Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎంజీ సార్థీ కార్యక్రమం క్రింద ఎంజీ వినియోగదారుల డ్రైవర్లకు శిక్షణ అందించడంతో పాటుగా అదనపు నైపుణ్యాలను ఎంజీ మోటర్స్ అందించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంజీ కార్లలో అత్యాధునిక సాంకేతికతల పట్ల డ్రైవర్లకు అవగాహనను కేస్ (CASE -కనెక్టడ్,అటానమస్, షేర్డ్ మరియు ఎలక్ట్రిక్) లక్ష్యంతో అందించారు. సురక్షితంగా వాహనం నడపడంలో అనుసరించాల్సిన తాజా పద్ధతులను గురించి వారికి వివరించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖా కమిషనర్ శ్రీ కె పాపారావు పాల్గొనడంతో పాటుగా పాల్గొన్న అభ్యర్థులను సత్కరించారు. ఇప్పటి వరకూ ఎంజీ దాదాపు 1500మంది డ్రైవర్లకు ఈ ఎంజీ సార్ధీ కార్యక్రమం కింద దక్షిణ భారతదేశంలో అదనపు నైపుణ్యాలను అందించింది. ఈ శిక్షణ కోసం ఎంజీ వినియోగదారుల తమ డ్రైవర్ల పేర్లను దగ్గరలోని డీలర్షిప్ల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శిక్షణను పూర్తి ఉచితంగా అందిస్తారు. ఎలక్ట్రిక్ మరియు కనెక్టడ్ వాహనాలను పరిచయం చేయడంతో భారతీయ ఆటో పరిశ్రమ ముఖ చిత్రం సమూలంగా మారింది. భావి తరపు సాంకేతికతల పూర్తి ప్రయోజనాలు పొందాలన్న ఎడల వాటి ప్రయోజనాలు, ఫీచర్ల పట్ల పూర్తి అవగాహన డ్రైవర్లకు ఉండటం ఆవశ్యకం.