Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు
న్యూఢిల్లీ: మోడీ సర్కార్ తల పెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంక్ (పీ ఎస్బీ)ల ప్రయివేటీకరణను నిరసి స్తూ బ్యాంకింగ్ సంఘాలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చే యాలని నిర్ణయించాయి. పీఎస్బీ లను రక్షించాలని, ప్రయివేటీకరణను ఆపాలని ఆదివారం ట్విట్టర్ వేదికలో ఆందోళన చేయనున్నట్లు యు నైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) వెల్ల డించింది. కొనసాగింపుగా జులై 21న పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నామని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకటాచలం తెలిపారు. జులై 18నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగ నున్నాయి. ప్రస్తుత కాలంలో సంప్రదాయ ఆందోళనలతో పాటుగా సోషల్ మీడియాలో సమస్యను చర్చకు తీసుకురావడం ముఖ్యమైందని వెంకటాచలం పేర్కొన్నారు.