Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాలిఫోర్నియాలో అత్యంత పురతానమైన ప్రైవేట్, లాభాపేక్షలేని యూనివర్శిటీలలో ఒకటైన తమ యూనివర్శిటీ భాగస్వామి గోల్డెన్ గేట్ యూనివర్శిటీ (జీజీయు) తో కలిసి నూతన ప్రోగ్రామ్ విడుదల చేసిన తరువాత ఆసియాలో ఉన్నత విద్యలో అగ్రగామి సంస్థలలో ఒకటైన అప్‌గ్రాడ్ తమ మొట్టమొదటి మైలురాయి అయిన 200కు పైగా విద్యార్థుల మైలురాయిని చేరుకోవడంతో పాటుగా 700 మిలియన్ రూపాయలకు పైగా స్కాలర్షిప్ గ్రాంట్‌ను తమ నూతన జీజీయు విద్యార్థులకు అందజేసింది.
భారతీయ , అంతర్జాతీయ విద్యార్థులకు ఐదు ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను అందుబాటులో ఉంచిన అప్‌గ్రాడ్, ఈ స్కాలర్షిప్లను జీజీయు వరల్డ్‌వైడ్ విద్యార్థులకు 83%కు పైగా ట్యూషన్ ఫీజులను కవర్ చేస్తూ అందిస్తుంది. ఈ సంస్థ అందిస్తోన్న కార్యక్రమాలలో ఎంబీఏ, డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్ (డీబీఏ) అత్యంత ప్రాచుర్యం పొందినవి. వీటిని అనుసరించి మాస్టర్ ఆఫ్ లా – ఇంటర్నేషనల్ బిజినెస్ మరియు ఫైనాన్స్ లా ; బిజినెస్ ఎనలిటిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ , ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ వంటివి ఉన్నాయి. త్వరలోనే బ్యాచులర్ డిగ్రీలతో కూడా జీజీయు వరల్డ్‌వైడ్ అనుబంధం కుదుర్చుకోనుంది.
ఈ మైలురాయి గురించి అప్‌గ్రాడ్ కో ఫౌండర్ ఫల్గున్ కొంపల్లి మాట్లాడుతూ ‘‘పరిశ్రమలో మారుతున్న ధోరణులకనుగుణంగా ప్రోగ్రామ్‌లను సృష్టించడం మాకు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. అయినప్పటికీ దానిని సవాల్‌గా స్వీకరిస్తుంటాము. మా అభ్యాసకులకు అంతర్జాతీయంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా ప్రభావవంతమైన స్కాలర్‌షిప్‌లతో వారి కలలను సాకారం చేస్తున్నాం. మా జీజీయు పోర్ట్‌ఫోలియోకు వచ్చిన స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
‘‘లాభాపేక్షలేని యూనివర్శిటీ గా మేము జీజీయు వరల్డ్వైడ్ను ప్రారంభించడంతో పాటుగా అప్‌గ్రాడ్‌తో కలిసి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాము. భారతదేశం నుంచి ఈ కార్యక్రమాలకు అమితాసక్తి కనిపిస్తోంది. తమ ప్రస్తుత ఉద్యోగాలు చేసుకుంటూనే యుఎస్ యూనివర్శిటీలలో విద్యనభ్యసించే అవకాశం ప్రొఫెషనల్స్‌కు లభిస్తుంది’’ అని ప్రొఫెసర్ జే గోన్జాలేజ్, వైస్ ప్రోవోస్ట్– గ్లోబల్ ఎఫైర్స్, గోల్డెన్ గేట్ యూనివర్శిటీ అన్నారు.