్ లేనిదే భారతీయ ఆహారపదార్థాల తయారీ సాధ్యం కాని విషయం, మరియు నేటి వంటగదులకు శక్తివంతమైనది ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ వద్ద మేము, వినియోగదారులు తమ దైనందిన అవసరాలను తీర్చుకోవడం కోసం త్వరితమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాలకై ఎదురు చూస్తున్నారని అర్థం చేసుకున్నాము, మరియు హెవీ డ్యూటీ 1000W మోటరుతో సమృద్ధమై ఉన్న కొత్త ఫిలిప్స్ HL7703 మిక్సర్ గ్రైండర్ కేవలం 90 సెకెన్లలో వేగమైన గ్రైండింగ్ మరియు నునుపైన బ్లెండింగ్ హామీ ఇస్తుంది. ఈ ఆవిష్కరణతో, మేము మా మిక్సర్ గ్రైండర్ విభాగమును మరింత విస్తరించాలని మరియు మా కస్టమర్లకు వైవిధ్యమయమైన ఉత్పాదనలను అందించాలని లక్ష్యం చేసుకుంటున్నాము” అన్నారు. కొత్త ఫిలిప్స్ HL7703 మిక్సర్ గ్రైండర్, మెరుగైన పట్టు కోసం ధృఢమైన సక్షన్ అడుగుతో పొందికైన మరియు శక్తివంతమైన పనితీరును కలిగి ఉంటుంది. ఇది మూడు స్టెయిన్లెస్ స్టీల్ జార్లు మరియు పండ్ల రసం తీసే ఫిల్టరుతో ఒక పగిలిపోని పాలీకార్బొనేట్ జార్ తో వస్తుంది. దీని అధిక ప్రశస్తమైన బ్లేడ్ డిజైన్ మసాలాలను నునుపుగా గ్రైండింగ్ చేస్తుంది, పిండి ముద్దలు, షేక్‌లను సుభంగా కలుపుతుంది మరియు కొబ్బరి లేదా బాదాం పాలను కూడా తీసుకోవచ్చు. కొత్త ఫిలిప్స్ HL7703 మిక్సర్ గ్రైండర్ కేవలం రు. 9595 లకు మాత్రమే లభిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు ఈ ఉత్పాదనను తమకు సమీపములో ఉన్న రిటైల్ ఔట్లెట్ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది ఫిలిప్స్ గృహోపకరణాల ఇ-స్టోర్ domesticappliances.philips.co.inపైన కూడా లభిస్తుంది.