Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : BMW మోటార్రాడ్ ఇండియా ఫస్ట్-ఎవర్ BMW G 310 RR ను భారతదేశంలో నేడు విడుదల చేసింది. భారతదేశంలో అత్యంత విజయవంతమైన BMW 310 మోడల్ శ్రేణిలో మూడవ మరియు సరికొత్త సభ్యుడిని స్వాగతం పలుకుతున్న మొదటి దేశంగా నిలించింది. ఈ బైకు నేటి నుంచి BMW మోటార్రాడ్ డీలర్‌షిప్స్‌లో అందుబాటులో ఉంటుంది.
BMW G 310 RR ను BMW మోటార్రాడ్ మరియు కోఆపరేషన్ పార్ట్నర్ TVS మోటార్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. BMW G 310 RR ను భారతదేశంలో స్థానికంగా BMW G 310 R మరియు G 310 GS లతో TVS మోటార్ కంపెనీ, హోసూరులో స్థానికంగా తయారు చేసింది.
BMW మోటార్రాడ్లో ఆసియా, చైనా, పసిఫిక్ మరియు ఆఫ్రికా హెడ్ ఆఫ్ రీజియన్ మార్కస్ ముల్లెర్-ఝంబ్రె మాట్లాడుతూ, ‘‘5 ఏళ్ల కన్నా తక్కువ సమయంలో G 310 R మరియు G 310 GS అత్యంత ప్రజాదరణను దక్కించుకున్నాయి మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ డిమాండ్‌ను అందుకున్నాయి. ఈ శ్రేణిలో మూడవ సభ్యునిగా G 310 రేంజ్‌ను మరింత వైవిధ్యమయంగా పరిచయం చేస్తుండగా R –రోడ్‌స్టర్, GS -అడ్వెంచర్ బైక్ మరియు ఇప్పుడు ఫస్ట్-ఎవర్ BMW G 310 RR సహజమైన రోడ్ రేసింగ్ స్పోర్ట్స్ బైక్. BMW G 310 RR’s పనితీరు, ఎజిలిటీ, ప్రిసిషన్ మరియు రేరింగ్-టు-గో ఫ్లేర్ రేసింగ్ ప్రవృత్తిని ఆవిష్కరిస్తుంది. BMW మోటార్రాడ్కు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో దీన్ని మొదట విడుదల చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది’’ అని తెలిపారు. BMW గ్రూపు ఇండియా ప్రెసిండెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ, ‘‘ఫస్ట్-ఎవర్ BMW G 310 RR బైకు 500 కన్నా తక్కువ వర్గాల్లో అత్యంత స్పోర్టీనెస్ మరియు అత్యంత డిమాండ్ కలిగిన స్పోర్ట్స్ బైకుగా ఉంది. ఈ బైకు ద్వారా రోడ్ రేసింగ్ వంశ పారంపర్యతను సగర్వంగా ఉత్తరాధికారి నుంచి అందుకుంది. అది రహదారిపై అన్లిమిటెడ్ స్టన్నింగ్తో స్పోర్ట్స్ బైకు ఔత్సాహికులను ఉత్సాహపరుస్తుంది. అత్యాకర్షక సూపర్‌బైక్ డిజైన్ మరియు ఆధునిక సాంకేతికత సమ్మేళనంతో ఇది రేస్ ట్రాక్‌లు మరియు నగరంలోని రహదారులపై మీకు అత్యుత్తమ భాగస్వామిగా అల్టిమేట్ రైడింగ్ మెషిన్‌గా ఉంటుంది. RRతో మీరు సవాళ్లు విసరడాన్ని ఎప్పటికీ నిలుపరని’’ పేర్కొన్నారు. ఫస్ట్-ఎవర్ BMW G 310 RR రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు ఈ దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి- స్టైల్ స్పోర్ట్
BMW G 310 RR - INR 285,000
BMW G 310 RR స్టైల్ స్పోర్ట్ - INR 299,000
* ఇన్వాయిసింగ్ సమయపు ధరలు అన్వయిస్తాయి. డెలివరీని ఎక్స్-షోరూమ్ తరహాలో అందిస్తారు. ఎక్స్-షోరూమ్ ధర (GST మరియు కాంపన్సేషన్ సెస్ కలిసి ఉంటుంది) అన్వయించేలా ఉంటుంది అయితే రోడ్ ట్యాక్, RTO స్టాచ్యుటరీ ట్యాక్సెస్/ఫీజ్, ఇతర ట్యాక్స్‌లు/సెస్ లెవీస్ మరియు ఇన్సూరెన్స్ కలిసి ఉండవు. ధరలు మరియు ఎంపికలు ముందుగా తెలియజేయకుండానే మారిపోయే అవకాశం ఉంది. మరింత సమాచారానికి దయచేసి మీరు స్థానిక అధీకృత BMW మోటర్రాడ్ డీలర్‌ను సంప్రదించండి.
