Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంఛనంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఫిట్ ఏఎఫ్ , భారతీయ ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పరిశ్రమ కోసం సమగ్ర పరిష్కారాలనందించే దిశగా తమ క్యూరేటెడ్ మరియు ప్రత్యేకమైన విధానంతో వే ప్రోటీన్ (whey protein) యొక్క ఉత్పత్తి శ్రేణిని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ డీ2సీ బ్రాండ్‌ను హైదరాబాద్‌లో తయారుచేయడంతో పాటుగా ప్యాకింగ్ చేస్తున్నారు. భారతదేశంలోని వినియోగదారులకు స్థానికంగా ఉత్పత్తి చేసిన అతి కొద్ది ప్రొటీన్ బ్రాండ్‌లో ఒకటిగా నిలిచింది. ఫిట్రైడ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డైరెక్టర్ శ్రీ అమన్ లల్వానీ మాట్లాడుతూ ‘‘చాలామంది ప్రజలు పౌష్టికాహారం అనగానే చూడటానికి బాగోదు, రుచి పరంగానూ అద్భుతంగా ఉండదని భావిస్తారు. అయితే, ఫిట్ ఏఎఫ్ వద్ద, భారతీయ ఫిట్నెస్ పరిశ్రమను నూతన శిఖరాలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అదే సమయంలో రుచి, పోషకాల సమతుల్యతనూ పాటించాలనుకున్నాము. ప్రతి రోజూ ఆరోగ్యవంతమైన ఎంపికలను చేసుకునేలా ప్రోత్సహిస్తూ ప్రతి భారతీయుడూ ఫిట్‌గా ఉండటంలో సహాయపడాలనేది మా లక్ష్యం’’అని అన్నారు. మాతృసంస్ధ ఫిట్రైడ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఫిట్ ఏఎఫ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డైరెక్టర్‌గా అమన్ లల్వానీ బాధ్యతలు నిర్వహిస్తూ ఆవిష్కరణ వ్యూహాలను అమలు చేస్తున్నారు. భారతదేశంలో ఫిట్నెస్ మరియు ఫిట్నెస్ పరిశ్రమలో ఉన్న అంతరాలను అమన్ గుర్తించడంతో పాటుగా నూతన జీవనశైలి మరియు ఆప్రమప్తతతో కూడిన ఎంపికల ద్వారా విప్లవాత్మక ప్రభావం తీసుకు వచ్చే అవకాశాన్ని చూస్తున్నారు. తమ బ్రాండ్ ద్వారా భారతీయ ఆరోగ్యం మరియు పౌష్టికాహార పరిశ్రమలో చక్కటి రుచి కలిగిన ప్రొటీన్ యొక్క శూన్యతను తగ్గించాలని సంస్థ భావిస్తోంది. అతి సులభంగా కలపడంతో పాటుగా వినియోగించడానికి అనువుగా ఉండే ఫిట్ ఏఎఫ్ యొక్క వే ప్రొటీన్ ఇప్పుడు చెప్పుకోతగ్గ వాటాను ఒడిసిపట్టడంతో పాటుగా తమ అభిమానుల కోసం నిత్యం మారే రుచులను జోడించుకుంటూ రాబోయే మూడు సంవత్సరాలలో భారతదేశ వ్యాప్తంగా ఫిట్నెస్, వెల్నెస్ ప్రియులకు ప్రాధాన్యతగా ఎంపికగా నిలువాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 నాటికి, ఈ స్టార్టప్, 1300 కోట్ల రూపాయల భారతీయ స్పోర్ట్స్ న్యూట్రిషన్ మార్కెట్లో 3% వాటాను పొందాలని లక్ష్యంగా చేసుకుంది. 2023 నాటికి భారతీయ స్పోర్ట్స్ న్యూట్రిషన్ మార్కెట్ 2000 కోట్ల రూపాయలకు, 2025 నాటికి 3000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేసిన వే ప్రొటీన్ బ్రాండ్, రిచ్ చాక్లెట్, కేసర్ బాదం, అల్ఫోన్సో మ్యాంగో, రోజ్ మిల్క్, ఫ్రెంచ్ వనీల్లా ఫ్లేవర్స్‌లో getfitaf.in వెబ్సైట్లో లభ్యమవుతుంది. వేగవంతంగా వృద్ధి చెందడంతో పాటుగా ఈ–కామర్స్ మార్కెట్ ప్రాంగణాలకు చేరుకునే లక్ష్యంతో ఫిట్ ఏఎఫ్ ఇప్పుడు తమ సొంత ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను అత్యుత్తమ నాణ్యత మరియు శక్తివంతమైన విలువ ప్రతిపాదన కోరుకునే ప్రజలను ఆకట్టుకుంటూ మల్టీ ఛానెల్ వ్యూహంతో దక్షిణ భారతదేశంతో మొదలుపెట్టి దేశ వ్యాప్తంగా విస్తరించననుంది.