Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అగ్రగామి క్రిప్టో ఇన్వెస్టింగ్ యాప్ కాయిన్‌స్విచ్, కర్ణాటక ప్రభుత్వ ఇనీషియేటివ్ స్టార్టప్ కర్ణాటక మరియు పార్లమెంటు సభ్యుడు (బెంగళూరు సౌత్) తేజస్వి సూర్యతో కలిసి భవిష్యత్ నగరాలను గుర్తించి, ప్రోత్సహించే దిశలో బ్లాక్‌చెయిన్ హ్యాకథాన్‌ను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. భారతదేశంలోని 1.2 బిలియన్ల జనాభా ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలకు బ్లాక్‌చెయిన్ ఆధారిత పరిష్కారాన్ని అందించే ఉద్దేశంతో ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తుండగా, దీనికి సెక్వియా ఇండియా కూడా మద్దతు ఇస్తోంది. స్మార్ట్ సిటీ, డిజిటల్ గవర్నెన్స్ మరియు సప్లై చైన్ థీమ్‌ల చుట్టూ కేంద్రీకృతమై, భవిష్యత్ నగరాలను నిర్మించడం అనేది భారతదేశం కోసం రూపొందించిన మరియు కస్టమైజ్డ్ వెబ్3 ఇన్నోవేషన్ సైకిల్‌ను ప్రారంభించేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్ మొబిలిటీ, ఎనర్జీ క్రెడిట్స్, ట్రేడింగ్, వ్యర్థాల నిర్వహణ వికేంద్రీకృత, సురక్షితమైన డిజిటల్‌ను గుర్తించడం, సర్టిఫికేట్ల నిర్వహణ, సమర్థవంతమైన మరియు పారదర్శకమైన వ్యాక్సిన్ పంపిణీ, వ్యవసాయ సరఫరాలు మరియు సప్లయ్ చైన్ నిర్వహణపై దృష్టి సారించి బ్లాక్‌చెయిన్-ఆధారిత భారతదేశాన్ని విజువలైజ్ చేయాలని పోటీలో పాల్గొనే వారికి హ్యాకథాన్‌లో సవాలు విసురుతుంది. విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతితో పాటు హ్యాకథాన్ మొత్తం ప్రైజ్ పూల్ రూ.6 లక్షలు ఉంచారు. ఇందులో పాల్గొనేవారు వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా 4 మంది సభ్యుల బృందంలో పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ‘‘డిజిటల్ ఇండియాకు కర్ణాటక టార్చ్ బేరర్. ప్రభుత్వం మరియు పారిశ్రామికవేత్తల మధ్య కొనసాగుతున్న మృదువైన సహకారంతో రాష్ట్రం అద్భుతమైన ట్రాక్ రికార్డుతో ముందడుగు వేస్తోంది. కర్ణాటకకు ఈ హ్యాకథాన్ ద్వారా తమ విజయగాథను సాంకేతికత-బ్లాక్చెయిన్లోని తదుపరి సరిహద్దుకు తోడ్కొని వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుంది. యువ ఆవిష్కర్తలను ప్రజా ప్రయోజనాల కోసం బ్లాక్‌చెయిన్ శక్తిని ఉపయోగించుకునేలా చేస్తుంది’’ అని ఉన్నత విద్య; ఐటీ మరియు బీటీ, సైన్సు, సాంకేతికత; నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు జీవనోపాధి శాఖల మంత్రి డా.సి.ఎన్.అశ్వత్థనారాయణ్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వం, ఈ దేశంలోని ప్రతి ప్రాంతంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకువచ్చింది. బ్లాక్‌చెయిన్‌తో నడిచే భారతదేశాన్ని నిర్మించేందుకు మేము ఇప్పుడు తదుపరి పెద్ద సాంకేతిక ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నాము. కాయిన్స్విచ్తో కలిసి తొలిసారిగా బ్లాక్‌చెయిన్ హ్యాకథాన్‌లో భాగస్వామ్యం కావడానికి నేను సంతోషిస్తున్నాను. బెంగళూరులో భారతదేశ భవిష్యత్తుకు బీజాలు వేసేందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య పేర్కొన్నారు. ‘‘బ్లాక్‌చెయిన్ అనేది మన జీవితంలోని ప్రతి కోణాన్ని మార్చే శక్తివంతమైన సాంకేతికత. ‘బిల్డింగ్ ఫ్యూచర్ సిటీస్ బ్లాక్‌చెయిన్ హ్యాకథాన్’ అనేది భారతదేశంలోని డెవలపర్లు, ఇన్నోవేటర్ల బలమైన సమూహాన్ని సన్నద్ధం చేయడం అలాగే, ప్రారంభించడం ద్వారా భారతదేశంలో ఆవిష్కరణ చక్రాన్ని ఉత్తేజపరిచేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. కాయిన్స్విచ్లో, వెబ్3 ప్రపంచానికి భారతదేశం లాంచ్‌ప్యాడ్ అవుతుందని మేము ప్రతిసారీ విశ్వసిస్తున్నాము. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు హ్యాకథాన్ ఒక ముందడుగు. భారతదేశంలోని యువత మరియు మేధావులు టేబుల్ మీదకు ఏమి తీసుకువస్తారో చూసేందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని కాయిన్‌స్విచ్ సహ-వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఆశిష్ సింఘాల్ పేర్కొన్నారు.