కొత్త BMW G 310 RR ను మూడు మోటార్‌సైకిల్ రేసింగ్ స్ఫూర్తి వర్ణాలైన లైట్ వెయిట్ యూనిలో స్టైల్ స్పోర్ట్, రేసింగ్ బ్లూ మెటాలిక్ మరియు రేసింగ్ రెడ్ యూనికలర్స్లో విడుదల చేసింది. ఐచ్ఛిక బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ పెయింట్ వర్క్ ఈ డైనమిక్ మొత్తం మీద ఎక్స్టీరియర్ రూపాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది.
BMW G 310 RR, 1000 RR కు చెందిన డిఎన్ఏ కలిగి ఉండగా, సరిసాటి లేని అడ్రినలైన్ రష్ను అందిస్తుంది మరియు BMW మోటార్రాడ్ స్పోర్ట్ బైక్‌ల కుటుంబానికి తోడ్కొని వెళుతుంది. నగరంలో వేగం మరియు చిన్న దారులు, రహదారిపై విశ్వాసాన్ని అందిస్తూ, శక్తియుతంగా ఉంటుంది.
సులభంగా ఈ వాహనంపై యాజమాన్యాన్ని పొందేందుకు BMW ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫస్ట్-ఎవర్ BMW 310 RR పూర్తి ప్యాకేజ్ అందిస్తుంది. అనుకూలతల్లో INR 3,999 నుంచి ప్రారంభమై నెలవారీ చెల్లింపులు తక్కువ డౌన్‌పేమెంట్ మరియు ఇన్సూరెన్స్ మరియు యాక్ససరీలకు నగదు పొందే ఎంపిక ఉంటుంది.
సంపూర్ణ మనశ్శాంతికి BMW మోటర్రాడ్ బైక్‌లు అపరిమిత కిలోమీటర్ల మూడేళ్ల స్టాండర్డ్ వారెంటీతో లభిస్తాయి. ఈ వారెంటీని ఆకర్షణీయమైన ఖర్చుతో నాలుగు మరియు ఐదో ఏడాదికి విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. రోడ్-సైడ్ అసిస్టెన్స్, 24x7 365 రోజుల ప్యాకేజ్ బ్రేక్‌డౌన్ అయినప్పుడు మరియు టోయింగ్ సందర్భాల్లో ప్రామాణికమైన సేవలను ధ్రువీకరిస్తుంది.
BMW G 310 RR
BMW G 310 RR తన ఏరో డైనమిక్ డిజైన్‌తో తన రోడ్ రేసింగ్ DNA ద్వారా అత్యంత క్రీడా ఔట్‌లుక్‌ను తీసుకు వచ్చింది: సంపూర్ణ ఫేరింగ్ మరియు RR బ్రాండింగ్/గ్రాఫిక్స్. దీనిలో రాజీలేని సూపర్ బైక్ డిజైన్ మరియు మోటార్ స్పోర్ట్స్ వర్ణాలు రోడ్-రేస్ వర్గంలో స్పష్టమైన వర్గీకరణ అందిస్తుంది. ఈ ఏరో డైనమిక్ డిజైన్‌ను ఫుల్ ఫేరింగ్తో ఉన్నతీకరణ చేయగా, తెలివైన కొలతలు మాత్రమే కాకుండా తేలికపాటి వస్తువులతో తక్కువ తూకంతో మరియు నికరమైన నిర్వహణను అందిస్తాయి. దానికి రామ్ ఎయిర్ ఇన్‌టేక్ కారణం కాగా అందులో గాలి ప్రవాహాన్ని సరైన విధానంలో వినియోగించుకుంటుంది మరియు గిల్ వెంట్స్ వేడి గాలిని ఇంజిన్ నుంచి బయటకు పంపిస్తున్న అంశాన్ని ధ్రువీకరిస్తాయి. ఈ బైకు ఫుల్-ఎల్ఇడి హెడ్‌లైట్స్‌తో ఆక్రమణకారి మరియు తీక్షణత ముఖాన్ని కలిగి ఉండడంతో పాటు, పెద్దదైన పారదర్శక విసర్ మరియు పరిశుద్ధమైన నలుపు హ్యాండిల్ బార్స్‌ను కలిగి ఉంది. పూర్తి ఫ్లై లైన్ ముందు చక్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ డైనమిక్, ట్యాంక్‌పైకి ఎక్కే సీటు స్థానం మరియు లాగిన రియర్ చిన్నదైన రేస్ ట్రాక్‌కు చేరువలో ఉండటాన్ని చాటి చెబుతుంది.
