Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను పెంచేసింది. ఇప్పటికే ప్రకటించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్ల పెంపును గురువారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ కనీస వడ్డీ రేటు గృహ, వాహన, రిటైల్ తదితర వాటిపై వర్తించనుంది. ఈ నిర్ణయంతో ఎస్బీఐ ఇచ్చే పలు రుణాలపై కీనీస వడ్డీ రేటు 7.05 శాతం నుంచి 7.15 శాతానికి చేరింది. పలు కాలపరిమితులు, విభాగాలు, రుణ గ్రహీత పరపతని బట్టి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి.