Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ గురువారం భారత మార్కెట్లోకి గెలాక్సీ ఎం13 సీరిస్‌ను విడుదల చేసింది. 12 జిబి ర్యామ్, 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఎఫ్‌హెచ్‌డి డిస్ప్లేతో ఆవిష్కరించిన ఈ సీరిస్ ఫోన్లు 5జి నెట్‌వర్క్‌కు మద్దతు చేస్తాయని సామ్సంగ్ మొబైల్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్యా బబ్బర్ పేర్కొన్నారు. దీన్ని 50 ఎంపి ట్రిపుల్ రేర్ కెమెరాతో అందుబాటులోకి తెచ్చింది. జులై 23 నుంచి మార్కెట్లో విక్రయానికి ఉంచుతున్నట్లు పేర్కొంది. ఇవి చౌక ధరలో లభించే స్మార్ట్ఫోన్లని ఆదిత్యా పేర్కొన్నా రు. ఈ సీరిస్‌లో ప్రారంభ ధరను రూ.11,999గా నిర్ణయించింది.