స్టాండర్డ్ గోల్డ్ అప్‌సైడ్ –డౌన్ ఫోర్క్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, హ్యాండిల్ బార్స్ నియంత్రణలను మరియు అత్యుత్తమ వర్క్మెన్షిప్తో ఈ శ్రేణిలో అత్యుత్తమైన దాన్ని ప్రతిబింబిస్తుంది మరియు సూక్ష్మమైన మరియు కచ్చితమైన ఫీడ్‌బ్యాక్ ద్వారా స్థిరమైన వీల్ కంట్రోల్ అందిస్తుంది. స్టాండర్డ్ మిషెలిన్ పైలెట్ స్ట్రీట్ రేడియల్ టైర్స్ అత్యుత్తమ గ్రిప్ మరియు నియంత్రణతో పరిపూర్నంగా ఈ లక్షణంతో ఒదిగిపోతాయి.
ఫస్ట్-ఎవర్ BMW G 310 RR వాటర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఫోర్ స్ట్రోక్ 313-cc ఇంజిన్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో జోడించి ఉంటుంది. ఈ ఇంజిన్ 9,700 rpm లో గరిష్ఠంగా 25kW శక్తిని సాధించడమే కాకుండా అంతేకాకుండా 27.3 NM టార్క్‌ను 7,700 rpm లో సాధిస్తుంది. ఈ మోటార్ సైకిల్ కేవలం 2.9 సెకండ్లలో 0 – 60 km/hr యాక్సలరేట్ చేస్తుంది.
దీనిలోని 6-స్పీడ్ గేర్ బాక్స్ గేర్‌బాక్స్ గేర్ ఎంగేజ్‌మెంట్‌ను సులభం చేస్తుంది మరియు కచ్చితమైన షిఫ్ట్‌లు మరియు లాంచ్ సమయంలో అధిక వేగంతో జారిపడదు. ఈ రేస్ ట్యూన్డ్ జర్కు ఇవ్వకుండా క్లచ్ ఆటోమేటిక్-బలవర్థనతో ఇంజిన్ బ్రేకింగ్ తక్కువ చేస్తుంది మరియు ముఖ్యంగా ఏకకాలానికి ఏటవాలు ప్రదేశంలో బ్రేకింగ్ కౌశల్యతల్లో రైడింగ్ సురక్షతను గమనార్హంగా వృద్ధి చేస్తుంది. ఇది క్లచ్ లివర్లలో పని నిర్వహణ బలాన్ని గమనార్హంగా తక్కువ చేస్తుంది. వివిధ సందర్భాల్లో వినియోగానికి 310 RR ట్రాక్, అర్బన్, రెయిన్ మరియు స్పోర్ట్స్ అనే నాలుగు మోడ్లతో అనుసంధానమై ఉంటుంది.
విభిన్న పరిస్థితులకు అనువైన అనుసరణకు, 310 RR ప్రామాణికంగా నాలుగు మోడ్లతో అమర్చబడింది – ట్రాక్, అర్బన్, రెయిన్ మరియు స్పోర్ట్. ట్రాక్ మోడ్ యాక్సిలరేషన్ నుండి బ్రేకింగ్ వరకు ఫోకస్ చేసి ఉండడంతో, ఇక్కడ నమ్మకంగా ఆలస్యంగా బ్రేకింగ్ చేయడానికి ABS సర్దుబాటు చేస్తుంది. అర్బన్ మోడ్ సమతుల్య యాక్సలరేషన్ మరియు బ్రేకింగ్ ప్రవర్తనను కలిగి ఉంటుంది. ఎందుకంటే ABS మరియు థ్రాటెల్ రెస్పాన్స్ కూడా అర్బన్ ట్రాఫిక్‌కు అనుగుణంగా ఉంటాయి. స్పోర్ట్ మోడ్ స్పోర్టీ డైనమిక్స్‌తో సాధ్యమైనంత ఉత్తమమైన యాక్సలరేషన్ మరియు గరిష్ట డీసిలరేషన్ విలువలను అందిస్తుంది. చివరగా, రైడ్ బై వైర్‌తో రెయిన్ మోడ్ అనుసంధానమై ఉండడంతో తడి రోడ్లపై రైడింగ్ చేసే సమయంలో భద్రత మరియు స్థిరత్వ నియంత్రణకు హామీ ఇచ్చేందుకు ABS అత్యంత మృదువుగా స్పందిస్తుంది.
