Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ డీజీఎం కనిమొజీ
హైదరాబాద్: ప్రభుత్వ పరంగా బ్యాంకులు కల్పిస్తున్న వివిధ రకాల లోన్ సదుపాయాలను ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు వినియో గిం చుకొని అభివృద్ధి చెందాలని కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ డీజీఎం కనిమొజీ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వే త్తలకు నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్(ఎన్ఎస్ఎస్ హెచ్) పథకాలపై అవగా హన సదస్సును నేషనల్ స్మాల్ ఇండిస్టీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండిస్టీ(సీఐడీఐ) సంయుక్తంగా దోమలగూడలోని సీఐడీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యతిథిగా హాజరైన కనిమొజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని, దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్న త స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకులు కల్పించే రుణాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఎన్ఎస్ఎస్ హెచ్ అనేది ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యే క సెల్ అని పేర్కొన్నారు. గౌరవ అతిధి సీడీటీఐ చైర్మెన్ రాజశేఖర్ యర్ర తోట మాట్లాడుతూ ప్రభుత్వ పర్చేస్ పథకం ప్రవేశ పెట్టాలన్నా రు. ఎగ్జిబిషన్స్‌లో సబ్సిడీతో భాగంతో పాటు, ప్రభుత్వ టెండర్లలో రా యితీలో భాగం కల్పించాలని కోరారు. తక్కువ వడ్డీకి రా మెటీరియల్ పథకం ప్రవేశపెట్టి, ఉచితంగా ఎగ్జిబిషన్ విభా గం, ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలన్నారు. ఇతర బ్యాంకుల నుంచి రుణ సదుపా యానికి మధ్యవర్తిత్వం వహించాలన్నారు. ఎగుమతుల, దిగుమతుల కు మార్గదర్శకత్వం, సహాయం, రాయితీ కల్పించాలన్నారు. ప్రముఖ సా ంకేతిక విద్య, ట్రైనింగ్ సంస్థల్లో 90 శాతం కల్పించాలన్నారు. సీడీటీఐ చీఫ్ మెంటర్ రాజ్ కుమార్ నర్రా, సీడీటీఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షు డు రాజు నీరుడి, ప్రధాన కార్యదర్శి కృష్ణ యాసరపు, వర్కింగ్ ప్రెసిడెం ట్ లక్ష్మణ్ ఎద్దుల, ఎన్ఎస్ఐసీ సీనియర్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్.సురేష్ పాల్గొన్నారు.