రైడ్ బై వైర్ సిస్టమ్ కమాండ్లలో E -గ్యాస్ పాసెస్తో ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్‌కు ట్విస్ట్ గ్రిప్లోని సెన్సర్లతో నేరుగా నియంత్రిస్తుంది. దీనితో అత్యుత్తమ నియంత్రణ మరియు థ్రాటల్ ప్రతిస్పందన లభిస్తుంది. దానికి కారణం ఎలక్ట్రోమోటివ్ థ్రాటల్ కంట్రోలర్. ప్రారంభించే సమయంలో ఆటోమేటిక్ ఐడిల్ స్పీడ్ వృద్ధి చెందడం ద్వారా ఇంజిన్ హఠాత్తుగా నిలిచే అవకాశాలు తగ్గుతాయి.
సస్పెన్షన్‌కు టార్సనలీ స్టిఫ్, అత్యంత సదృఢమైన ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్‌ను గ్రిడ్ డిజైన్ కలిగి ఉండగా, బోల్ట్-ఆన్ రియర్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్నాయి. ఫ్రంట్ వీల్ సస్పెన్షన్‌ను దృఢమైన అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ గమనిస్తుంది మరియు వెనుకవైపు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ నేరుగా జోడించిన స్ప్రింగ్ స్ట్రట్తో అనుసంధానమవుతుంది. సస్పెన్షన్ జియోమెట్రిను సులభంగా నిర్వహణ చేసేందుకు, స్థిరత్వానికి మరియు తటస్థమైన కార్నరింగ్ రెస్పాన్స్‌కు డిజైన్ చేయగా, అది క్రియాశీలకమైన రైడింగ్ లక్షణం అలాగే గరిష్ఠ రైడింగ్ వినోదాన్ని అందిస్తుంది.
మల్టిఫంక్షనల్ 5” TFT డిస్ప్లే అత్యుత్తమ స్థాయి పని తీరును అందిస్తుండగా అది ఎక్కువ వేగపు రైడింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దాని ఇంటూటివ్ ఫ్రేమ్‌వర్క్, హై-రెసొల్యూషన్ మరియు స్పష్టమైన గ్రాఫిక్స్ రైడర్‌కు పూర్తి సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకునేలా అందిస్తుంది. ఇది రైడింగ్ గణాంకాలు, రైడింగ్ మోడ్స్, గరిష్ఠ వేగం, డిసెలెరేషన్, ఉష్ణత తదితర అవసరాలను చూపిస్తుంది.
ది ఇన్ఫోటెయిన్మెంట్ కంట్రోల్ స్విచ్ అన్ని పనులకూ పరిపూర్ణమైన పని నిర్వహణ అందించడం ద్వారా కోరుకున్న మోడ్లు లేదా రూపాలను అందిస్తుంది. రైడింగ్ మోడ్ ఆధారంగా TFT డిస్ప్లే స్క్రీన్కు సంబంధించిన సమాచారంతో కస్టమైజ్ చేస్తుంది.
హై-పర్ఫార్మెన్స్ బ్రేక్ సిస్టమ్ 2-ఛానెల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో దక్షతతో యాక్సలరేషన్ మరియు తక్షణ బ్రేకింగ్ దూరాన్ని అందిస్తుంది. BMW మోటర్రాడ్ ABS చక్రాలను లాకింగ్ నుంచి అడ్డుకుంటుంది మరియు రియర్ వీల్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ రేస్ బైకు చక్రాలను బ్రేకింగ్ అంచుల్లో చేసినా ట్రాక్ పైనే నిలుపుతుంది.